Brahmamudi September 16 Episode: బ్రహ్మముడి.. పోలీస్ స్టేషన్‌లోనే మదన్, స్వాతి పెళ్లి.. భ్రమరాంబ రచ్చ.. సిరి, చలపతి గొడవ
Brahmamudi Serial September 16th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో మదన్, స్వాతి పెళ్లిని పోలీస్ స్టేషన్ లోనే జరిపిస్తాడు రాజు. అది చూసి భ్రమరాంబ, రేఖ షాక్ తింటారు. మరోవైపు సిరి, చలపతి గొడవ పడతారు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వ్యభిచారం కేసులో అరెస్టయిన మదన్, స్వాతిలను విడిపించడానికి రాజు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. వాళ్లు స్టేషన్ లోనే పెళ్లి చేసుకుంటారు. మరోవైపు రాజు ఇంట్లో సిరి చుక్కలు చూపిస్తుంటే.. చలపతి ఆమెను కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.

రాజుకి క్లాస్ పీకిన ఇందు.. సారీ చెప్పి బతిమాలిన రాజు
ఐశ్వర్య చెప్పడం వల్లే తనను రాజు కిడ్నాప్ చేశాడన్న విషయం తెలుసుకొని ఇందు చిటపటలాడే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. ఆ విషయం తనకు చెప్పనందుకు ఇందు కోప్పడుతుంది. రాజుపై అలుగుతుంది. దీంతో రాజు ఆమెను బతిమాలుతాడు. సారీ చెబుతాడు. ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను కానీ ఏదో సంజాయిషీ ఇవ్వబోతాడు. కానీ ఇందు వినదు. ఇలా ఎన్ని సీక్రెట్స్ ఇంకా దాచి పెట్టావో అని నిందిస్తుంది.
ఐశ్వర్యకు థ్యాంక్స్ చెప్పిన రాజు, ఇందు
అయితే రాజు మాత్రం ఇందుని కరిగించేలా మాట్లాడతాడు. అయినా ఐశ్వర్య అలా చేసినందు వల్లే కదా నువ్వు నా జీవితంలోకి వచ్చింది.. అందుకే ఆమెకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అని రాజు అంటాడు. అటు ఇందు కూడా మనసులో అదే అనుకుంటుంది. అవును బావ.. ఐశ్వర్య అలా చేయడం వల్లే నువ్వు ఈరోజు నా జీవితంలోకి వచ్చావు అని లోపల అనుకొని సంతోషిస్తుంది. తర్వాత నవ్వుతుంది. దీంతో రాజు కూడా హ్యాపీగా ఫీలవుతాడు. ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు.
తల్లికి ఫోన్ చేసి సిరి గురించి అడిగిన రాజు.. తమ్ముడికి థ్యాంక్స్
ఆ తర్వాత తల్లి లక్ష్మికి ఫోన్ చేస్తాడు రాజు. సిరి ఎలా ఉందని అడుగుతాడు. ఇబ్బంది పెడుతుందా అంటాడు. ఇల్లు పీకి పందిరేయడం తప్ప అన్నీ చేస్తోంది.. చిన్న పిల్లల కంటే దారుణంగా చేస్తోందని లక్ష్మీ చెబుతుంది. ఆమె చిన్న పిల్లనే కదా అని రాజు అంటే.. అది తాను అర్థం చేసుకోగలను కానీ మీ నాన్న వినడం లేదని, ఆమె అల్లరి భరించడం లేదని అంటుంది.
సిరిపై కోప్పడుతున్నారు.. దీంతో ఆమె అలిగి తిననంటోంది.. వెంకీయే బతిమాలి తినిపిస్తున్నాడు.. ఆమె కోసం జోకర్ వేషం కూడా వేసుకున్నాడని అనడంతో రాజు ఎమోషనల్ అవుతాడు. వెంకీతో మాట్లాడి అతనికి థ్యాంక్స్ చెబుతాడు. తాను ఇదంతా ఇందు వదిన కోసం చేస్తున్నానని, ఆమెకు నీపై చాలా నమ్మకం ఉంది.. దానిని వమ్ము కాకుండా చూసుకో అని రాజుతో అంటాడు. అతడు సరేనంటాడు.
వ్యభిచారం కేసులో మదన్, స్వాతి అరెస్ట్.. టీవీలో చూసి ఫ్యామిలీ షాక్..
మరోవైపు హోటల్ రూమ్ లో మదన్, స్వాతి ఉండగా పోలీసులు వస్తారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అందుకే వచ్చామని చెబుతారు. మదన్, స్వాతి గదికి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కు పదండి అనడంతో వాళ్లు షాక్ తింటారు. తాము అలాంటి వాళ్లం కాదని, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చామని, బావామరదళ్లమని, పెళ్లి కూడా చేసుకోబోతున్నామని మదన్, స్వాతి పోలీసులకు చెబుతారు.
అయినా వాళ్లు వినరు. అందరూ ఇలాగే అంటారు.. ఏమైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడండి అని అంటూ వాళ్లను తీసుకెళ్తారు. అక్కడికి మీడియా వాళ్లు కూడా రావడంతో ఆ వార్త టీవీలో వస్తుంది. అది చూసిన శేషు, భ్రమరాంబ, ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు.
భ్రమరాంబ రచ్చ.. రాజుని నిందించి.. రేఖ కూడా..
తన కూతురిని అలాంటి పరిస్థితుల్లో చూసిన భ్రమరాంబ రచ్చ చేస్తుంది. ఇదంతా రాజు వల్లే జరిగిందని అతన్ని నిందిస్తుంది. తానేం చేశానని రాజు అంటే.. నువ్వు వెళ్లి మదన్ ని రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని, నీ వల్లే వాళ్లకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని భ్రమరాంబ అంటుంది. వాళ్లకు ఏం కాదు.. రాజు, ఇందు వెళ్లి విడిపిస్తారు అని అపర్ణ అంటే వాళ్లేంటి విడిపించేది అని రేఖ కూడా ఎంట్రీ ఇస్తుంది.
రాజు, ఇందుయే దీనికి కారణమని ఆమె కూడా నిందిస్తుంది. అసలు మదన్ కు లక్కీని తాను కొడుకుగా అనౌన్స్ చేస్తున్న విషయం తెలియదని, వీళ్లే వెళ్లి అతన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారని అంటుంది. తామే పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడిపిస్తామని రేఖ అంటుంది. వీరు వెళ్లినా మదన్ వినడు అని రాజు చెబుతున్నా వినదు. వాళ్ల వెంటనే రాజు, ఇందు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్తారు.
పోలీస్ స్టేషన్ లో మదన్, స్వాతి పెళ్లి
రాజు చెప్పినట్లే రేఖ ఎంత చెప్పినా మదన్ వినడు. తాను బయటకు రానని అంటాడు. దీంతో రాజు, ఇందు వెళ్లి అతనికి సర్ది చెబుతారు. ఏం చేయాలి రాజు అని మదన్ అడిగితే ఈ నింద మీ మీది నుంచి పోవాలంటే పోలీస్ స్టేషన్ లోనే మీరు పెళ్లి చేసుకోవాలని రాజు చెబుతాడు. దీంతో అప్పుడే స్వాతి మెడలో తాళి కడతాడు మదన్. తర్వాత దండలు మార్చుకుంటారు. అది చూసి రేఖ, భ్రమరాంబ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


