Brahmamudi November 5 Episode: బ్రహ్మముడి- చలపతి పర్మిషన్- రేఖ బెదిరింపులకు రాజు తిరకాసు- లక్కీని ఉసిగొల్పిన ఐశ్వర్య
Brahmamudi Serial November 5th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 5వ ఎపిసోడ్లో రాజును లక్ష్మి నిలదీస్తే ఏడుస్తుంటాడు. అదంతా చూసిన చలపతిని లక్ష్మి నిలదీస్తుంది. ఇందు మాటలు గుర్తొచ్చిన చలపతి రాజు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తాడు. రాజు బెదిరింపులకు ఫంకీ వినయ్ పారిపోతాడు. రేఖ బెదిరించాలని చూస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజుతో తల్లి లక్ష్మి మాట్లాడుతుంది. ఆయన అన్నారని నీతో చేయి పట్టుకుని నడవాలనుకున్న ఇందును వదిలేస్తావా అని నిలదీస్తుంది. నాన్నను ఏమనకమ్మా. నాకు జన్మనిచ్చారు. నాన్న బాధపడేది నేను ఏం చేయలేనని రాజు అంటాడు. ఆ మాటలు చలపతి వింటుంటాడు.

తట్టుకోలేకపోయిన రాజు
నేను ప్రేమించిన రాజు నన్ను మోసం చేశాడని ఇందు జీవితాంతం కుమిలికుమిలి ఏడవాలా చెప్పు అని లక్ష్మి అడుగుతుంది. రాజు ఏడుస్తుంటాడు. రాజు కన్నీళ్లు చూసి ఏంట్రా ఇదంటే.. ఈ కన్నీళ్లే నీ సమాధానమే అని అంటాడు. తన మెడలో ఇంకాసేపట్లో వేరేవాడెవడో తాళి కడతాడు. అప్పుడు తను ఇంకొకరి భార్య. అవన్ని గుర్తొస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని కుమిలికుమిలి ఏడుస్తుంటాడు రాజు.
తల్లి ఓదారుస్తుంది. తనను మర్చిపోయేది ఉంటే కన్నీళ్లతో మర్చిపోయేవాన్ని. కానీ, తను నా జీవితం అనుకున్నా. తనకు ఏ కష్టమొచ్చిన నేనున్నా అని చెప్పాలనుకున్నా. కానీ తనకు కష్టమొస్తే నేను చేతులుకట్టుకుని కూర్చున్నా. నన్ను క్షమించుకోలేకపోతున్నా అని రాజు అంటాడు. నువ్వు ఇలా బాధపడితే ఆయన ఎలా సంతోషంగా ఉంటార్రా అని తల్లి అంటుంది.
ఓవైపు కన్నతండ్రి, మరోవైపు జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న అమ్మాయి. ఎటు తేల్చుకోలేకపోతున్నా. ఇద్దరిలో ఒకరు బాధ పడాల్సిందేగా అని రాజు అంటాడు. కొన్నిసార్లు మనసు విప్పి మాట్లాడితే అడ్డుపడినవారే దారి చూపిస్తారు. నువ్వు వెళ్లు అని లక్ష్మి అంటుంది. వెళ్లలేను నాన్ననా, ఇందునా అని తేల్చుకోలేకపోతున్నా అంటాడు రాజు.
నా మాటలు బలం కావాలి
చలపతి దగ్గరికి వెళ్లి నిలదీస్తుంది లక్ష్మి. వాడు ఇందును ఒదులుకోడానికి సిద్ధంగా లేడు, అలా అని మిమ్మల్ని కాదలేకున్నాడు. మీ భయాన్ని అర్థం చేసుకోగలను. కానీ, ఇందు ఏ పాపం చేసింది. ఆ శత్రువుల మధ్య బలి కావాలా. ఇద్దరి జీవితాలను నాశనం చేద్దామనుకుంటున్నారా. మన నిర్ణయం వల్ల ఇతరులు బాధపడుతున్నారంటే కూడా మానుకోకుంటే ఎలా అండి అని ఏడుస్తూ బాధతో అర్థమయ్యేలా చెబుతుంది లక్ష్మి.
ఇందు మాటలను గుర్తు చేసుకుంటాడు చలపతి. అవన్ని ఆలోచించి రాజును పిలుస్తాడు చలపతి. రాజు నేను చాలా తప్పు చేశాను.. చాలా పెద్ద తప్పు చేశాను.. రాజు నీకు ఏదో అవుతుందన్న భయంతో కాపాడాలనుకున్నాను. నీకు ఏ బాధ ఉండకూడదనుకున్నాను. ఆ భయంతో నీకు ఏం కావాలో తేల్చుకోలేకపోతున్నా. నువ్వు మౌనంగా అన్ని మర్చిపోతావనుకున్నా. కానీ నాకోసం బాధపడతావనుకోలేదు. నా మాటలు నీకు బలం కావాలి కానీ బలహీనత కాకూడదు అని చలపతి అంటాడు.
నువ్వు నాకోసం ప్రేమను వదులుకుంటే నేను తండ్రింగా గెలిచినట్లా.. కాదురా.. ఏం జరిగితే అది జరిగింది. చూసుకుందాం. వెళ్లి నీ భార్యను తీసుకురా. నేను చెబుతున్నా వెళ్లు.. అని చలపతి పర్మిషన్ ఇస్తాడు. థ్యాంక్స్ నాన్న అని చలపతిని హగ్ చేసుకుంటాడు. ఈ ముక్క ఏదో ముందే చెప్పొచ్చుగా నాన్న అని రాజు అంటే.. ఇప్పుడు చెప్పాగారా అని చలపతి అంటాడు. వెంకీ బైక్‌పై రెడీగా ఉంటాడు. వెంకీతోపాటు రాజు వెళ్తాడు. రాజుకు కాల్ చేస్తే ఏం మాట్లాడలేదని ఇందుకు చెబుతుంది అపర్ణ.
పంతులు కోపం
బావ కచ్చితంగా వస్తాడని ఇందు అంటుంది. బావ రాకుంటే ఏం చేస్తావని నందు అడుగుతుంది. అమ్మా పూజపై దృష్టిపెట్టండని పంతులు అంటాడు. వెంకీని బైక్ ఆపించి తనే బైక్ డ్రైవ్ చేస్తాడు. అపర్ణ వాళ్లు మాట్లాడుతుంటే ఈ పెళ్లిలో ఏమైనా తేడా జరిగితే ఎవరిని వదిలిపెట్టనని రేఖ బెదిరిస్తుంది. ఆంటీ ఈరోజు నా పెళ్లి జరుగుతుంది అని ఇందు అంటుంది.
పంతులు మంత్రాలు చదువుతుంటాడు. పంతులును త్వరగా తాళి కట్టించమని తొందరపెడతారు భ్రమరాంబ, రేఖ, ఐశ్వర్య. దాంతో పంతులు కోప్పడతాడు. అన్ని సాంప్రదాయంగా చేస్తానంటాడు. పంతులు గారు మా గురించి కూడా ఆలోచించండి. తాళి కట్టించండి. ఇది మా రిక్వెస్ట్. మిగతావి తర్వాత చూసుకోండని రేఖ అంటుంది. అక్షింతలైన పంచనిస్తారా అని అంటాడు పంతులు.
నందు అక్షింతలు పంచుతుంది. ఫంకీ వినయ్‌కు పంతులు తాళి ఇచ్చి ఇందు మెడలో కట్టమంటాడు. ఇందుకు వినయ్ తాళి కడుతుంటాడు. అప్పుడే వచ్చిన రాజు కొబ్బరికాయం బోండాంతో కొడతాడు. తాళి ఎగిరి రాజు చేతుల్లో పడుతుంది. వినయ్ కిందపడిపోతాడు. అంతా షాక్ అవుతారు. అపర్ణ బ్యాచ్ మాత్రం సంతోషిస్తుంది. రాజు అంటూ ఏడుస్తూ ఇందు లేస్తుంది.
పారిపోయిన ఫంకీ వినయ్
ఈ తాళి కట్టే అర్హత నాకు మాత్రమే ఉందని రాజు అంటాడు. నేను కట్టాలని వినయ్ అంటే.. నీకు ప్రాణం కావాల పెళ్లి కావాలా అని రాజు అంటాడు. రీల్స్ కావాలి సర్. పెళ్లిదేముందు రోజుకోటి వెతుకోవచ్చు. ప్రాణం అలా కాదుగా సర్ అని ఫంకీ వినయ్ అంటాడు. రేఖ వచ్చి బెదిరిస్తే.. ఆయన చాలా డేంజర్‌గా ఉన్నారు. ప్రేమికులు చాలా పవర్ఫుల్ అని రాజు మెడలో కండువా వేసి వినయ్ పారిపోతాడు.
రేఖ అరుస్తుంది. బేస్ పెంచి అరిస్తే పారిపోయేవాన్ని కాదు. నా భార్య జోలికి వస్తే ఎదురు తిరిగి నిలబడేందుకు వచ్చానను ఇందు భుజాలపై చేయి వేసి చెబుతాడు రాజు. నటిస్తే భార్య అవుతుందా అని రేఖ వాళ్లు అంటే.. అది మీరు అనుకుంటున్నారు. జీవించామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అధికారికంగా ఇందు మెడలో తాళి కట్టేందుకు వచ్చానని రాజు అంటాడు.
ఒక్క ఫోన్ కాల్ చేస్తే దుగ్గిరాల కుటుంబం పరువు పోతుందని రేఖ అంటుంది. అలా చేసేగా ఇక్కడిదాకా తీసుకొచ్చావని రాజు అంటాడు. సరే మేము నాటకం ఆడామని చెప్పావే అనుకో. ఇప్పుడు తాళి కడుతున్నాగా. ఇంతమంది ముందు తాళి కడితే అది మోసం ఎలా అవుతుందని రాజు అంటాడు. బయటివాళ్లందరు ఇన్నిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోరు కాబట్టే పెళ్లి నాటకం ఆడారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ది గ్రేట్ లవ్ స్టోరీ అని ట్రెండ్ చేస్తారని రాజు తిరకాసు పెట్టి లాజిక్‌తో కొడతాడు.
రాజు తిరకాసుతో రేఖ సైలెంట్
ఇక మీరు. ఇన్ని రోజులు దుగ్గిరాల కుటుంబం అని చెప్పుకుంటూ తిండి తింటూ ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడిచినా రేఖ భూషణ్ అని వైరల్ చేస్తారు. మేకవన్నే పులి అని ట్యాగ్‌లైన్స్ కూడా పెడతారు. దానికి రెడీయేనా. ఏం జరిగినా నాకు లాభమే. అలా ఓకే అనుకుంటా బయటకు వెళ్దాం. అన్ని టీవీ ఛానెల్స్‌ను పిలిపించండి అని రాజు అంటాడు.
అప్పుడెందుకు వెళ్లావ్.. ఇప్పుడు ఎందుకు వచ్చావని ఐశ్వర్య అడిగితే.. చలపతి అన్నమాటలు చెబుతాడు రాజు. వాడి అన్ని అంటుంటే చూస్తావేంటీ నాలుగు తగిలించి బయటకు తరిమేయ్ అని లక్కీకి చెబుతుంది. సరేనని లక్కీ ముందుకు వస్తే.. రేయ్.. చిన్నప్పటినుంచి నాతో పెరిగావ్. నాకు అడ్డొస్తే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. నీకు నిజంగా నన్ను ఎదురించే ధైర్యం ఉంటే ముందుకు రారా.. అని రాజు కన్నెర్ర చేస్తాడు.
దాంతో లక్కీ వెనక్కి తగ్గుతాడు. భూషణ్ బాబాయ్ ట్రై చేస్తావా అంటే సైలెంట్ అవుతాడు. నిన్ను ఎదిరించే ధైర్యం ఎవ్వరికి లేదు ఇందు మెడలో తాళి కట్టు అని సుభాష్ అంటాడు. అందరిని కూర్చోమని రాజు, ఇందుల పెళ్లి చేస్తారు. ఇది సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేయమని పంతులుతో అంటుంది అపర్ణ. రాజు, ఇందు పెళ్లి జరుగుతుంది.
ఇందులాగే మోసం చేయాలని
అవమానం, పగతో రగిలిపోతుంది రేఖ. దానిలాగే మనం మోసం చేసి రాజును ఇందుకు దూరం చేయాలని ఐశ్వర్య కొత్త ప్లాన్ వేస్తుంది. ఇకనుంచి నేను పావులు ఎలా కదుపుతానో చూడండని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


