Brahmamudi October 16 Episode: బ్రహ్మముడి- ఇందుకు పోటీగా ఐశ్వర్య 5 కోట్ల టెండర్- రేఖకు షాక్- పనిమనిషికి శేషు లవ్ లెటర్
Brahmamudi Serial October 16th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 16వ ఎపిసోడ్లో ఐశ్వర్య ఇంటికి రాగానే అంతా నిలదీస్తారు. కానీ రివర్స్‌లో ఐశ్వర్యనే కోప్పడుతుంది. ఐషు తనవైపే ఉందన్న రేఖకు రాజు షాక్ ఇస్తాడు. మీ అమ్మ రుద్రాణి కూడా ఇలాగే పెంచినవాళ్లను ముంచేసింది. నీకు అలా జరగకుండా చూసకోమంటాడు రాజు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంటికొచ్చిన శ్రుతి స్వరాజ్ గ్రూప్ ఉద్యోగులను తీసేసిందని, మీకు సంబంధం ఉన్న ఎంప్లాయిలను ఉంచుకోనందని చెబుతుంది. రాజు కోప్పడతాడు. ఇంటికొచ్చాక ఐశ్వర్యను అడుగుదామని, తనిప్పుడు ఛైర్మన్. కంపెనీలో అడిగితే అవమానించినట్లు అవుతుందని ఇందు అంటుంది.

ఇందుకు పోటీగా 5 కోట్ల టెండర్
తను మాట్లాడతానని చెప్పి శ్రుతిని పంపిస్తుంది ఇందు. మరోవైపు నేను వాళ్లకిచ్చిన షాక్ ఎలా ఉందని పీఏ పార్వతీశాన్ని అడుగుతుంది ఐశ్వర్య. పాపం అని పార్వతీశం అంటాడు. పార్వతీశాన్ని పారు అని పిలుస్తుంది ఐశ్వర్య. ఛైర్మన్‌గా పనికి వస్తానా అంటే సింహాసనంపై సింహం కూర్చున్నట్లుందని పారు అంటాడు. నాకు పొగరు అనుకుంటున్నావుగా అని ఐషు అడిగితే.. అవును అన్న పారు కానీ ఆమాత్రం పొగరు ఉండాలి మేడమ్ అని అంటాడు.
ఇంతలో ఓ ఎంప్లాయి సుబ్రమణ్యం వస్తాడు. సుబ్బు అని పిలుస్తుంది ఐశ్వర్య. మన కంపెనీ పేరు చాలా గట్టిగా వినిపించాలి. సిటీలో ఉన్న టెండర్స్ ఏంటో తెలుసుకో అని ఐషు అంటుంది. ఎల్లుండి 5 కోట్లకు సంబంధించిన టెండర్ ఉంది. ఎప్పుడు అది స్వరాజ్ గ్రూప్‌కి వెళ్తుంది. క్వాలిటీ మిస్ కాకుండా బెస్ట్ కోట్ చేస్తారని సుబ్బు అంటాడు.
ఆ టెండర్ మనం గెలవాలి. స్వరాజ్ గ్రూప్‌పై నేను గెలవాలి. నా మొదటి గెలుపు స్వరాజ్ గ్రూప్‌పై అయితే వచ్చే కిక్కే వేరని, బెస్ట్ ప్రైస్ కోట్ చేసి తీసుకురమ్మని ఐశ్వర్య అంటుంది. సరేనన సుబ్బు వెళ్లిపోతాడు. మేడమ్ స్వరాజ్ గ్రూప్ మీ ఫ్యామిలీదే కదా అని పారు అడిగితే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఐశ్వర్య అంటుంది. వావ్ చాలా మంచి కోట్ చెప్పారని రాసుకుంటాడు.
నీ పెత్తనం ఏంటీ
ఎప్పుడు ఇలాగే పొగుడుతావా అని ఐషు అంటే.. మీరు పొగడ్తలకు మాత్రం పడతారా ఏంటీ అని పారు బాగా కవర్ చేస్తాడు. అమ్మో ఇంత పొగరుబోతును ఎక్కడ చూడలేదురా బాబు అని పారు మనసులో అనుకుంటాడు. ఇంటికెళ్తుంది ఐశ్వర్య. అపర్ణ ఆపి ఉద్యోగులను తీసేయడం గురించి కోప్పడుతుంది. భూషణ్, రేఖ ఐశ్వర్యను రెచ్చగొడతారు.
నా పర్మిషన్ లేకుండా నా ఆఫీస్‌లో నీ ఎంప్లాయిస్‌ని పెట్టడం ఏంటీ. ఏం చేద్దామనుకుంటున్నావ్. నా ఆఫీస్‌లో తన పెత్తనం ఏంటని ఐశ్వర్య అంటుంది. హెల్ప్ చేసేందుకు పెట్టిందని రాజు అంటాడు. లక్కీ కూడా తప్పుగా అర్థం చేసుకున్నావంటాడు. లక్కీ నోరు మూయిస్తుంది ఐశ్వర్య. నేను సొంతంగా బిజినెస్ పెట్టి ఎదగడం నీకు ఇష్టం లేదు. నన్ను తొక్కేయాలనుకుంటున్నావ్. కానీ, నేను అక్కడే మొక్కై ఎదిగేరకాన్ని అని గొప్పలుపోతుంది ఐశ్వర్య.
రేఖ, భూషణ్ ఆజ్యం పోస్తారు. నా కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. నా లైఫ్‌లో ప్రతీది నేనే నిర్ణయం తీసుకుంటానంటుంది ఐశ్వర్య. నీకు సాయం చేస్తానన్న చేతులను నరికేసుకుంటున్నావ్. భవిష్యత్తులో నువ్వే బాధపడతావ్ అని రాజు అంటాడు. నేను క్లారిటీతోనే ఉన్నా అని రాజుపైకి వెళ్తుంది ఐశ్వర్య. ఇద్దరిని ఆపుతారు. ఇతరులను మర్యాదగా చూడటం బిజినెస్ వుమెన్‌కు ఉన్న లక్షణం అని ఇందు అంటుంది.
రుద్రాణిలా ఐశ్వర్య చేయకుండా చూసుకో
తను చేయాలనుకుంది చేస్తుంది. మీరెందుకు అడ్డుపడుతున్నారని రేఖ అంటుంది. రేఖ నువ్వు దాన్ని ఎంత సమర్ధించిన అది నిన్ను కన్నెత్తి కూడా చూడదని అపర్ణ అంటుంది. తర్వాత రాజును ఆపిన రేఖ నావైపే ఉందంటుంది. దానికి రాజు నవ్వుతాడు. మీ గురించి అమ్మమ్మ చెప్పింది. మీ అమ్మ రుద్రాణి కంచు అంటకదా. వెనకాలే గోతులు తీసేదటగా.. మీ అన్నయ్య రాహుల్‌కి కంపెనీ ఇస్తే కోట్లు నొక్కేద్దామని చూశాడగా. ఐషుది కూడా మీ రక్తమేగా అని రాజు అంటాడు.
నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. పాతికేళ్లు కూతురిలా పెంచితే మీ అమ్మ రుద్రాణి చేసింది ఏంటీ. అదే రుద్రాణిలా నీకు ఐశ్వర్య చేయదని గ్యారేంటీ ఏంటీ అని రాజు పెద్ద కౌంటర్ ఇస్తాడు. ఐశ్వర్య లేడి భస్మాసురుడు అటు ఇటు తిరిగి నీ మీద చేయి పెడుతుంది. ముందు మిమ్మల్ని కాపాడుకోండని రాజు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు పరధ్యానంగా ఉంటూనే సుభాష్‌కి తినిపిస్తుంది అపర్ణ.
ఐశ్వర్య గురించి కోపంగా మాట్లాడుతుంది. అహంకారంతో విర్రవీగేవాళ్లు ఏదోక రోజు పశ్చాత్తాపడతారని సుభాష్ అంటాడు. మనం ఇందు, రాజుల గురించి ఆలోచించాలి. రాజు, ఇందుల అబద్ధపు పెళ్లిని నిజం చేద్దాం. మనసులో ఉన్న ప్రేమను బయటకు తీయాలని సుభాష్ అంటాడు. రెండు పేపర్లు, పెన్ తీసుకురమ్మని సుభాష్ అంటే వాళ్లకు ప్రేమ పరీక్ష పెడతారా అని అపర్ణ అంటుంది.
బ్రోకర్స్‌గా అపర్ణ, సుభాష్
ఇందుకు రాజు రాసినట్లుగా, రాజుకు ఇందు రాసినట్లుగా లవ్ లెటర్ రాయమంటాడు సుభాష్. భర్త చెప్పినట్లుగా అపర్ణ రాస్తుంది. కిచెన్‌లో ఇందు ఉంటుంది. డిన్నర్ టేబుల్‌పై రాజు వర్క్ చేసుకుంటాడు. ఈ వయసులో వీళ్లిద్దరికి మధ్యవర్తులం అయ్యాం. దేవుడా నువ్వే చూడాలని మనసులో అనుకుంటుంది అపర్ణ. రాజుపైకి లెటర్ విసురుతుంది అపర్ణ.
అందులో మనసులో ఉన్న మాట రాత్రి 12 గంటలకు చెబుతాను. గార్డెన్‌లోకి రా అని ఉంటుంది. అది రాజు చదివి ఇందును చూస్తే ఇందు నవ్వుతుంది. సరే వస్తాను ఏం చేస్తావో చూస్తాను అని రాజు అనుకుంటాడు. ఇందుపై లెటర్ వేస్తుంది అపర్ణ. అది తీసి చూసిన ఇందు రాజువైపు చూస్తే రాజు నవ్వుతాడు. మనసులో ఉన్నది ఇప్పుడే చెప్పొచ్చుగా. రాత్రి వెన్నెల్లో రొమాంటిక్‌గా ప్లాన్ చేశాడేమో అని ఇందు మురిసిపోతుంది.
ఇద్దరి రియాక్షన్ చూసిన అపర్ణ హమ్మయ్య పనైపోయిందనుకుంటుంది. ఇందును పిలిచి తాతకు కాఫీ తీసుకెళ్లమంటుంది అపర్ణ. లవ్ లెటర్ పక్కన పడెస్తుంది ఇందు. లక్కీ పిలవడంతో బయటకు పడేస్తాడు రాజు. ఆ రెండు లెటర్స్‌ని నందు, వెంకీ చదువుతారు. వెంకీ మొత్తానికి ధైర్యం చేశాడని నందు, అందరిముందు చెబితే సమస్య అవుతుంది. ఒంటరిగా కలిసి మనకు సెట్ అవ్వదని చెప్పాలని వెంకీ అనుకుంటాడు.
పని మనిషికి శేషు లవ్ లెటర్
క్యారేజ్‌తో వెంకీ వస్తే రాజు పిలుస్తాడు. శేషు పక్కన లెటర్ పడేసి వెళ్తాడు వెంకీ. రాజుకు ఉసిరికాయ పచ్చడి ఇస్తాడు వెంకీ. నైట్ ఇక్కడే ఉండి వెళ్లమని రాజు చెబితాడు. సరే అని ఒప్పుకుంటాడు. నందును అపర్ణ పిలవడంతో పని మనిషి పక్కన లెటర్ పడేసి వెళ్తుంది నందు. లవ్ లెటర్ చూసిన శేషు పని మనిషి రాసిందనుకుంటాడు.
పని మనిషి నవ్వడంతో శేషు మరింత మురిసిపోతాడు. వచ్చిన రెండు రోజుల్లోనే నాకు కనెక్ట్ అయిందా. ఎంతైనా అందగాడిని కదా అనుకుంటాడు శేషు. తన పక్కన ఉన్న లవ్ లెటర్ చూసిన పని మనిషి శేషు రాసాడనుకుంటుంది. సర్ గారు నాకు లెటర్ రాశారేంటీ. పిలవగానే వెళ్లకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తారని పని మనిషి అనుకుంటుంది.
లెటర్ పక్కన పడేస్తుంది. అది రేఖ చూస్తుంది. భూషణ్‌ని చూసి కొత్తగా ఏమైనా చెప్పానుకుంటున్నాడేమో అని రేఖ అనుకుంటుంది. శేషు దగ్గరి లెటర్ భూషణ్ చూసి రేఖకు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయా. కచ్చితంగా రొమాంటిక్‌గా పిలిచి ఉంటుందని భూషణ్ అనుకుంటాడు. పని మనిషివైపు శేషు అలాగే చూస్తుంటే భ్రమరాంబ వచ్చి సైట్ కొడుతున్నావా అని అడుగుతుంది.
ఐశ్వర్య పవర్ తీసేసిన ఇందు
నువ్వు నా బంగారం అని మ్యానేజ్ చేసి వెళ్లిపోతాడు శేషు. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే నాకు ఏదో తేడా కొడుతుంది. ఓ కన్నేసి ఉంచాలని భ్రమరాంబ అనుకుంటుంది. 12 గంటలు అయ్యేదాకా శేషు ఎదురుచూస్తాడు. నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందని శేషు భ్రమరాంబ పడుకుందో లేదో చెక్ చేసుకుంటాడు. కారు దగ్గర రాజు ఉంటే ఇందు వెళ్తుంది.
మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో ఇందు ఉద్యోగులు కనిపించడంతో ఐశ్వర్య ఫైర్ అవుతుంది. ఇందు మేడమ్ నుంచి మెయిల్ వచ్చిందని, ఉద్యోగులను తీసేసే అధికారం లేదని, చెక్ పవర్ కూడా లేదని సుబ్బు చెబుతాడు. ఇంటికెళ్లి గొడవ చేస్తుంది ఐశ్వర్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


