Brahmamudi September 5 Episode: బ్రహ్మముడి.. సిరి రాజు భార్యే.. ఆధారాలతో నిజం బయటపెట్టిన రేఖ.. పెద్ద షాకే ఇచ్చిన ఇందు

Brahmamudi Serial September 5th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 5 ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. హాస్పిటల్లో ఉన్న సిరి రాజు భార్యే అని రేఖ తెలుసుకుంటుంది. అయితే ఆ నిజం అందరి ముందు బయటపెట్టిన తర్వాత ఇందు ఆమెకు మరింత పెద్ద షాకిస్తుంది.

Published on: Sep 5, 2026, 08:45:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. రాజు గురించి ఎవరూ ఊహించని నిజాన్ని రేఖ ఆధారాలతో బయటపెడుతుంది. అందరూ ఆ విషయం విని షాకైనా.. ఇందు మాత్రం రేఖకు అంతకంటే పెద్ద షాక్ ఇవ్వడం ఈ రోజు ఎపిసోడ్ హైలైట్.

Brahmamudi September 5 Episode: బ్రహ్మముడి.. సిరి రాజు భార్యే.. ఆధారాలతో నిజం బయటపెట్టిన రేఖ.. పెద్ద షాకే ఇచ్చిన ఇందు
Brahmamudi September 5 Episode: బ్రహ్మముడి.. సిరి రాజు భార్యే.. ఆధారాలతో నిజం బయటపెట్టిన రేఖ.. పెద్ద షాకే ఇచ్చిన ఇందు

వెంకీ, నందును బయటకు పంపిన ఇందు.. లక్ష్మికి హామీ ఇచ్చి..

రాజు బర్త్ డే ఏర్పాట్లలో భాగంగా కేక్, చికెన్ తీసుకురావాలని వెంకీ, నందును కావాలని ఇందు బయటకు పంపించే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. వాళ్ల మధ్య దూరం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అది చూసి లక్ష్మి ఆందోళనగా ఇందు దగ్గరికి వస్తుంది. ఇది వాళ్ల మరింత దూరం పెంచుతుందేమో అని అంటుంది.

అలా ఏమీ జరగదు.. ఇలా కలిపితేనే దూరం తగ్గుతుంది.. ఇక అంకుల్ గురించి వదిలేయండి.. మా ఇంటికి వస్తే ప్రమాదం కాదు.. మంచే జరుగుతుందని తెలిస్తే వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు.. అంకుల్ ను ఒప్పించే బాధ్యత నాది అని లక్ష్మికి ఇందు హామీ ఇస్తుంది. నువ్వు మా ఇంటికి కోడలివి అయితే సమస్య అనుకున్నాం కానీ.. ఒక్కో సమస్యను నువ్వే పరిష్కరిస్తున్నావంటూ ఇందుపై లక్ష్మి ప్రశంసలు కురిపిస్తుంది.

సిరి కోసం హాస్పిటల్‌కు రాజు.. మాట్లాడలేకపోవడంతో షాక్

అటు సిరి కోసం హాస్పిటల్ కు రాజు పరుగెత్తుకొని వెళ్తాడు. కళ్లు తెరించిందటగా మాట్లాడుతోందా అని డాక్టర్ ను రాజు అడుగుతాడు. కానీ సిరి కళ్లు తెరిచినా.. ఏమీ మాట్లాడదు.. దీంతో రాజు మరింత ఆందోళన పడతాడు. ఆమె కళ్ల ముందు ఏమి కనిపిస్తే దానిని చూస్తోంది కానీ మెదడు ఇంకా పూర్తి రెస్పాండ్ కావడం లేదని రాజుకు చెబుతాడు డాక్టర్. త్వరలోనే కోలుకుంటుందని హామీ ఇస్తాడు.

రాజు సీక్రెట్ తెలుసుకున్న రేఖ

అటు రేఖ మనిషి రాజును ఫాలో అవుతూ హాస్పిటల్ కు వస్తాడు. రాజును డాక్టర్ తో చూసి ఆ విషయం రేఖకు ఫోన్ చేసి చెబుతాడు. రాజు ఇక్కడ వసుంధర హాస్పిటల్ కు వచ్చాడని, ఓ అమ్మాయి కోసం డాక్టర్ తో మాట్లాడుతున్నాడని అంటాడు. అమ్మాయి కోసమా అని రేఖ ఆశ్చర్యపోతుంది. సరే నువ్వు అక్కడే ఉండి.. ఏం మాట్లాడుతున్నాడో విను.. నేను వస్తున్నాను అని రేఖ అంటుంది. రాజు గురించి ఏదో సీక్రెట్ తెలిసిందని రేఖ సంబరపడుతుంది.

నందుకు మళ్లీ అబద్ధం చెప్పిన వెంకీ

అటు కేక్ కోసం బయటకు వెళ్లిన వెంకీ, నందు బైక్ పై సైలెంట్ గా వెళ్తుంటారు. పిలిచావా అని నందుయే మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. కానీ తానేమీ పిలవలేదని వెంకీ అంటాడు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే ఏమీ లేదని వెంకీ అంటాడు. కేక్ తోపాటు వదిన చికెన్ కూడా తీసుకురమ్మంది కదా అని అనడంతో నందు షాకవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు అని విసుక్కుంటుంది.

హాస్పిటల్‌కు రేఖ.. సిరితో రాజును చూసి షాక్

మరోవైపు రేఖ వెంటనే హాస్పిటల్ కు వెళ్తుంది. ఆమె మనిషి రాజు ఎక్కడున్నాడో చూపించి వెళ్లిపోతాడు. అక్కడ సిరితో కలిసి రాజును చూసి రేఖ షాక్ తింటుంది. రాజు డాక్టర్ తో మాట్లాడుతుంటే.. బయట నుంచి చూస్తూ ఉంటుంది. సిరి కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెడతానని రాజు అంటాడు. ఇంత వరకూ చాలా ఖర్చు పెట్టారు.. ఇక అవసరం లేదు.. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్ హామీ ఇస్తాడు. ఆ తర్వాత నర్సును బయటకు పంపించి మందులు తీసుకురమ్మని చెబుతాడు.

రాజుకు పెళ్లయిందన్న నర్సు.. మురిసిపోయిన రేఖ

నర్సు బయటకు రాగానే రేఖను చూసి ఎవరని అడుగుతుంది. నేను లోపల ఉన్న అబ్బాయి కోసం వచ్చానని చెబుతుంది. రాజు కోసమా అని అడుగుతుంది. అవునని రేఖ అంటుంది. ఏం తెలుసుకోవాలని అని నర్సు అడగడంతో మా అమ్మాయి కోసం సంబంధాలు చూస్తున్నామని, ఓ పెళ్లిళ్ల పేరయ్య రాజు గురించి చెప్పడంతో వచ్చానని రేఖ అబద్ధం చెబుతుంది.

కానీ నర్సు మాత్రం అతనికి ఇప్పటికే పెళ్లయిందని, ఆ బెడ్ పై ఉన్న సిరి అనే అమ్మాయే అతని భార్య అని చెప్పడంతో రేఖ మైండ్ బ్లాకవుతుంది. భర్త స్థానంలో అతని పేరే ఉందని ఫైల్ చూపిస్తుంది నర్సు. రేఖ దానిని ఫొటో తీసుకుంటుంది. రాజు తనకు దొరికిపోయాడని తెగ సంతోషపడుతుంది.

రాజు బర్త్‌డే కోసం వెంకీ, నందు ఏర్పాట్లు.. ఐశ్వర్యకు క్లాస్

ఇంట్లో రాజు బర్త్ డే కోసం వెంకీ, నందును కలిసి డెకరేషన్ చేయమని ఇందు చెబుతుంది. దీంతో ఇద్దరూ ఆ పనుల్లో ఉంటారు. అప్పుడే ఐశ్వర్య వచ్చి నువ్వు వరంగల్లో ఉండాలి కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్.. నువ్వు రావని నేను చాలా సంతోషించానని ఐశ్వర్య అంటుంది. దీంతో నందు ఆమెతో గొడవ పడుతుంది. క్లాస్ పీకుతుంది. ముందు నువ్వు డిగ్రీ పాసై చూపించు అని ఛాలెంజ్ చేస్తుంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. లక్కీ కూడా వచ్చి పరువు తీయడంతో ఐషూ వెళ్లిపోతుంది.

అందరి ముందు రాజు నిజం బయటపెట్టిన రేఖ.. షాకిచ్చిన ఇందు

అటు రాజు కోసం అందరూ ఎదురు చూస్తుండగా అతడు వస్తాడు. నీ బర్త్ డే నాడే నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అని ఇందు అడుగుతుంది. ఒక ముఖ్యమైన పని అని రాజు అంటాడు. అవును నిజంగానే చాలా ముఖ్యమైన పని అని రేఖ ఎంట్రీ ఇస్తుంది. రాజు వెళ్లిన పని చాలా ముఖ్యమైనదని, ఆ విషయం అతన్నే అడగండి అని అంటుంది.

రాజు వెళ్లింది ఓ హాస్పిటల్ కు అని రేఖ చెబుతుంది. అక్కడ ఉన్న ఆ అమ్మాయి ఎవరు రాజు.. సిరితో నీకు పెళ్లయింది కదా అని అడగడంతో అందరూ షాకవుతారు. తన దగ్గర ఉన్న ఆధారాన్ని కూడా చూపిస్తుంది. కానీ ఇందు మాత్రం సిరి గురించి తనకు ముందే తెలుసు అని అనడంతో రేఖకు దిమ్మదిరిగపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More