Bachchan Diwali: బచ్చన్ ఇంట్లో దివాళి వేడుకలు- బావమరదళ్లు ఆరాధ్య, అగస్త్య ఫొటోలు వైరల్- మీ అత్త ఐశ్వర్య రాయ్ ఎక్కడంటూ!

Amitabh Bachchan Family Diwali Celebration: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా తన కుటుంబ దివాళీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బావమరదళ్లు ఆరాధ్య బచ్చన్, అగస్త్య నందా ఆప్యాయంగా దిగిన ఫొటోలు వైరల్ అవుతన్నాయి. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Published on: Nov 9, 2026, 13:34:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Amitabh Bachchan Family Diwali Celebration: దీపావళి పండుగ వేళ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏడాదీ ఎంతో వైభవంగా వెలుగుల పండుగను జరుపుకునే బచ్చన్ కుటుంబం, ఈసారి కూడా అందరూ ఒకే చోట చేరి పండగ చేసుకున్నారు. అమితాబ్ మనవరాలు, యువ మహిళా పారిశ్రామికవేత్త నవ్య నవేలి నందా తన ఇంట్లోని సంబరాల దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

బచ్చన్ ఇంట్లో దివాళి వేడుకలు- బావమరదళ్లు ఆరాధ్య, అగస్త్య ఫొటోలు వైరల్- మీ అత్త ఐశ్వర్య రాయ్ ఎక్కడంటూ!
బచ్చన్ ఇంట్లో దివాళి వేడుకలు- బావమరదళ్లు ఆరాధ్య, అగస్త్య ఫొటోలు వైరల్- మీ అత్త ఐశ్వర్య రాయ్ ఎక్కడంటూ!

ఆకట్టుకున్న ఆరాధ్య-అగస్త్యల అనురాగం

ఈ ఫోటోల్లో ప్రధానంగా అమితాబ్ మనవడు అగస్త్య నందా, అభిషేక్-ఐశ్వర్య దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని దిగిన ఫోటో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆరాధ్య ఫోటోలు నెట్టింట చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న బిగ్ బి మనవడు, మనవరాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ నవ్వులు చిందించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో బావమరదళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఆయన సోదరి శ్వేతా బచ్చన్ క్రాకర్స్ కాలుస్తూ చిన్నపిల్లల్లా సరదాగా గడిపిన క్షణాలు కూడా నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

నవ్య నవేలి ఎరుపు రంగు పలాజో డ్రెస్‌లో ఎంతో అందంగా మెరిసిపోయారు. బాలీవుడ్ హీరోయిన్, తన ప్రాణస్నేహితురాలు అనన్య పాండేతో కలసి ఆమె దిగిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. "నా మనసుకు అత్యంత చేరువైన వారితో సంతోషకరమైన దీపావళి జరుపుకున్నాను" అని నవ్య ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి స్పందించిన అనన్య పాండే "నువ్వే నా వెలుగు" అంటూ ప్రేమగా కామెంట్ చేశారు.

నెటిజన్ల ప్రశ్నలు.. ఐశ్వర్య రాయ్ ఎక్కడ?

బచ్చన్ ఫ్యామిలీ దీపావళి ఫోటోలు బయటకు రాగానే నెటిజన్ల నుంచి భిన్న రకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. అగస్త్య, ఆరాధ్యల అనుబంధాన్ని అభినందిస్తూనే, మరోవైపు నటి ఐశ్వర్య రాయ్ ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.

"నవ్య, మీ మామి (అత్త) ఐశ్వర్య రాయ్ ఏ ఫోటోలోనూ కనిపించడం లేదేంటి?" అని ఒక అభిమాని కామెంట్ సెక్షన్‌లో అడిగారు. గత కొంతకాలంగా బచ్చన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, ఈ ఫోటోలు మరింత చర్చకు దారితీశాయి.

బచ్చన్ వారసత్వం.. క్రమశిక్షణే మూలం

అమితాబ్ బచ్చన్ కుటుంబంలో శ్వేతా బచ్చన్, నిఖిల్ నందాల కుమార్తె నవ్య నవేలి నందా మహిళా ఆరోగ్యంపై పనిచేసే 'ఆరా హెల్త్' అనే సంస్థను నిర్వహిస్తున్నారు. ఆమె తమ్ముడు అగస్త్య నందా 'ది ఆర్చీస్' సినిమాతో నటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య ప్రస్తుతం పాఠశాల విద్యనభ్యసిస్తోంది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో నవ్య తమ కుటుంబ విలువల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇంట్లో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికీ పరస్పర గౌరవం ఇవ్వడం నేర్పించారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతుల నుంచి మేము నేర్చుకున్న అతిపెద్ద విలువ ఇదే" అని నవ్య పేర్కొన్నారు.

సినిమా గ్లామర్ పక్కన పెడితే, భారతీయ సంస్కృతికి, కుటుంబ బంధాలకు బచ్చన్ నివాసం 'జల్సా' నిలువెత్తు రూపంగా నిలుస్తుందని అభిమానులు కొనియాడతారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More