Brahmamudi September 12 Episode: బ్రహ్మముడి.. రాజు తన మనవడన్న సుభాష్.. ఇందు ముందు రాజుని ఇరికించిన ఐషూ.. సిరి అల్లరి
Brahmamudi Serial September 12th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 12 ఎపిసోడ్ లో సిరిని తన ఇంట్లో వదిలేసి వచ్చిన రాజుకి దుగ్గిరాల ఇంట్లో అవమానం జరుగుతుంది. రాజు తన మనవడు అంటూ అప్పుడు సుభాష్ నోరు జారుతాడు. అటు ఇందు ముందు రాజుని ఐషూ ఇరికిస్తుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో గతం మరచిపోయిన సిరిని తన ఇంట్లో వదిలేసి వస్తాడు రాజు. అయితే ఎక్కడికెళ్లావంటూ భ్రమరాంబ, రేఖ నిలదీయడం, సుభాష్ నోరు జారడం, ఇందు చేయి వదలను అని రాజు చెప్పడం ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్స్ గా నిలిచాయి.

స్వాతిని ఇంటికి తీసుకురావాలని ఇందుని బతిమాలిన శేషు
స్వాతి విషయంలో ఆమె తండ్రి శేషు ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. ఓ తండ్రిగా తాను ఫెయిలయ్యానని ఇందుతో శేషు అంటాడు. అందుకే ఆమెకు తనపై నమ్మకం లేదని, మదన్ ను తీసుకొని వెళ్లిపోయిందని చెబుతాడు.
స్వాతికి నీపై నమ్మకం ఉంది.. దయచేసి వాళ్లను తిరిగి ఇంటికి రమ్మని చెప్పమ్మా.. ఆమె నీ మాట వింటుంది అని ఇందుకి దండం పెడతాడు శేషు. దీంతో అతన్ని ఓదారుస్తూ.. నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు.. నేను చూసుకుంటాను అని హామీ ఇస్తుంది.
సిరిని ఇంటికి తీసుకొచ్చిన రాజు.. నిలదీసిన చలపతి
మరోవైపు సిరిని తన ఇంటికి తీసుకెళ్తాడు రాజు. వాళ్లను చూసి చలపతి నిలదీస్తాడు. ఎవరీ అమ్మాయి అని అడిగితే సిరి అని చెప్పడంతో ఆమె రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి అని వాళ్లకు అర్థమవుతుంది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్ అని అడుగుతాడు. కొన్నాళ్లు ఆమె ఇక్కడే ఉంటుందని రాజు చెబుతాడు. ఆమె తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చలపతి స్పష్టం చేస్తాడు.
ఎంతో పరువుగా బతుకుతున్నాం.. నువ్వు డబ్బు సంపాదించినప్పుడు ఎంతో గర్వంగా నేను బస్తీ వాళ్లకు చెప్పుకున్నాను.. ఇప్పుడిలా ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎలా ఒప్పుకుంటాను.. పరువు పోతుంది.. అయినా ఈమెను పెళ్లి చేసుకున్నవాడివి మళ్లీ ఇందుని ఎందుకు పెళ్లి చేసుకున్నావని చలపతి నిలదీస్తాడు.
సిరి గతం మరచిపోయిందన్న రాజు.. నిజాలు త్వరలోనే తెలుస్తాయంటూ..
కానీ రాజు మాత్రం ఏ సమాధానం చెప్పడు. మరోవైపు సిరి వెళ్లి చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంత గొడవ జరుగుతున్నా ఆమె ఏమీ పట్టనట్లు అలా ఉందేంటి అని లక్ష్మీ అడుగుతుంది. సిరి కోమాలో నుంచి బయటకు వచ్చినా గతం మరచిపోయింది.. ఆమె ఆరేళ్ల పిల్లలా వ్యవహరిస్తుందని డాక్టర్ చెప్పాడు.. మీకు నిజాలన్నీ త్వరలోనే తెలుస్తాయి.. ఆమెకు గతం గుర్తుకు వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి అని తండ్రి చలపతికి దండం పెట్టి వేడుకుంటాడు రాజు. అయినా చలపతి మాత్రం వద్దంటాడు. ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదు.. అయినా సరే ఉండాలి అనుకుంటే ఇక మీ ఇష్టం అని చెప్పి చలపతి వెళ్లిపోతాడు.
రాజు ఇల్లు చూసి మురిసిపోయిన సిరి.. మొగుడా అంటూ..
మీ నాన్న అలా అన్నడంటే ఒప్పుకున్నట్లే.. సిరిని పిలువు అని లక్ష్మీ అంటుంది. ఆ తర్వాత సిరికి నువ్వు ఇక్కడే ఉండాలి.. ఈమె మా అమ్మ, అతడు తమ్ముడు అని పరిచయం చేస్తాడు. వెళ్లి ఇల్లు చూడమని పంపిస్తాడు. దీంతో సిరి లోనికి వెళ్లి ఇల్లంతా తిరుగుతూ తెగ మురిసిపోతుంది.
బయటకు వచ్చి ఇల్లు బాగా నచ్చింది మొగుడా అని అనడంతో లక్ష్మీ, వెంకీ షాకవుతారు. డాక్టర్ ఆమెకు తనను మొగుడు అని చెప్పడంతో అలాగే అంటోందని రాజు చెబుతాడు. ఏంట్రా ఇదంతా.. ఆమెను నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని లక్ష్మీ అడిగితే.. ఇప్పుడేమీ అడగొద్దు.. మీకు అన్నీ తెలుస్తాయి అని అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు సాయంత్రం వస్తాను.. నీకు బొమ్మలు తీసుకొస్తాను అని చెప్పడంతో సిరి సరే అంటుంది. రాజు వెళ్తాడు.
రాజుని ఇరుకున పెట్టిన భ్రమరాంబ..
అటు ఇంటికి వెళ్లగానే ఇంత లేట్ అయిందేంటని ఇందు అడుగుతుంది. ఎక్కడికి వెళ్లి వచ్చాడో అడుగు అని భ్రమరాంబ అందుకుంటుంది. తన మొదటి భార్య దగ్గరికి వెళ్లి వచ్చాడు.. ఇదంతా తెలిసి కూడా నువ్వు అతనితో ఎలా కాపురం చేస్తున్నావో.. నా కూతురిని ఇంట్లో నుంచి పంపించాడు.. రేపు మిమ్మల్నీ అలాగే చేస్తాడని అనడంతో అపర్ణ జోక్యం చేసుకుంటుంది. రాజు అలా చేయడు.. అతనిపై తమకు పూర్తి నమ్మకం ఉంది అని అపర్ణ అంటుంది.
రేఖ నానా మాటలు.. రాజు నా మనవడు అన్న సుభాష్
దీంతో రేఖ ఎంటరవుతుంది. ఇంత చేస్తున్నా రాజుని ఎలా నమ్ముతున్నారు.. ఏదో ఒక రోజు నా కొడుకును ఇంట్లో నుంచి పంపించినట్లే మిమ్మల్నీ పంపిస్తాడు అని అనడంతో సుభాష్ తిడతాడు. రాజు నా మనవడు.. ఎప్పటికీ అలా చేయడు అని నోరు జారుతాడు. దీంతో అందరూ షాకవుతారు.
దీంతో అపర్ణ జోక్యం చేసుకుంటూ.. ఇందు భర్తగా తమను సొంత మనవడిలా చూసుకుంటున్నాడని అలా అన్నాడని అంటుంది. చూడటానికి స్వరాజ్ లా ఉన్నాడని, అతని బుద్ధులే ఉంటాయని అనుకోవద్దు.. ఈ రాజు చాలా డేంజర్ అని రేఖ అంటుంది. దీంతో రాజుయే రేఖకు వార్నింగ్ ఇస్తాడు. తాను జీవితంలో ఇందు చేయి వదలబోను అని ఆమె చేయి పట్టుకుంటాడు.
ఇందు ముందు రాజుని ఇరికించిన ఐశ్వర్య
ఆ తర్వాత తాను పరీక్ష రాయడానికి హాల్ టికెట్ కావాలని, దానికోసం రూ.50 వేలు కావాలని ఇందుని అడుగుతుంది ఐశ్వర్య. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఏదో పార్టీ ప్లాన్ చేసినట్లున్నావ్ అని రాజు అంటాడు. నువ్వు మాట్లాడకు.. అయినా నేను చెబితేనే డబ్బు కోసం నువ్వు ఇందుని కిడ్నాప్ చేశావ్ అని అనడంతో రాజు, ఇందు షాకవుతారు.
డబ్బు ఇవ్వకపోవడంతో రేఖ దగ్గరికి వెళ్తుంది ఐశ్వర్య. నువ్వు డిగ్రీ పాసవడం వాళ్లకు ఇష్టం లేదని రేఖ చెబుతుంది. నేను డిగ్రీ పాసై తీరతాను.. సొంత కంపెనీ పెట్టించేలా చేస్తానని శపథం చేస్తుంది. నాకూ అదే కావాలి.. నిన్ను వాడుకొని ఈ ఆస్తిని సొంతం చేసుకుంటానని రేఖ అనుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


