Brahmamudi August 22 Episode: బ్రహ్మముడి.. ఇందుకు గుడ్ న్యూస్.. ఐశ్వర్యకు కొత్త కంపెనీ.. రిపోర్ట్ చించేసిన రేఖ

Brahmamudi Serial August 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 22 ఎపిసోడ్ లో రేఖ తన డీఎన్ఏ రిపోర్టును చించేస్తుంది. అయితే సాఫ్ట్ కాపీతో రాజు ఆమెను భయపెడతాడు. అటు సుభాష్ సర్జరీ రూపంలో ఇందుకు గుడ్ న్యూస్ రాగా.. ఐశ్వర్యకు కొత్త కంపెనీ అంటూ ఇందు షాకిస్తుంది.

Published on: Aug 22, 2026, 08:11:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖతో రాజు ఆడుకుంటాడు. చివరికి తన డీఎన్ఏ రిపోర్ట్ సంపాదించి దానిని రేఖ చించేసినా.. సాఫ్ట్ కాపీ అంటూ రాజు మరో అస్త్రం వదులుతాడు. అటు డిగ్రీ పాసైతే కొత్త కంపెనీ పెట్టిస్తానంటూ ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది.

Brahmamudi August 22 Episode: బ్రహ్మముడి.. ఇందుకు గుడ్ న్యూస్.. ఐశ్వర్యకు కొత్త కంపెనీ.. రిపోర్ట్ చించేసిన రేఖ
Brahmamudi August 22 Episode: బ్రహ్మముడి.. ఇందుకు గుడ్ న్యూస్.. ఐశ్వర్యకు కొత్త కంపెనీ.. రిపోర్ట్ చించేసిన రేఖ

ఊపిరి పీల్చుకున్న రేఖ

తన డీఎన్ఏ రిపోర్ట్ రాజు ఎక్కడ పెట్టాడో తెలియక పరుగెత్తుతున్న రేఖ.. భ్రమరాంబ చేతుల్లో ఓ పేపర్ చూసి కంగారు పడే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 22) ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ పేపర్ ఆమె చేతుల్లో నుంచి తీసుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

చివరికి ఆమె చేతుల్లో ఉన్నది డీఎన్ఏ రిపోర్ట్ కాదని, శేషుకు భ్రమరాంబ పండ్లు, ఇతర సరకుల కోసం రాసిచ్చిన లిస్ట్ అని తెలిసి రేఖ ఊపిరి పీల్చుకుంటుంది. అందులో సగం నొక్కేశాడని చిందులేస్తుంటుంది భ్రమరాంబ. కానీ తన రిపోర్ట్ విషయం తెలిసి ఆమె అలా చేస్తుందేమో అని రేఖ అనుకుంటుంది. చివరికి నిజం తెలిసి వాళ్లను తిట్టి రేఖ వెళ్లిపోతుంది.

రాజుకు దండం పెట్టి బతిమాలిన రేఖ

ఇంట్లో రాజు కాలుపై కాలు వేసుకొని కూర్చొంటాడు. అతని దగ్గరికి వెళ్లి రేఖ బతిమాలుకుంటుంది. చేతులెత్తి దండం పెడుతుంది. దయచేసి ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టావో చెప్పమని వేడుకుంటుంది. కానీ రాజు మాత్రం ఆమెతో ఆడుకుంటూనే ఉంటాడు. పైనుంచి ఇదంతా చూస్తున్న ఇందు సంతోషిస్తుంది. తనతో ఒకప్పుడు రేఖ ఎలా ఆడుకుందో గుర్తు చేసుకుంటుంది. రేఖ కంగారు పడుతూ రాజుని ఆ రిపోర్ట్ గురించి అడుగుతూనే ఉంటుంది.

మదన్ గదిలో డీఎన్ఏ రిపోర్ట్

చివరికి ఆ రిపోర్ట్ ఎక్కడ ఉందో రాజు చెబుతాడు. నీ కన్న కొడుకు అని రాజు చెప్పబోతుండగా.. లక్కీ అని రేఖ అంటుంది. కన్న కొడుకు అనగానే లక్కీయే గుర్తుకొచ్చాడా అయితే మదన్ కాదా అని రాజు అనడంతో చిరాకు పడుతుంది. నీ ఇద్దరు కొడుకులు ఉన్న గదిలోనే ఆ రిపోర్ట్ ఉంది.. ఆ ఇద్దరిలో ఎవరు ఆ రిపోర్ట్ చూసినా నీకు డేంజరే అని రాజు అంటాడు. దీంతో రేఖ పరుగెత్తుతుంది. అది చూసిన రాజు.. పరుగెత్తు పిన్నీ.. ఒకప్పుడు ఇందుని కూడా ఇలాగే పరుగెత్తించావు కదా అని అనుకుంటాడు.

రిపోర్ట్ లాక్కున్న రేఖ.. నిలదీసిన మదన్

అటు గదిలో మదన్, లక్కీ ఉంటారు. ఇంతలో మదన్ కంట ఆ రిపోర్ట్ పడుతుంది. దానికి తీసుకోబోయే లోపే పరుగెత్తుకుంటూ వచ్చిన రేఖ ఆ రిపోర్ట్ లాక్కుంటుంది. ఆమె కంగారు పడటం చూసి అదేంటని మదన్ అడుగుతాడు. ఏదో రిపోర్ట్ లాగా ఉంది.. ఎవరిది, ఏంటని నిలదీస్తాడు.

అదేంటో చెప్పలేక రేఖ తంటాలు పడుతుంది. చివరికి తన బ్లడ్ రిపోర్ట్ అని, తానే చూస్తానని రేఖ అంటుంది. అందులో అంతలా కంగారు పడాల్సిందేముంది అని మదన్ అడిగితే ఏం లేదు అంటూ రేఖ వెళ్లిపోతుంది. అందులో ఏముండొచ్చు బ్రదర్ అని మదన్ ను లక్కీ అడిగితే అతడు చీదరించుకొని వెళ్లిపోతాడు.

రిపోర్ట్ చించేసిన రేఖ.. ఆడుకున్న రాజు

కిందికి రాగానే రాజును చూసి ఆ రిపోర్ట్ చించేస్తుంది రేఖ. దీనిని చూసుకునే కదా నాతో ఆడుకున్నావ్.. ఇప్పుడీ రిపోర్ట్ లేదు కదా అని రేఖ అంటుంది. కానీ రాజు ఆమెను చూసి నవ్వుతాడు. ఈ ఒక్క రిపోర్ట్ చించేస్తే ఏం లాభం.. నా మెయిల్ లో సాఫ్ట్ కాపీ చాలా భద్రంగా ఉంది.. దానిని పది కాపీలు తీసి ఇంట్లో వాళ్లకు పంచేస్తే ఎలా.. ఓ వంద కాపీలు తీసి ఇల్లంతా పరిచేస్తే ఏం చేస్తావ్.. ఇదంతా ఎందుకు దానిని అందరి ఫోన్లకు పంపిస్తే ఎలా అంటూ రాజు ఆడుకుంటాడు. ఇదే నీకు చివరి వార్నింగ్.. లక్కీ నీ కొడుకు అని నువ్వే నీ నోటితో చెప్పు.. లేదంటే ఈసారి చెప్పినంత పనీ చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

రేఖకు గట్టి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ

తల పట్టుకొని కూర్చున్న రేఖ దగ్గరికి అపర్ణ వస్తుంది. ఏమైంది రేఖ అలా ఉన్నావ్.. నా మనవడు నిన్ను బాగా పరిగెత్తిస్తున్నాడా అని అడగడంతో రేఖ షాక్ తింటుంది. ఈమెకు తన గురించి నిజం తెలిసిందా అని భయపడుతుంది. నా మనవడికి, నీకు మధ్య ఏముందో తెలియదు కానీ కర్మ ఎలా ఉంటుందో నిన్ను చూసిన తర్వాత తెలిసింది అని అపర్ణ అనడంతో నిజం తెలియలేదని రేఖ ఊపిరి పీల్చుకుంటుంది. ఒకప్పుడు ఈ ఇంట్లో ఇందును ఎంతలా పరుగెత్తించావు.. ఈరోజు నీకు అదే గతి పట్టించాడు నా మనవడు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో లేదంటే నీకు రోజు దగ్గర పడినట్లే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అపర్ణ వెళ్లిపోతుంది.

సుభాష్ సర్జరీకి డాక్టర్ గ్రీన్ సిగ్నల్

ఇటు రాజు, ఇందు హాస్పిటల్ కు వెళ్తారు. సుభాష్ సర్జరీ గురించి డాక్టర్ ను అడుగుతారు. లేటెస్ట్ రిపోర్టులు అన్నీ చూసిన డాక్టర్.. సర్జరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ సర్జరీ చేస్తే సుభాష్ మళ్లీ లేచి నిలబడతాడు.. నడుస్తాడు అని డాక్టర్ చెప్పడంతో ఇందు చాలా సంతోషిస్తుంది. అయితే సర్జరీ తర్వాత కూడా అతనికి ఫిజియో థెరపీ కొనసాగించాలని డాక్టర్ చెబుతాడు. ఇందు సరే అంటుంది. అదే సంతోషంలో రాజు, ఇందు ఇంటికి బయలుదేరుతారు.

ఇంట్లో ఐశ్వర్య పార్టీ.. అపర్ణను డబ్బుల కోసం డిమాండ్.. శశికి ఫోన్

ఇటు ఇంట్లో తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వాలని ఐశ్వర్య డిసైడవుతుంది. దానికోసం డబ్బులు కావాలని, ఇందు ఎక్కడ అని అపర్ణను అడుగుతుంది. ఆమె లేదని, హాస్పిటల్ కు వెళ్లిందని అపర్ణ చెబుతుంది. అయితే పార్టీకి నువ్వే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.

ఇంట్లో పార్టీలు ఏంటి.. అయినా నా దగ్గర డబ్బులు లేవని అంటుంది. దీంతో ఆమె ముందే శశికి ఫోన్ చేస్తుంది ఐశ్వర్య. పార్టీకి డబ్బులు లేవని చెప్పడంతో అన్నీ తానే తీసుకొస్తానని అతడు అంటాడు. అది విని అసలు ఆ అబ్బాయికి దూరంగా ఉండమని చెబితే అతన్ని ఇంటికి పిలిచి పార్టీలేంటని అపర్ణ తిడుతుంది. కానీ ఐశ్వర్య వినదు. తానేంటో చూపిస్తానని అంటుంది.

ఐశ్వర్యకు ఇందు ఛాలెంజ్

ఇంట్లో గట్టిగా సౌండ్ పెట్టి ఐశ్వర్య, ఆమె ఫ్రెండ్స్ డ్యాన్సులు చేస్తుంటారు. అపర్ణ చెప్పినా వినరు. ఇంతలో ఇందు వచ్చి స్పీకర్ ఆఫ్ చేస్తుంది. ఐశ్వర్య ఆమెతో గొడవకు దిగుతుంది. ముందు నువ్వు డిగ్రీ పాసవ్వు అని అంటుంది. ఒకవేళ డిగ్రీ పాసైతే పార్టీలకు డబ్బులు ఇస్తావా అని ఐశ్వర్య అంటే.. డబ్బులు కాదు.. నీకు సొంత కంపెనీయే పెట్టిస్తానని ఇందు అంటుంది. దీంతో అందరూ షాక్ తింటారు. ఐషూని తనవైపు తిప్పుకోవడానికి ఇందు ఏదో ప్లాన్ చేసిందని రేఖ అనుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More