Brahmamudi September 28 Episode: బ్రహ్మముడి.. సిరిని మాయం చేసిన రేఖ.. కారు డిక్కీలో దాక్కొని.. రాజు, ఇందు ఆందోళన

Brahmamudi Serial September 28th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 28 ఎపిసోడ్ లో సిరి గురించి తెలుసుకోవడం కాకుండా ఏకంగా ఆమెను ఇంటి నుంచే పంపిచేస్తుంది రేఖ. దీంతో రాజు, ఇందులో ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తారు.

Published on: Sep 28, 2026, 08:55:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో సిరిని రేఖ ఆట పేరుతో మాయం చేసే సీన్ ఆసక్తి రేపింది. ఆమె గురించి తెలుసుకోవడంలో భ్రమరాంబ, శేషు ఫెయిలవడంతో ఆమెనే రంగంలోకి దిగి ఓ ప్లాన్ వేస్తుంది. అది సక్సెస్ కావడంతో రాజు, ఇందు సిరి కనిపించక కంగారు పడుతూ ఉంటారు.

Brahmamudi September 28 Episode: బ్రహ్మముడి.. సిరిని మాయం చేసిన రేఖ.. కారు డిక్కీలో దాక్కొని.. రాజు, ఇందు ఆందోళన
Brahmamudi September 28 Episode: బ్రహ్మముడి.. సిరిని మాయం చేసిన రేఖ.. కారు డిక్కీలో దాక్కొని.. రాజు, ఇందు ఆందోళన

భ్రమరాంబ ముక్కుపై గుద్దిన రాజు

రాజుకు బాగా మందు తాగించి సిరి గురించి నిజం రాబట్టాలని చూసిన భ్రమరాంబ బాగా తన్నులు తినే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. శేషు అడ్డుపడుతున్న వినకుండా భ్రమరాంబను రాజు చితకబాదుతాడు. చివరికి ఆమె ముక్కుపై ఒక్క గుద్దు గుద్దడంతో ఆమె ఇంట్లోకి పారిపోతుంది. తర్వా త శేషు కూడా పారిపోతాడు.

మదన్, స్వాతి ఎమోషనల్

అటు మదన్, స్వాతి తమ భవిష్యత్తు గురించి ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ తినడానికి కూర్చుంటారు. కానీ స్వాతి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరిగిందని మదన్ అడిగితే.. మన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి కదా.. ఇప్పుడెలా అని స్వాతి అడుగుతుంది. నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది కదా.. కచ్చితంగా జాబ్ వస్తుంది.. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్లే అని మదన్ సర్ది చెబుతాడు. నువ్వు నన్ను నమ్మి వచ్చావు.. నిన్ను బాగా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇస్తాడు. దీంతో స్వాతి ఊపిరి పీల్చుకుంటుంది.

భ్రమరాంబ, శేషుకు క్లాస్ పీకిన రేఖ

ఇటు ఇంట్లో భ్రమరాంబ తన దెబ్బలను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. శేషును ఆమెను చూసి లోలోపల నవ్వుకుంటున్నా బయటకు మాత్రం ఓదారుస్తున్నట్లు నటిస్తాడు. వాళ్లిద్దరినీ చూసి రేఖ విసుక్కుంటుంది. ఈ చిన్న పని కూడా చేయడం చేత కాలేదు.. మళ్లీ తన్నులు తిని వచ్చారు.. ఇక మీ వల్ల కాదు.. ఆ రాజు గాడి నుంచి సిరి గురించిన వివరాలు నేనే ఎలాగోలా తెలుసుకుంటాను అని వెళ్లిపోతుంది. వెళ్లు వెళ్లు.. నిన్ను కూడా రాజుగాడు కుమ్మేస్తాడు అని శేషు అనుకుంటాడు.

బెడ్‌రూమ్‌లోకి పాక్కుంటూ రాజు.. బల్లిని చూసి ఇందుని హగ్ చేసుకొని..

మందు ఎక్కువైన రాజు తర్వాత మెల్లగా బెడ్ రూమ్ లోకి పాకుతూ వస్తాడు. ఇందు పడుకుందని అనుకొని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆమె వచ్చి అతని ముందు నిలబడుతుంది. తాగి వచ్చావా అని నిలదీస్తుంది. రెండే పెగ్గులు తాగానని రాజు అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత గోడపై బల్లిని చూసి రాజు కంగారు పడతాడు. అమ్మో బల్లి అంటూ ఇందుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇందు ఎంత వదలమన్నా వదలడు. దీంతో ఇందు కూడా అతన్ని ప్రేమగా హగ్ చేసుకుంటుంది.

ఇందుని నిలదీసిన సిరి.. కుర్చీ తాత గురక అంటూ..

మరోవైపు సిరికి అపర్ణ కథ చెబుతూ నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ కథ చెబుతూ అపర్ణ నిద్రపోతుంది కానీ సిరి మాత్రం పడుకోదు. తర్వాత సిరి పడుకోవాలని చూసినా పక్కనే సుభాష్ గురకలతో నిద్ర పట్టదు. దీంతో రాజు, ఇందు గదికి వెళ్తుంది. అప్పటికి వాళ్లు హగ్ చేసుకోవడం చూసి షాకవుతుంది. నా మొగుడిని ఎందుకు పట్టుకున్నావని ఇందుని నిలదీస్తుంది. ఏం లేదు.. రాజు కిందపడబోతే సాయం చేశానని ఇందు చెబుతుంది. గదిలోకి ఎందుకు వచ్చావని ఇందు అడిగితే.. అక్కడ కుర్చీ తాత గురక తట్టుకోలేకపోతున్నానని, నాకు కథ చెప్పాలని అంటుంది.

సిరికి రాజు కథ.. ఇందు జోలపాట

దీంతో రాజు ఆమెకు కథ చెబుతానని బెడ్ పైకి తీసుకెళ్తాడు. రాజు, ఏడు చేపల కథ చెబుతూ తానే నిద్రపోతాడు. దీంతో ఇందుయే సిరిని తీసుకెళ్లి జోల పాటు పాడుతూ నిద్రపుచ్చుతుంది. ఇటు సిరి, అటు రాజు మధ్య ఆమె పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సిరిని నీ గదిలో ఎందుకు పడుకోబెట్టావని అపర్ణ నిలదీస్తుంది. ఇందు జరిగిన విషయం చెప్పి మరీ అంత కంగారు పడొద్దని అంటుంది.

సిరిని మాయం చేసిన రేఖ

ఇక సిరి చూసేలా బయట రేఖ, భూషణ్, శేషు, భ్రమరాంబ దాగుడు మూతల గేమ్ ఆడుతుంటారు. తానూ ఆడతానని సిరి వస్తుంది. అప్పటికే బయట ఓ కారు, అందులో డ్రైవర్ ను రేఖ సిద్ధంగా ఉంచుతుంది. ఆ కారు డిక్కీ తెరిచి ఉంచి అందులోకి సిరి వెళ్లేలా ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే సిరి అందులోకి వెళ్లి దాక్కోగానే.. కారు డ్రైవర్ బయలుదేరుతాడు. తర్వాత ఇంట్లో సిరి కనిపించడం లేదంటూ రాజు, ఇందు కంగారు పడతారు. రేఖ ఏమీ తెలియనట్లు ఉంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More