Brahmamudi October 17 Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంట్లో అర్ధరాత్రి హంగామా.. రబ్బరు స్టాంపుగా ఐశ్వర్య.. లక్కీకి షాక్
Brahmamudi Serial October 17th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 17 ఎపిసోడ్ లో అపర్ణ చేసిన పనికి దుగ్గిరాల ఇంట్లో అర్ధరాత్రి హంగామా జరుగుతుంది. మరోవైపు కంపెనీలో ఐశ్వర్యను రబ్బరు స్టాంపుగా మారుస్తుంది ఇందు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందును కలపడానికి అపర్ణ వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. అయినా ఆమె మాత్రం ప్రయత్నాలు ఆపదు. దీనికి లక్కీ బలవుతాడు. అటు సొంత కంపెనీలోనే ఐశ్వర్యకు అవమానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

దుగ్గిరాల ఇంట్లో అర్ధరాత్రి హంగామా.. అపర్ణ, సుభాష్ చేసిన పనికి..
పనిమనిషి వసంత కోసం శేషు నీటుగా రెడీ అయి అర్ధరాత్రి బయటకు వచ్చే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత వసంత కూడా వస్తుంది. అటు రాజు, ఇందు.. తర్వాత నందు, వెంకీ.. ఆ తర్వాత రేఖ, భూషణ్ కూడా ఒకరిని వెతుకుతూ మరొకరు ఇంటి బయటకు వస్తారు.
దీంతో అర్ధరాత్రి వేళ దుగ్గిరాల ఇంటి బయట ఓ హంగామా క్రియేట్ అవుతుంది. వీళ్లంతా ఒకరిని చూసి మరొకరు దాక్కుంటారు. తన పార్ట్నర్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఒక చిన్న అయోమయం కాస్తా అందరికీ అర్ధరాత్రి నిద్ర లేకుండా చేస్తుంది.
లెటర్ విషయంలో రాజు, ఇందు గొడవ
మొదట రాజు, ఇందు కలుసుకుంటారు. ఇద్దరూ కారు చాటుగా నిలబడి మాట్లాడుకుంటారు. ఎందుకు రమ్మన్నావ్ అని రాజుని అడుగుతుంది ఇందు. నువ్వే కదా లెటర్ విసిరేసి రమ్మన్నావ్ అని రాజు అంటాడు. నువ్వు నవ్వావు కదా అని అడుగుతాడు. నువ్వు నవ్వావని నేనూ నవ్వానని ఇందు అంటుంది.
లెటర్ నువ్వు రాశావంటే నువ్వు రాశావంటూ ఇద్దరూ గొడవ పడతారు. మనసులో ఏముందో చెప్పలేక ఇలాంటివి చేస్తావా అంటూ రాజుపై ఇందు మండిపడుతుంది. ఇంట్లోకి తిరిగి వెళ్దామంటే అందరూ బయటే కనిపించడంతో కారు పక్కనే ఆగిపోతారు.
నందు, వెంకీ కూడా అయోమయం
ఆ తర్వాత నందు, వెంకీ కూడా కలుసుకుంటారు. వాళ్లలోనూ లెటర్ విషయంలో అయోమయం నెలకొంటుంది. ఎందుకు రమ్మాన్నావో చెప్పు అంటూ ఇద్దరూ అనుకుంటారు. ఆ లెటర్ రాయలేదని ఇద్దరూ చెప్పుకుంటారు. అందరూ బయటే ఉండటంతో వెంకీ భయంతో వణికిపోతాడు. నందు అతనికి ధైర్యం చెబుతుంది. మనసులో ఉన్నది చెప్పకపోయినా సరే కానీ ఇలాంటివి చేయకు అని అంటుంది.
రేఖతో భూషణ్.. వసంతతో శేషు.. భ్రమరాంబ గొడవ
ఇటు రేఖ కూడా భూషణ్ ను చూస్తుంది. వాళ్లు కూడా ఆ లెటర్ గురించే మాట్లాడుకుంటారు. ఏంటీ కన్ఫ్యూజన్ అని రేఖ అడుగుతుంది. ఇద్దరూ లోనికి వెళ్దామంటే అందరూ బయటే ఉండటం చూసి వీళ్లంతా ఎందుకు ఉన్నారని అనుకుంటారు. మరోవైపు కారు వెనుక వసంతను కలుస్తాడు శేషు. అతన్ని ఫాలో అవుతూ వస్తుంది భ్రమరాంబ. వసంతతో సరసాలు ఆడుతుండగా పట్టుకుంటుంది. ఇంట్లోకి లాక్కెళ్లి పంచాయితీ పెట్టాలని చూస్తుంది.
బయటే పెద్ద గొడవ జరగడంతో అందరూ పరుగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. అందరూ ఒకరినొకరు చూసుకొని ఈ రాత్రి వేళ ఏం చేస్తున్నారని అనుకుంటారు. తనకు హ్యాండిచ్చి ఈ పనిమనిషితో సరసాలు ఆడుతున్నాడంటూ శేషుతో భ్రమరాంబ గొడవకు దిగుతుంది. ఇదంతా పైనుంచి గమనిస్తున్న అపర్ణ, సుభాష్ తలపట్టుకుంటారు.
భ్రమరాంబకు క్లాస్ పీకిన అపర్ణ.. లెటర్ విషయంలో గందరగోళం
అర్ధరాత్రి వేళ ఇంటి పరువు తీసేలా ఏంటి ఇది అనుకొని అపర్ణ వెళ్తుంది. భ్రమరాంబను తిడుతుంది. తన మొగుడు పని మనిషితో సరసాలుడుతున్నాడని భ్రమరాంబ చెప్పడంతో అపర్ణ మరింత విసుక్కుంటుంది. అర్ధరాత్రి వేళ ఈ పరువు తీసే పనులేంటి.. అందరూ లోనికి వెళ్లండని అపర్ణ హుకుం జారీ చేస్తుంది.
అయ్యగారే లెటర్ ఇచ్చి రమ్మన్నాడని వసంత అంటే.. నువ్వే కదా నా అందం చూసి రమ్మన్నావని శేషు అంటాడు. దీంతో అందరికీ ఆ లెటర్ విషయంలో గందరగోళం నెలకొంటుంది. దీంతో అపర్ణ తాను చేసిన పని వల్ల ఇదంతా జరుగుతుందని కంగారు పడి లోనికి తీసుకెళ్తుంది.
ఐశ్వర్యకు షాక్.. మెయిల్‌తో కొట్టిన ఇందు.. చెక్ పవర్ కూడా లేదంటూ..
మరుసటి రోజు ఐశ్వర్య ఆఫీసుకు వెళ్తుంది. అయితే అక్కడ శృతితోపాటు స్వరాజ్ గ్రూపు ఉద్యోగులు మళ్లీ కనిపించడంతో మండిపడుతుంది. మళ్లీ ఎందుకు వచ్చారు.. ఇంటికెళ్లి ఇందుకి చెబితే భయపడతానని అనుకుంటున్నారా.. బయటకు నడవండి అని అంటుంది. ఇంతలో మేనేజర్ వచ్చి ఐశ్వర్యకు షాకిస్తాడు.
ఇందు మేడమ్ మెయిల్ పంపించింది.. వీళ్లంతా ఇక్కడే పని చేయాలని చెప్పింది.. అంతేకాదు వీళ్లను తీసే అధికారం మీకు లేదు.. చెక్కు పవర్ కూడా లేదు.. ఆ విషయాలన్నీ అగ్రిమెంట్ లో ఉన్నాయి అని చెబుతాడు. దీంతో ఐషూ షాక్ తింటుంది. అంటే మా మేడమ్ రబ్బర్ స్టాంపా అని ఐషూ సెక్రటరీ అంటాడు. దీంతో ఆమెకు మరింత మండుతుంది.
ఇంట్లో ఐశ్వర్య పంచాయితీ.. గట్టిగా సమాధానమిచ్చిన ఇందు
వెంటనే ఇంటికి వెళ్లి పంచాయితీ పెడుతుంది ఐశ్వర్య. అందరి ముందే రాజు, ఇందులను నిలదీస్తుంది. కంపెనీ పెట్టించి ఇలా అధికారాలు లేకుండా చేసిందని, తననో రబ్బరు స్టాంపులా మార్చిందని ఐషూ చెబుతుంది. దీంతో రేఖ, భ్రమరాంబను ఆమెను మరింత రెచ్చగొట్టి ఇందుపైకి ఉసిగొల్పుతారు. ఆమె ప్రశ్నలకు రాజు సమాధానాలు ఇస్తున్నా.. ఇందుయే మాట్లాడాలని చెప్పడంతో ఆమె గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది.
ఐశ్వర్యలాంటి వాళ్లకు కంపెనీ పెట్టిస్తే.. ఆమె తీసుకునే నిర్ణయాలకు కంపెనీ మూడు రోజులు కూడా ఉండదు.. తొలిరోజే ఉద్యోగులను తొలగించింది.. అందుకే ఈ కండిషన్లు పెట్టాను అని ఇందు చెబుతుంది. దీంతో ఐషూ షాకవుతుంది. రేఖ, భ్రమరాంబ రెచ్చగొట్టాలని చూసినా ఇందు ఏమాత్రం తగ్గదు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది.
అపర్ణ మరో ప్లాన్.. చేతులు కలిపిన నందు
తాను వేసిన ప్లాన్ ఫెయిలవడంతో ఈసారి నందు కూడా అపర్ణతో చేతులు కలుపుతుంది. ఇందు, రాజులను కలపడానికి ఓ ప్లాన్ చేస్తుంది. ఇందు రాగానే పూలు కురిపించాలని అనుకుంటారు. కానీ అది కాస్తా ఐశ్వర్యపై పడతాయి. అది లక్కీయే చేశాడనుకొని అతని చెంప చెల్లుమనిపిస్తుంది ఐశ్వర్య. దీంతో లక్కీ షాకవుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


