...
...
Next Story

Brahmamudi November 3 Episode: బ్రహ్మముడి- ఇందును పెళ్లి చేసుకున్న రాజు-పనిచేయని రేఖ ఉచ్చు- లక్కీకి ఐశ్వర్య స్పెషల్ సూట్

Brahmamudi Serial November 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 3వ ఎపిసోడ్‌‌లో రాజును ఇంటి దగ్గర ఇందు డ్రాప్ చేస్తుంది. చలపతి వస్తే మాట్లాడుతుంది. ఇందు పెళ్లి కోసం లక్కీకి ఐశ్వర్య బెల్జియం నుంచి స్పెషల్ సూట్ తెప్పిస్తుంది. ఇందు ప్రశాంతంగా ఉండటంపై భ్రమరాంబ డౌట్ పడుతుంది. పెళ్లిలో ఇందు కూర్చుంటుంది.

Published on: Nov 3, 2026, 09:51:08 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు బైక్ స్టార్ట్ అవ్వకుండా ప్రశాంత్ తన కర్చీఫ్ బైక్ సెలైన్సర్‌లో పెడతాడు. రాజును ఇందు తీసుకెళ్లేలా చేస్తానని ప్రశాంత్ ఛాలెంజ్ చేస్తాడు. వెళ్లి మాట్లాడుతాడు. బైక్ స్టార్ట్ అవ్వట్లేదని, క్యాబ్ బుక్ చేసుకుంటానని అంటాడు రాజు. అప్పుడే ఇందు వస్తుంది.

ప్రశాంత్ ప్లాన్ సక్సెస్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 3 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 3 ఎపిసోడ్

సర్‌ని డ్రాప్ చేస్తారా అని ఇందును అడుగుతాడు ప్రశాంత్. నాకేం ఇబ్బంది లేదని ఇందు అంటుంది. నేను అడగలేదని రాజు అంటాడు. మీకు భయం సర్. మేడమ్ పక్కన కూర్చుంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని భయపడుతున్నారని ప్రశాంత్ అంటే.. నాకేం లేదని ఇందు కారు ఎక్కుతాడు రాజు. మేడమ్ సక్సెస్ అని ప్రశాంత్ అంటాడు.

ఒకే కారులో రాజు, ఇందు వెళ్తారు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా రెస్టారెంట్‌లో ఆగుదామని ఇందు అడుగుతుంది. సంతకం పెట్టగానే ఇంటికి వస్తానని నాన్నకు మాటిచ్చానని రాజు అంటాడు. ఊపిరి కూడా మీ నాన్నను అడిగే పీలుస్తున్నావా అని ఇందు కోప్పడుతుంది. సరే ఆగుదామని రాజు అంటాడు. వద్దులేండి. మళ్లీ మీ నాన్న మాట తప్పిన కొడుకుగా ఉండటం ఎందుకు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని ఇందు అంటుంది.

రాజు ఇల్లు వచ్చిందని డ్రైవర్ చెప్పగానే దిగుతాడు. రావాల్సిన అవసరం లేదు. అయినా వచ్చావ్ అని ఇందు అడుగుతుంది. మా నాన్నకు బాధలేనప్పుడు రావడంలో ఇబ్బంది ఏముందని రాజు అంటాడు. అంకుల్‌కి బాధలేకపోతే ఏ పనైనా చేస్తావా అని ఇందు అడుగుతుంది. చేస్తానంటాడు రాజు. ఒకవేళ మా ఇంటికి రావడం అంకుల్‌కి బాధలేకుంటే వస్తావన్నమాట అని ఇందు అంటుంది.

లక్కీ కోసం స్పెషల్ సూట్

మీతో విషయం మాట్లాడాలని చలపతిని అడుగుతుంది ఇందు. మరోవైపు ఇందు పెళ్లికి రెడీ అయ్యేందుకు లక్కీ బట్టలు వెతుక్కుంటాడు. ఇప్పుడు 100, 200 కొన్న బట్టలతో లక్షల ఖరీదు చేసే సారీ వేసుకునే నా పక్కన భర్తలా నిలబడాలని అనుకుంటున్నావా. పెళ్లికి ఇన్వెస్టర్లు కూడా వస్తారు. నిన్ను చూసి వాళ్లు రూపాయి పెట్టుబడి పెట్టరు అని ఐశ్వర్య అంటుంది.

బెల్జియంలో ఫేమస్ డిజైనర్ ఫ్లెమింగో తయారు చేసిన సింగిల్ పీస్. ఇలాంటి డిజైన్ ఎక్కడ దొరకదు. నీకోసం స్పెషల్‌గా ఆర్డర్ చేసి తీసుకొచ్చాను అని ఐశ్వర్య అంటుంది. నా మీద ప్రేమతో ఆర్డర్ పెట్టావా అని లక్కీ మురిసిపోతే.. హలో నా పక్కన భర్తలా ఉండాలి కానీ పనోడిలా ఉండకూడదుగా. ఎక్కువ ఊహించుకోకని అవమానిస్తుంది ఐశ్వర్య.

మహారాణిలా చూసుకున్నాడు

పెళ్లిలో చీప్ పనులు చేయకని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఐశ్వర్య. మరోవైపు చలపతితో ఇందు మాట్లాడుతుంది. రాజు ఆ ఇంటి వారసుడు, నా బావ అని మీకు తెలుసు. కానీ, మీరు తీసుకుపోతున్నా నేను ఏం మాట్లాడలేదు. మీకు మాటిచ్చాను కాబట్టే మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మీ అబ్బాయిగానే మాట్లాడదామని వచ్చానంటుంది ఇందు.

కంటికి రెప్పలా పెంచాను. ఆమాత్రం నా మీద హక్కు ఉండదు. రాజు నా కొడుకే అని చలపతి అంటాడు. నాకు ఊహ తెలిసేసరికే తల్లిదండ్రులు లేరు. రేఖ ఆంటీ చెబితేనే వినాలన్నారు. దొంగచాటుగా ఎందుకు చదువుకుంటున్నానో తెలియదు. డిన్నర్ టేబుల్‌పై అన్నం ఉన్న ఆకలితో దూరంగా ఉండటం తెలిసేది కాదు. కొడితే ఏడవడం తప్పా ఎందుకని అడగడం తెలియదు అని రేఖ పెట్టిన టార్చర్స్ గురించి చెబుతుంది ఇందు.

అప్పుడే రాజు కిడ్నాప్ చేసి కొత్త ప్రపంచం చూపించాడు. చిన్న కోటలో బంధించి మహారాణిలా చూసుకున్నాడని రాజు ప్రేమ గురించి చెబుతుంది ఇందు. రేఖ ఉచ్చులోనుంచి బయటపడాలంటే రాజు మాత్రమే సాయం చేయగలనుకున్నాడు. డబ్బుకోసం వచ్చాడు కానీ అన్ని భరించాడు అని రాజు గొప్పదనం గురించి చెబుతుంది ఇందు.

ఇందు మాటలకు కరిగిన చలపతి

నాకు తను బావ అని తెలియకుండానే ప్రేమలో పడిపోయాను, తను నా భర్త అయితే బాగుండు అని ఫిక్స్ అయిపోయాను అంటుంది ఇందు. ఏదో ఒక రోజు మీ అందరికి నిజం చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఇప్పటికీ అదే మాటపై నిలబడ్డాను. ఒక్కటి మాత్రం నిజం నేను రాజును తప్పా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను. రాజు వస్తాడన్న నమ్మకంతో వెళ్తున్నాను. మా ప్రేమను మీరు అంగీకరిస్తారన్న ఆశతో వెళ్తున్నాను అని వెళ్లిపోతుంది ఇందు.

దాంతో చలపతి ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు పెళ్లి పనులు అలాగే ఉన్నాయని ఐశ్వర్యకు పని చెబుతాడు పంతులు. నేను పని మనిషిని కాదని ఐశ్వర్య అంటుంది. మీ మంత్రాలు మీరు చదువుకోండి, నన్ను అడగకండని కోప్పడుతుంది ఐశ్వర్య. లక్కీ వచ్చి సారీ చెప్పి తను తీసుకొస్తానంటాడు. ఐశ్వర్య మీద చేయి వేస్తే లక్కీని తిడుతుంది.

పరిష్కారం కోసం సుభాష్, అపర్ణ తలబాదుకుంటారు. రాజుకు కాల్ చేస్తుంది అపర్ణ. ఫోన్ రింగ్ అయిన రాజు వినడు. అది అంతా చూస్తారు. అపర్ణ మళ్లీ కాల్ చేస్తుంది. మరోవైపు ఇందును భ్రమరాంబ, రేఖ రెడీ చేస్తారు. ఇందు ఆనందంగా ఉండటం చూసి, దాని మొహంలో బాధ లేదని రేఖతో చెబుతుంది భ్రమరాంబ. మనల్ని ఎదురిస్తే ఏం జరుగుతుందో దానికి తెలుసు అని రేఖ అంటుంది.

ఇందును పెళ్లి చేసుకున్న రాజు

మనం భయపెడితే భయపడాలి కానీ ప్రశాంతంగా ఉందేంటీ. నాకేదో అనుమానంగా ఉందని భ్రమరాంబ అంటుంది. ఒకవేళ రాజు వచ్చిన మనం వేసిన ఉచ్చులోనుంచి ఇందును తీసుకెళ్లలేడు అని రేఖ అంటుంది. ఇందు అందాన్ని పొగుడుతారు ఇద్దరు. రాజు లిఫ్ట్ చేయకపోవడంతో మరింత భయపడిపోతుంది అపర్ణ. తర్వాత పెళ్లిపీటలపై ఇందు వచ్చి కూర్చుంటుంది.

ఇందుకు ఫంకీ స్టార్ తాళి కట్టబోతుంటే రాజు కొబ్బరిబొండాంతో కొట్టి ఆపుతాడు. దాంతో తాళి ఎగిరి రాజు చేతిలో పడుతుంది. అంతా షాక్ అవుతారు. అపర్ణ సంతోషిస్తుంది. ఈ తాళి కట్టే అర్హత నాకు మాత్రమే ఉందని రాజు అంటాడు. అసలైన పెళ్లికొడుకు వచ్చాడు. ఇప్పుడు జరిపించండని పంతులుతో అపర్ణ అంటుంది. ఇందు మెడలో రాజు తాళి కట్టి పెళ్లి చేసుకుంటాడు రాజు. రాజు కోసం రేఖ వేసిన ఉచ్చు ఫెయిల్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks