Brahmamudi October 1 Episode: బ్రహ్మముడి.. రంగంలోకి పోలీసులు.. రాజుని ఇరికించాలని చూసి ఇరుక్కుపోయిన రేఖ.. దొరికిన సిరి
Brahmamudi Serial October 1st Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్ లో రాజుని ఇరికించడానికి ట్రై చేసిన రేఖకు గట్టి షాకే తగులుతుంది. పోలీసులను రంగంలోకి దించినా.. సరైన సమయానికి సిరిని తీసుకొస్తారు రాజు, ఇందు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ వేసిన మరో ప్లాన్ కూడా దారుణంగా ఫెయిలవుతుంది. సిరి విషయంలో పోలీసులను రంగంలోకి దింపి రాజును ఇరికించాలని రేఖ చూస్తుంది. కానీ ప్లాన్ కాస్తా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

డ్రైవర్‌కు రాజు ఫోన్.. సిరిని ఎక్కడ దించానో చెప్పిన డ్రైవర్
దారి తప్పి ఏడుస్తూ ఉన్న సిరి దగ్గరికి ఓ ఆటో డ్రైవర్ వచ్చే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ మొదలైంది. నీ మొగుడు నాకు తెలుసు.. అతని దగ్గరికి తీసుకెళ్తానని సిరిని ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్తారు. మరోవైపు ట్రావెల్స్ ఓనర్ రాజుకి ఆ డ్రైవర్ నంబర్ పంపిస్తాడు.
దీంతో రాజు అతనికి ఫోన్ చేసి సిరి గురించి అడుగుతాడు. మొదట అతడు తెలియదని బుకాయిస్తాడు. కానీ రాజు పోలీసుల పేరు చెప్పి బెదిరించడంతో సిరిని ఎక్కడ దించాడో చెబుతాడు. ఆ లొకేషన్ పంపించాలని రాజు అడగడంతో డ్రైవర్ పంపిస్తాడు.
డ్రైవర్ పంపిన లొకేషన్‌కు రాజు, ఇందు.. సిరి కోసం వెతుకులాట
ఆ తర్వాత డ్రైవర్ పంపిన లొకేషన్ కు రాజు, ఇందు వెళ్తారు. అక్కడే డ్రైవర్ ఉండటంతో అతన్ని రాజు నిలదీస్తాడు. తాను రైడ్ టెన్షన్ లో ఉండి ఆ అమ్మాయిని ఇక్కడ దించానని, ఆమె తిరిగి ఇంటికి వెళ్తుందని అనుకున్నానని డ్రైవర్ అంటాడు. కానీ రాజు అతన్ని బెదిరిస్తాడు.
దీంతో తనకు తెలియక చేశానని, పోలీసు కేసు వద్దని, పెళ్లాంపిల్లలు ఉన్నారని బతిమాలడంతో ఇందు అతన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత సిరి ఇక్కడే ఎక్కడో ఉంటుందని, ఆమె కోసం వెతుకుదామని ఇందు అంటుంది. రాజు, ఇందు చెరో వైపు వెళ్లి వెతకడం మొదలు పెడతారు.
పోలీసులను రంగంలోకి దించనున్నట్లు చెప్పిన రేఖ
ఇటు ఇంటి దగ్గర శేషు, భ్రమరాంబ, రేఖ, భూషణ్ సిరి గురించి ఆలోచిస్తుంటారు. సిరి ఎక్కడికెళ్లిందో ఏమో.. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. ఆమెకు ఏం జరుగుతుందో అని శేషు బాధ పడతాడు. కానీ భ్రమరాంబ మాత్రం ఆమెకు ఏమీ జరగదు.. కానీ రాజు, ఇందును అలా వదిలేశాం.. వాళ్లు సిరిని ఇంటికి తీసుకొస్తే రాజు నుంచి నిజాలు ఎలా రాబట్టగలం అని అంటుంది.
కానీ అప్పటికే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని రేఖ చెబుతుంది. వాళ్లు వస్తే అసలు సిరి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? రాజుకు ఏంటి సంబంధం అన్న వివరాలన్నీ తెలుస్తాయని అంటుంది. ఇంత పెద్ద సిటీలో రాజు, ఇందు అసలు సిరిని కనిపెట్టలేరని రేఖ కాన్ఫిడెంట్ గా ఉంటుంది.
ఇందుకి అపర్ణ ఫోన్.. పోలీసులకు చెప్పమని ఒత్తిడి
మరోవైపు ఇందుకి అపర్ణ పదేపదే ఫోన్ చేస్తుంటుంది. ఆమె ఎత్తకపోవడంతో ఆందోళన పడుతుంది. చివరికి ఇందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సిరి దొరికిందా అని అడిగితే ఇంకా లేదని అంటుంది. పోలీసులకు చెప్పమని అపర్ణ ఒత్తిడి తెస్తుంది.
కానీ పోలీసులకు చెబితే అసలు నిజం బయటపడుతుంది.. రాజు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని ఇందు అనుకుంటుంది. పోలీసులకు అవసరం లేదు.. మేమే సిరిని తీసుకొస్తాం అని చెప్పి ఇందు ఫోన్ పెట్టేస్తుంది. పోలీసులకు చెబితే మన కుటుంబ పరువు పోతుందని అలా చేసిందేమో అని సుభాష్ అంటాడు.
సిరిని అమ్మేయడానికి ఆటో డ్రైవర్ ప్లాన్.. తప్పించుకున్న సిరి
మరోవైపు సిరిని ఆ ఆటో డ్రైవర్ ఓ ఇంటికి తీసుకెళ్తాడు. ఆమెను ఎవరికో అమ్మేయడానికి అతడు ప్లాన్ చేస్తాడు. ఆమె రానని అంటున్నా.. ఈ ఇంట్లోనే నీ మొగుడు ఉన్నాడు అని సిరిని లోనికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరవాత మరో ఇద్దరు కూడా ఉంటారు. సిరిని వాళ్లు బంధించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె మాత్రం అందులో ఒకడి చేయిని కొరికి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. అటు రాజు, ఇందు సిరి కోసం వెతుకుతూనే ఉంటారు. రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో సిరి రాజు కంట పడుతుంది.
ఇంట్లో పోలీసులు.. సిరిని తీసుకొచ్చిన రాజు
మరోవైపు ఇంట్లో పోలీసులు రంగంలోకి దిగుతారు. మీ మనవడు ఎక్కడ.. అసలు సిరి ఎవరు.. రాజుతో సిరికి ఏం సంబంధం.. అసలు సిరి ఎలా కనిపించకుండా పోయింది అంటూ అపర్ణపై వాళ్లు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. వాటికి నేను సమాధానం చెబుతానంటూ సిరిని తీసుకొని రాజు వస్తాడు. దీంతో రేఖ షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


