Brahmamudi September 9 Episode: బ్రహ్మముడి.. రివర్స్ అయిన రాజు, ఇందు ప్లాన్.. రేఖ బుట్టలో పడిన లక్కీ.. అయినా ఆనందం ఆవిరి
Brahmamudi Serial September 9th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో రాజు, ఇందు ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. దీంతో మరోసారి రేఖకు లక్ష్యంగా మారతారు. అటు లక్కీ పూర్తిగా రేఖ బుట్టలో పడిపోతాడు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ, లక్కీ, మదన్ డ్రామా రక్తి కట్టించింది. ఒక కొడుకును దగ్గర చేసుకొని అతని ద్వారా ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖకు మరో కొడుకు షాకిస్తాడు. అయితే అందరినీ కలపాలని అనుకున్న రాజు, ఇందు ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది.

తప్పతాగిన మదన్.. సర్ది చెప్పిన రాజు, ఇందు
తన తల్లి చేసిన మోసం గురించి తలుచుకుంటూ మదన్ తప్పతాగే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. లక్కీ గురించి పదే పదే తలచుకుంటూ తాగుతున్న మదన్ దగ్గరికి రాజు, ఇందు వస్తారు. వాళ్లను చూసి మదన్ మండిపడతాడు.
నీ బాధను అర్థం చేసుకోగలం.. కానీ నీలాంటి తెలిసీ తెలియని వయసులో మీ అమ్మ తప్పు చేసింది.. పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దలు ఎలా క్షమిస్తారో.. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మీ అమ్మను క్షమించు.. ఇవాళ లక్కీని అందరి ముందు పెద్ద కొడుకుగా రేఖ పిన్ని అనౌన్స్ చేయబోతుంది.. ఓ పార్టీ కూడా ఏర్పాటు చేసింది.. మీ నాన్న కూడా లక్కీని కొడుకుగా అంగీకరించాడు అని చెప్పడంతో మదన్ ఆశ్చర్యపోతాడు. నాన్నే క్షమించేసాక.. తాను కూడా క్షమించేసినట్లే అని అంటాడు. తాను పార్టీ టైమ్ వస్తానని చెప్పి వాళ్లను పంపించేస్తాడు.
మదన్ గురించి రేఖకు చెప్పిన రాజు..
అటు రేఖ తన గదిలో ఉన్న సమయంలో రాజు వెళ్తాడు. అతన్ని చూడగానే రేఖ మండిపడుతుంది. నువ్వు మదన్ గురించి ఆలోచిస్తున్నావని తెలుసు.. మదన్ నీకు దూరం కావడంలో నా తప్పు కూడా ఉంది.. అందుకే నేను ఇవాళ వెళ్లి మదన్ ను కలిశాను.. అతన్ని కన్విన్స్ చేశాను.. పార్టీకి అతడు వస్తా అన్నాడు అని రాజు చెప్పడంతో రేఖ ఆశ్చర్యపోతుంది.
జరిగిన తప్పేదో జరిగిపోయిది.. ఇక వాటన్నింటినీ పక్కన పెడదాం.. మనమంతా ఒకే కుటుంబం.. మనమే శత్రువులుగా ఉండటం వల్ల లాభమేంటి.. ఇక నుంచి అందరం హాయిగా కలిసుందా.. ఆనందంగా ఉందా.. అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అని రాజు చెప్పి వెళ్లిపోతాడు.
మదన్ కోసం అందంగా ముస్తాబైన స్వాతి.. ఆట పట్టించిన రాజు
అటు పార్టీ టైమ్ కు గేటు దగ్గర నిలబడి వచ్చిన వాళ్లకు రాజు, ఇందు వెల్కమ్ చెబుతుంటారు. మదన్ ఇంకా రాకపోవడంతో ఇందు వేచి చూస్తుంటుంది. అప్పుడే స్వాతి చాలా అందంగా ముస్తాబై బయటకు వస్తుంది. ఆమెను చూడగానే రాజు ఆట పట్టిస్తాడు. నువ్వు ఎందుకు అందంగా ముస్తాబయ్యావో తనకు తెలుసు అని రాజు అంటాడు. మీ బావకు వెల్కమ్ చెప్పడానికే కదా.. ఎందుకైనా మంచిది ఓ గ్లాసులో నీళ్లు తీసుకొని రెడీగా ఉండు.. నిన్ను చూసి పడిపోతే చల్లాలి కదా అని రాజు జోక్ చేస్తాడు. స్వాతి సిగ్గు పడి వెళ్లిపోతుంది. మదన్ సంగతి తర్వాత.. అసలు ఈ లక్కీ గాడు ఎక్కడ అని రాజు అంటాడు.
లక్కీ ఎమోషనల్.. రేఖ కూడా ఎమోషనల్ డైలాగులు.. కరిగిపోయిన లక్కీ
మరోవైపు సూటుబూటు వేసుకొని స్టైల్ గా తయారవుతాడు లక్కీ. తనను తాను అద్దంలో చూసుకుంటూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే రేఖ వస్తుంది. మహారాజులా ఉన్నావని అంటుంది. మీరు కొడుకుగా అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది.. అనాథగా మిగిలిపోతానని భయపడ్డాను.. కానీ తల్లితోపాటు తండ్రిని కూడా ఇచ్చావని లక్కీ అంటాడు. దీంతో రేఖ కూడా తన డ్రామా మొదలుపెడుతుంది.
నిన్ను కావాలని దూరం చేసుకోలేదు.. అప్పుడు పరిస్థితి అలాంటిది.. కానీ నిన్ను దూరం చేసుకున్న తర్వాత ప్రతి రోజూ గుర్తు చేసుకుంటూనే ఉన్నాను.. అసలు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని ఆలోచించేదాన్ని.. ఏ బిడ్డ ఏడుపు వినిపించినా నువ్వే అనుకునే దాన్ని.. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చెప్పలేదని అడిగావు కదా.. భూషణ్, మదన్ గురించి ఆలోచించి ఆగిపోయాను.. వాళ్లను కన్విన్స్ చేసి నిన్ను దగ్గరకు తీసుకుందామనుకున్నాను అని రేఖ ఎమోషనల్ డైలాగులు కొడుతుంది.
అటు భూషణ్ కూడా నిన్ను నా కొడుకుగా అంగీకరిస్తున్నానని చెప్పడంతో లక్కీ బాగా ఎమోషనల్ అవుతాడు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పి నువ్వు ఏం చెబితే అది చేస్తానని అంటాడు. మాకూ అదే కావాలి.. అందుకే ఈ డ్రామా అని రేఖ మనసులో అనుకుంటుంది.
లక్కీని తన కొడుకుగా అందరి ముందూ అంగీకరించిన రేఖ
ఆ తర్వాత పార్టీ మొదలవుతుంది. లక్కీ స్వయంగా రేఖ, భూషణ్ పైనుంచి తీసుకొస్తారు. అందరి ముందూ లక్కీ తాను చేసిన తప్పు గురించి చెబుతుంది. తాను గతంలో చేసిన తప్పును ఇప్పుడు అందరి ముందూ అంగీకరిస్తున్నానని, ఇన్నాళ్లూ తనకు ఒకే కొడుకు అని అందరికీ తెలుసు అని, కానీ తనకు ఇద్దరు కొడుకులు అని రేఖ అనౌన్స్ చేస్తుంది.
ఎంట్రీ ఇచ్చిన మదన్
అప్పుడే మదన్ ఎంట్రీ ఇస్తాడు. రేఖ అనౌన్స్‌మెంట్ తో చప్పట్లు కొట్టుకుంటూ వస్తాడు. నువ్వు నీ నిజం చెప్పావు.. నేను కూడా నీ ముందు నా మనసులో ఉన్న చివరి మాట చెబుతాను అంటాడు. దీంతో అతన్ని చూసి రాజు, ఇందు సంతోషిస్తారు. కానీ మదన్ మాత్రం అందరికీ షాకిస్తూ.. స్వాతి గురించి చెప్పి ఆమెను పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నట్లు అనౌన్స్ చేస్తాడు.
అందరి ముందూ రింగు తొడిగి ఆమెను తీసుకొని వెళ్లిపోతాడు. ఓ కొడుకును మచ్చిక చేసుకొని ఆస్తిని దక్కించుకోవాలని చూసిన రేఖకు మరో కొడుకు దూరమై షాక్ తగులుతుంది. దీనికి కారణం రాజు, ఇందునే అని నిందిస్తూ.. నా కొడుకును దూరం చేసిన మిమ్మల్ని వదలను అని వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


