Brahmamudi August 29 Episode: బ్రహ్మముడి.. లక్కీ నా కొడుకే.. రాజు చెప్పింది నిజమే.. ఒప్పుకున్న రేఖ.. కళ్లు తెరిచిన సిరి
Brahmamudi Serial August 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే వచ్చింది. రాజు, ఇందు పెళ్లి ఉత్తదే అని ఐశ్వర్య నిరూపించే ప్రయత్నంలో లక్కీ తన కొడుకే అని రేఖ అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. లక్కీగాడు రేఖ పిన్నీ కొడుకే అని రాజు చెప్పడం, డీఎన్ఏ రిపోర్ట్ బయటపెట్టడం, అందరూ నిలదీయడంతో లక్కీ తన కొడుకే అని రేఖ ఒప్పుకునే సీన్లతో ఈ లేటస్ట్ ఎపిసోడ్ రక్తి కట్టించింది.

రాజు, ఇందుకు పెళ్లి కాలేదని తేల్చిన ఐశ్వర్య
ఇందు తలపై అక్షింతలు వేయకుండానే రాజు వెళ్లిపోయే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం ఆగస్ట్ 29 ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఐశ్వర్య ఇక అందుకుంటుంది. నేను చెప్పినా ఎవరూ నమ్మలేదు కదా.. ఏదో ఒకటి చేసి వ్రతం పూర్తి చేయరని కూడా ముందే చెప్పాను కదా.. వాళ్లకు పెళ్లి కాలేదని ఇప్పుడైనా నమ్ముతారా అని ఐశ్వర్య అంటుంది.
దీంతో రేఖలో అనుమానం మొదలవుతుంది. ఏదో అర్జెంట్ కాల్ రావడం వల్ల అలా వెళ్లాడని అపర్ణ చెబుతున్నా.. ఎంత అర్జెంట్ అయినా అక్షింతలు వేసి వెళ్తే అయిపోయేది కదా అని శేషు కూడా అంటాడు. దీంతో అందరిలోనూ అనుమానం మరింత బలపడుతుంది.
రేఖ నుంచి ఇందుని కాపాడేందుకు అపర్ణ ప్రయత్నం
రేఖ కూడా ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తుంటుంది. ఆమెకు అనుమానం రాకుండా అడ్డుకోవాలనుకున్న అపర్ణ.. మళ్లీ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా రాజును మళ్లీ మళ్లీ అనుమానిస్తుంటే అతడు హర్ట్ అవుతాడు.. ఏదో అర్జెంట్ కాల్ వస్తేనే వెళ్లాడు కదా.. మీరూ చూశారు కదా అని చెప్పబోతుంటే రేఖ అడ్డుకుంటుంది. ఇక చాలు ఆంటీ.. వీళ్లకు పెళ్లి జరిగిందో లేదో ఇవాళ తేలిపోవాల్సిందే అని స్పష్టం చేస్తుంది. రాజు వచ్చిన తర్వాత నిలదీద్దామని డిసైడవుతారు.
హాస్పిటల్‌కు పరుగెత్తుకెళ్లిన రాజు.. సిరిని చూసి ఎమోషనల్
అటు ఫోన్ రాగానే హాస్పిటల్ కు పరుగెత్తుకొని వెళ్తాడు రాజు. అప్పటికే ఆ అమ్మాయిని డాక్టర్ పరీక్షిస్తుంటాడు. ఆమెకు ఎలా ఉంది.. కదిలిందా మాట్లాడిందా అని అడుగుతాడు. లేదు.. కేవలం కుడి చేయి వేలు మాత్రమే కదిలిచిందని నర్స్ చెబితే వచ్చి చూస్తున్నాను అని డాక్టర్ అంటాడు. సిరిని చూసి ఎమోషనల్ అయిన రాజు.. ఆమె దగ్గరికి వెళ్లి లే సిరి.. నన్ను చూడు.. మాట్లాడు అంటూ రాజు అరుస్తాడు.
కానీ డాక్టర్ అతన్ని వారిస్తూ అలా బలవంత పెడితే ప్రమాదం.. ఇది కేవలం ఒక సంకేతం మాత్రమే.. రెండేళ్లుగా ఆమెను బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.. ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగించాలని అనడంతో రాజు నిరాశగా వెళ్లిపోతుంటాడు. అప్పుడే సిరి కనురెప్పులు ఆడించడం నర్స్ చూస్తుంది. అదే విషయం చెప్పడంతో రాజు మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లి ఆశగా పిలుస్తాడు. కానీ ఇవన్నీ సంకేతాలని, త్వరలోనే ఆమె పూర్తిగా నయమవుతుందని చెప్పి రాజును పంపిస్తాడు. ఇంకెన్నాళ్లీ నరకం నాకు అని రాజు బాధపడుతూ ఇంటికి వెళ్తాడు.
ఇంట్లో రేఖ, ఐశ్వర్య పంచాయితీ.. చిక్కుల్లో పడిన రాజు
రాజు ఇంటికి రాగానే రేఖ, ఐశ్వర్య పంచాయితీ పెట్టడానికి రెడీగా ఉంటారు. ఏమైందని రాజు అడిగితే.. వ్రతం పూర్తి చేయకుండా ఎందుకు వెళ్లావ్.. నీకు, ఇందుకు అసలు పెళ్లయిందా అని మరోసారి ఐశ్వర్య నిలదీస్తుంది. అటు రేఖ కూడా అదే విషయం అడుగుతుంది. అర్జెంట్ కాల్ వస్తే వెళ్లాను అని రాజు చెబితే.. ఎక్కడికి హాస్పిటల్లో ఎవరైనా చావుబతుకుల్లో ఉన్నారా.. ఒకసారి నంబర్ ఇస్తే చేసి డౌట్ క్లియర్ చేసుకుంటాం అని ఐశ్వర్య అనడంతో రాజు చిక్కుల్లో పడతాడు.
నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్న రాజు
ఐశ్వర్య పదే పదే అదే విషయం అడుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న రాజు.. మాకు పెళ్లి జరిగింది.. అది ముందే చెప్పాను.. మ్యారేజీ సర్టిఫికెట్ కూడా చూపించాను.. ఇక ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని తేల్చి చెబుతాడు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి అని రాజు వెళ్లిపోతుంటే రేఖ ఎంట్రీ ఇస్తుంది.
రాజును రెచ్చగొట్టిన రేఖ.. నిజం చెప్పేసిన రాజు
రాజును రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అసలు ఎవరు నువ్వు.. ఓ దొంగవి, ఓ కిడ్నాపర్ వి.. తల్లిదండ్రులను కూడా మోసం చేసే వాడివి అని నానా మాటలు అంటుంది. అయినా కిడ్నాప్ చేసిన అమ్మాయిని ప్రేమించావంటే ఎలా నమ్మాలి అని అడుగుతుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయినే ప్రేమిస్తానని తానూ అనుకోలేదని, కానీ అలా జరిగిపోయిందని రాజు అంటాడు.
అసలు ప్రేమంటే ఏంటో నీకు తెలుసా.. బస్తీల్లో చిల్లరగా తిరిగేవాడివి అంటూ రేఖ అనడంతో ప్రేమ గురించి నాకు చెప్పకు.. నీలాగే పొత్తిళ్లలోనే కొడుకును వదిలేసేంత దుర్మార్గుడిని కాను అని రాజు నిజం చెప్పేస్తాడు. దీంతో రేఖ సహా అందరూ షాక్ తింటారు. రాజు కాలర్ పట్టుకొని మదన్ నిలదీస్తాడు.
అటు పొత్తిళ్లలోనే వదిలేసిందంటే అది నేనే.. అంటే ఈ రేఖ మేడమే నా తల్లా అని రాజును అడుగుతాడు లక్కీ. నిజం చెప్పమని అతన్ని బతిమాలుతాడు. దీంతో మదన్ వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ రా.. నా తల్లి గురించి అలాంటి మాటలు మాట్లాడతావా అని లక్కీని అడ్డుకుంటాడు. దీంతో మదన్ ను లక్కీ కొడతాడు.
దారుణంగా మాట్లాడిన భ్రమరాంబ.. రేఖే తల్లి అని చెప్పిన రాజు
అది చూసి భ్రమరాంబ రెచ్చిపోతుంది. నా మేనల్లుడినే కొడతావా అంటూ లక్కీ చెంప చెల్లుమనిపిస్తుంది. ఓ అనాథగాడివి.. ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇల్లే నీది అన్నట్లుగా మాట్లాడతావా.. అనాథవి అనాథలా ఉండు అంటూ దారుణంగా మాట్లాడుతుంటే రేఖ చాలా ఇబ్బందిగా ఫీలవుతుంది. ఎవడికి పుట్టావో కూడా తెలియదు అని భ్రమరాంబ అనడంతో లక్కీ ఈ రేఖ పిన్ని కొడుకే అని రాజు చెప్పేస్తాడు.
డీఎన్ఏ రిపోర్ట్ చూపించిన రాజు
రాజు అసలు నిజం చెప్పేయడంతో రేఖకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావంటూ భ్రమరాంబ, మదన్ నిలదీయడంతో రాజు డీఎన్ఏ రిపోర్ట్ బయటపెడతాడు. అది చూసిన మదన్.. లక్కీ తల్లి రేఖే అని తెలుసుకుంటాడు. ఇది నిజమేనా అని రేఖను అడిగితే చివరికి రేఖ నిజం చెప్పేస్తుంది. అవును లక్కీ నా కొడుకే.. రాజు చెప్పింది నిజం.. ఆ రిపోర్ట్ కూడా నిజం అని అంటుంది. దీంతో అందరూ షాకవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


