Aaradhya Bachchan: ఆరాధ్య బచ్చన్ కేసు.. తరతరాల బ్రాండ్ ఇమేజ్ పిల్లలకు వర్తిస్తుందా? ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్నలు

Aaradhya Bachchan Case Delhi High Court: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై యూట్యూబ్‌లో వచ్చిన అనారోగ్యం వీడియోల వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు తరతరాలకు వర్తిస్తాయా అని ప్రశ్నించింది.

Published on: Aug 15, 2026, 13:07:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aaradhya Bachchan Case Delhi High Court: ప్రముఖ బాలీవుడ్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిగత హక్కులు) కేసుపై ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఆరాధ్య ఆరోగ్యంపై, ఆమె వ్యక్తిగత జీవితంపై యూట్యూబ్‌లో వస్తున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరుతూ 2023లో దాఖలైన ఈ పిటిషన్‌పై జస్టిస్ అనూప్ జే భాంబానీ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆరాధ్య బచ్చన్ కేసు.. తరతరాల బ్రాండ్ ఇమేజ్ పిల్లలకు వర్తిస్తుందా? ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్నలు
ఆరాధ్య బచ్చన్ కేసు.. తరతరాల బ్రాండ్ ఇమేజ్ పిల్లలకు వర్తిస్తుందా? ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్నలు

కుటుంబం పేరు, ట్రేడ్‌మార్క్ ఒకటేనా?

విచారణ సమయంలో న్యాయమూర్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (మేధో సంపత్తి హక్కులు) కోణంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. సాధారణంగా ఒక వస్తువు లేదా సేవకున్న ప్రతిష్ట ఆధారంగా ట్రేడ్‌మార్క్ విలువ ఆధారపడి ఉంటుందని, కానీ ఒక వ్యక్తి లేదా కుటుంబం విషయానికి వస్తే ఇది భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఏ హద్దు వరకు చెల్లుబాటు అవుతుంది

"సమాజంలో ఒక కుటుంబం సాధించిన విజయాలు, గుర్తింపు వల్ల ఆ ఇంటిపేరుకు ఒక గొప్ప ప్రతిష్ట వస్తుంది. మరి ఆ పేరు ప్రఖ్యాతులు తరతరాలకు, రాబోయే తరం పిల్లలకు కూడా అలాగే వర్తిస్తాయా? వర్తిస్తే ఏ హద్దు వరకు అది చెల్లుబాటు అవుతుంది?" అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉల్లంఘన కిందకే వస్తుందా?

ఒకవేళ అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే అది తీవ్రమైన నేరమే అయినప్పటికీ, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉల్లంఘన కిందకే వస్తుందా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

బచ్చన్ కుటుంబం వాదన ఇదిగో!

బచ్చన్ కుటుంబం తరఫున ప్రముఖ అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. అమితాబ్ బచ్చన్ నుంచి వచ్చిన బ్రాండ్ ఇమేజ్, గౌరవ మర్యాదలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని

బచ్చన్ కుటుంబం మొత్తానికి ఉన్న గుడ్‌విల్‌ను దెబ్బతీసేలా, వారి ఫొటోలను ఉపయోగిస్తూ యూట్యూబ్‌లో తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ తరహా కుట్రల వల్ల కాలక్రమేణా ఆ కుటుంబ ప్రతిష్ట తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నారుల హక్కులపై గతంలో ఘాటు వ్యాఖ్యలు

2023 ఏప్రిల్ 20న జరిపిన విచారణలో ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆరాధ్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిందని, చివరకు ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగిందంటూ కొన్ని ఛానళ్లు సృష్టించిన తప్పుడు వీడియోలను తక్షణమే తొలగించాలని గూగుల్, యూట్యూబ్‌లను ఆదేశించింది.

చిన్నారి ఆరోగ్యంపై

"ఒక చిన్నారి ఆరోగ్యంపై ఇలాంటి వికృత కథనాలు ప్రసారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. సమాజంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించే హక్కు ప్రతీ చిన్నారికీ ఉంటుంది. గూగుల్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి బాధ్యతారాహిత్య కంటెంట్‌ను అనుమతించకూడదు" అని అప్పట్లో ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం

చిన్నారుల మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా యూట్యూబ్‌లో వ్యూస్ కోసం చేసే వ్యాపారాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ నెలలోని విచారణకు వాయిదా వేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More