Brahmamudi September 8 Episode: బ్రహ్మముడి- బెడిసికొట్టిన రేఖ వ్యూహం- స్వాతిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా దూరమైన మదన్
Brahmamudi Serial September 8th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 8వ ఎపిసోడ్‌లో రాజుకు లక్కీ ద్వారా వెన్నుపోటు పొడవబోయి సొంత కొడుకు మదన్‌ను శాశ్వతంగా దూరం చేసుకుంటుంది రేఖ. స్వాతిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోతాడు మదన్. లక్కీపై రేఖ చూపించిన ప్రేమ, రచించిన వ్యూహం తనకే రివర్స్ అవుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు, సిరి, ఇందు గురించి రేఖ, భూషణ్, భ్రమరాంబ తెగ ఆలోచిస్తుంటారు. ఏదో చేద్దామనుకున్నారు ఏదో జరిగింది. ఇందు కొట్టిన దెబ్బకు అందరి మెదడ్లు గిర్రున తిరిగాయ్ అని శేషు అనుకుంటాడు.

ఇందు అబద్ధం చెప్పిందా
ఏదో పెద్దగా చేసినట్లు ఫీల్ అయిపోయావ్. ఇందు మొత్తం మార్చేసింది. ఇంత చెత్త ప్లాన్ వేస్తావనుకోలేదని రేఖను తిడుతుంది భ్రమరాంబ. ప్రతిసారి ఇలా ఎందుకు వీక్ అవుతున్నావ్ అని భూషణ్ అంటాడు. ఇంతకుముందు మగాడు లేడు. ఇప్పుడు అల్లుడు వచ్చాకా పతనం మొదలైంది. అల్లుడు ఉండగా ఆస్తి రాదని శేషు అంటాడు.
ఈ విషయంలో నాకు ఇంకా అనుమానం ఉంది. మన నుంచి తప్పించుకోడానికి ఇందు అబద్ధం చెప్పిందా. రాజుకు సిరికి సంబంధం ఏంటో క్లియర్‌గా తెలుసుకుంటాను. త్వరలోనే రాజును కోలుకోలేని దెబ్బ కొడతాను. దీన్ని ఎవరు ఆపలేరు అని రేఖ అంటుంది. నీ దగ్గర ఏమైనా బ్రహ్మాస్త్రం ఉందా అని భూషణ్ అడుగుతాడు.
వ్యూహంతో కూడా చేధించవచ్చు. లక్కీ. మనకు ఇప్పుడు లక్కీ సాయం తీసుకుంటాను. వాడిని మనం కొడుకుగా అంగీకరిస్తే ఈ ఆస్తిని దక్కించుకోవచ్చు. రాజు బెస్ట్ ఫ్రెండ్ వాడు. కేవలం వాడితోనే రాజును దొంగదెబ్బ తీయొచ్చు. రాజును లక్కీ మోసం చేసేలా నేను చూసుకుంటాను. లక్కీని మన కొడుకుగా చేసుకుని మనవైపు తిప్పుకుంటూ వాడిచేత రాజుకు వెన్నుపోటు పొడిపిద్దామని రేఖ అంటుంది.
దేనికైనా సిద్ధమే
దీంట్లో మనం గెలుస్తామంటే, ఆస్తి మనకు వస్తుందంటే నేను దేనికైనా సిద్ధమే అని భూషణ్ అంటాడు. తర్వాత రాజు గురించి ఇందును అడుగుతారు చలపతి వాళ్లు. రాజు ఏ తప్పు చేయలేదని ఇందు అంటుంది. కానీ, చలపతి వినిపించుకోడు. మీకు నిజం తెలియదు కాబట్టి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఇందు అంటుంది.
మనం తనను అర్థం చేసుకుని కొన్నాళ్లు వెయిట్ చేద్దాం. తనే చెబుతాడు అని ఇందు అంటుంది. నీ అంత మంచి గుణం మాకు లేదమ్మా అని చలపతి, రాజు ఏంటీ ఇలా చేశాడని నందు కోపంగా వెళ్లిపోతారు. ఇప్పుడు రాజుకు పెళ్లి అయింది. మరి నీ సంగతి ఏంటని అపర్ణ అంటుంది. బావను నేను పెళ్లి చేసుకుంటాను. బావ మంచివాడు కదా. నిజాలు బయటపడేవరకు ఇలాగే ఉంటుందని ఇందు అంటుంది.
మరోవైపు బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఎలా అని లక్కీ అనుకుంటాడు. స్వాతిని అడుగుతాడు. నాకు తెలియదు. ఇందు అక్క టిఫిన్ ఎక్కడ పెట్టిందో తెలియదు. వాళ్లు వచ్చేవరకు ఆగాలని స్వాతి అంటుంది. దాంతో స్వాతిని తిట్టి నేను పెడతాను కదా. దా అని లక్కీ చేయి పట్టుకుని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్‌పై కూర్చోబెడుతుంది రేఖ.
లక్కీపై రేఖ దొంగ ప్రేమ
నీకు ఇడ్లీలు అంటే ఇష్టమేనా అని టిఫిన్ పెడుతుంది రేఖ. బాగా ప్రేమ చూపించినట్లు నటిస్తుంది రేఖ. అదంతా చూసిన ఇంట్లోవాళ్లు అంతా షాక్ అవుతారు. లక్కీ తినకపోయేసరికి నేన తినిపించనా అని రేఖ అంటుంది. మేడమ్ అని లక్కీ అంటే.. కాదు అమ్మా.. నేను నిన్ను కొడుకుగా ఒప్పుకుంటున్నాను. ఒక్కసారి నోరారా అమ్మ అని పిలు అని రేఖ అంటుంది.
దాంతో లక్కీ ఎమోషనల్‌గా పిలుస్తాడు. రాజు, ఇందు అవాక్కై చూస్తారు. లక్కీకి టిఫిన్ తినిపిస్తుంది రేఖ. పొలమారితే నీళ్లు తాగిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందని రాజు అయోమయంలో ఉంటాడు. హారతికి చేయి కాల్చుకుని నిజమే అని నొప్పితో అరుస్తాడు రాజు. ఈ సడెన్ మార్పు ఏంటో అర్థం కావట్లేదని భ్రమరాంబ అంటుంది.
ఇన్నాళ్లు లక్కీని కొడుకుగా చూడట్లేదని కొంతమంది ఫీల్ అయ్యారు. సరే. ఎవరేమనుకుంటే ఏంటీ. ఇన్నాళ్లు లక్కీ ఏది మిస్ అయ్యాడో అన్ని నేను ఇప్పుడిస్తాను. తనకు తల్లితో పాటు తండ్రిని కూడా ఇస్తాను. లక్కీకి తండ్రిగా ఉండటానికి భూషణ్ అంగీకరించాడు అని రేఖ అంటుంది. లక్కీ భుజంపై చేయి వేసి భూషణ్ అవును, నాన్న అని పిలు అని అంటాడు.
లక్కీని పెద్దగా కొడుకుగా అనౌన్స్ చేస్తున్నాం
ఈ విషయం మీదనే ఈరోజు రాత్రి పార్టీ అరెంజ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్లందరిని పిలుస్తున్నాను. లక్కీని మా పెద్ద కొడుకుగా అనౌన్స్ చేస్తున్నాం. లక్కీ ఇక అనాథ కాదు అని రేఖ ప్రకటిస్తుంది. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తున్నాను. నీకు స్పెషల్ డ్రెస్ కూడా తెప్పిస్తున్నాను అని రేఖ అంటుంది. అంతా మైండ్ బ్లాక్ అయి చూస్తుంటారు.
మరోవైపు రేఖ చేసినదానికి రాజు కంగారుపడుతుంటాడు. ఇంత త్వరగా ఒప్పుకుంటుందనుకోలేదు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. రేఖ పిన్ని మళ్లీ ప్లానే చేసినట్లు అనిపిస్తుంది. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదని రాజు అంటాడు. ప్లాన్ చేస్తే ఏమొస్తుంది. ఇన్నాళ్లు లక్కీ విషయంలో తప్పు చేశానని ఫీల్ అయినట్లుందని, ఏ డౌట్ పెట్టుకోకు అని ఇందు అంటుంది.
మరి ఓ పని చేద్దామా. లక్కీని దగ్గరికి తీసుకోవాలని అనుకున్నా కానీ మదన్‌ని దూరం పెట్టాలని కాదు. నా వల్ల తప్పు జరిగింది కదా. నా వల్ల తల్లికొడుకులు దూరం అయ్యారు. నా గిల్టీ పోవాలంటే మళ్లీ రేఖ, మదన్‌ను కలపాలి. ఈరోజు జరిగే పార్టీకి మదన్‌ను కూడా తీసుకొచ్చి రేఖను కలపాలి అని రాజు అంటాడు. కానీ, మదన్ వింటాడా అని ఇందు అంటుంది.
బెడిసికొట్టిన రేఖ వ్యూహం
ఏదోటి చెప్పి తీసుకురావాలి. ఇద్దరు కొడుకులు తన కళ్లముందే ఉంటారు కాబట్టి తనకు మనమీదున్న కోపం పోతుంది కదా అని రాజు అంటాడు. సరే మదన్ దగ్గరికి వెళ్దామని ఇందు అంటుంది. తర్వాత లక్కీని కొడుకుగా అనౌన్స్ చేసే పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి వచ్చిన మదన్ తనను ప్రేమించే మనిషి ఒక్క స్వాతి అనే తెలుసుకున్నానంటాడు.
స్వాతిని పెళ్లి చేసుకుని మీకు దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు మదన్ చెబుతాడు. స్వాతికి రింగ్ తొడిగిన మదన్ తీసుకుని వెళ్లిపోతాడు. లక్కీతో రాజుకు వెన్నుపోటు పొడుద్దామనుకున్న రేఖ వ్యూహం తనకే రివర్స్ అయి మదన్ శాశ్వతంగా దూరమవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


