Brahmamudi August 19 Episode: బ్రహ్మముడి.. ఐసీయూలో రాజు గర్ల్‌ఫ్రెండ్.. రేఖ ఈజ్ బ్యాక్.. రాజు పరువు తీసిన ఇందు

Brahmamudi Serial August 19 Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 19 ఎపిసోడ్ లో హాస్పిటల్లోని ఐసీయూలో ఉన్నది రాజు గర్ల్‌ఫ్రెండ్ అని తేలుతుంది. అయితే రాజు మరొకరి ప్రేమలో పడకుండా ఇందుయే అతన్ని ప్రేమలోకి దించే ప్లాన్ వేస్తుంది.

Published on: Aug 19, 2026, 08:07:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఓ కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ హాస్పిటల్లో రాజు ఎవరి కోసం డబ్బులు కడుతున్నాడో ఆ వ్యక్తిని తొలిసారి చూపించారు. ఆమె రాజు గర్ల్‌ఫ్రెండ్ అన్నట్లుగా పరోక్షంగా చూపించడం విశేషం. అటు ఐశ్వర్య ద్వారా రేఖ మరోసారి తన ప్లాన్స్ కు పదును పెడుతుంది.

Brahmamudi August 19 Episode: బ్రహ్మముడి.. ఐసీయూలో రాజు గర్ల్‌ఫ్రెండ్.. రేఖ ఈజ్ బ్యాక్.. రాజు పరువు తీసిన ఇందు
Brahmamudi August 19 Episode: బ్రహ్మముడి.. ఐసీయూలో రాజు గర్ల్‌ఫ్రెండ్.. రేఖ ఈజ్ బ్యాక్.. రాజు పరువు తీసిన ఇందు

ఇందుని నిలదీసిన ఐశ్వర్య

డబ్బు కోసం ఇందును ఐశ్వర్య నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్ మొదలైంది. తానూ ఈ ఇంటి వారసురాలినే అని, తనకు మాత్రం ఎందుకు డబ్బులు ఇవ్వవని ఇందుని ఐశ్వర్య నిలదీస్తుంది. మీకు ఉన్న హక్కే ఈ ఆస్తిపై తనకూ ఉందని అంటుంది. కరెక్టే కానీ.. ఇప్పుడిప్పుడే మన బిజినెస్ లాభాల్లోకి వస్తోంది.. ఇప్పుడే మనం చూసి ఖర్చు పెట్టాలి.. లేదంటే అప్పుల పాలవుతాం.. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. తాతయ్య సర్జరీ కోసం దాచిన డబ్బే ఉంది అని ఇందు చెబుతుంది.

ఐశ్వర్య చెంప పగలగొట్టిన ఇందు.. ఆవేశంతో ఊగిపోతూ..

ఆ డబ్బే ఇవ్వు.. ఆ ముసలోడికి ఇప్పుడు ఆపరేషన్ అవసరమా.. లేచి నడిచి చేసేది ఏముంది అని ఐశ్వర్య దారుణంగా మాట్లాడుతుంది. దీంతో సహనం కోల్పోయిన ఇందు.. ఐశ్వర్య చెంప పగలగొడుతుంది. అది చూసి రేఖ, భ్రమరాంబ సహా అందరూ షాక్ తింటారు. తొలిసారి ఇందు ఆవేశంతో ఊగిపోతుంది.

వాళ్లే లేకపోతే నువ్వూ, నేను ఎక్కడి నుంచి వచ్చేవాళ్లం.. ఎంతో కష్టపడి వాళ్లు ఈ దుగ్గిరాల సామ్రాజ్యాన్ని నిర్మించారు.. వాళ్లు అలా చేశారు కాబట్టే మనం ఇప్పుడిలా ఉండగలుగుతున్నాం.. నీలాగా పార్టీలు, పబ్బులు అని వాళ్లు కూడా తిరిగి ఉంటే మనం ఇప్పుడిలా ఉండే వాళ్లమే కాదు.. నన్ను ఎన్నయినా తిట్టు భరిస్తాను.. కానీ నాన్నమ్మ, తాతయ్య జోలికి వస్తే ఊరుకోను.. చంపేస్తాను.. వాళ్లను ఇంతలా అవమానించిన నీకు అసలు భూమి మీద ఉండే హక్కే లేదు.. ఛీ అని వెళ్లిపోతుంది. అటు నందు కూడా క్లాస్ పీకి వెళ్లిపోతుంది. దీంతో అవమాన భారంతో ఐశ్వర్య రగిలిపోతుంది.

ఐశ్వర్య ముందు రేఖను ఇరికించిన శేషు

ఆ తర్వాత ఐశ్వర్య ముందు రేఖను ఇరికిస్తాడు శేషు. అందరూ ఒకచోట ఉండగా అక్కడికి నవ్వుకుంటూ వస్తాడు శేషు. ఇందును డబ్బులు అడిగితే కొడుతుందని నీకు ముందే తెలుసు కదా చెల్లెమ్మా.. అందుకే కదా నువ్వు వెళ్లలేదు.. భ్రమరాన్ని పంపలేదు.. బామ్మర్దినీ పంపించలేదు.. చివరికి ఐశ్వర్యను పంపించావు అని అంటాడు. దీంతో ఐషూ షాక్ తింటుంది.

ఐశ్వర్యకు నూరిపోసిన రేఖ, భ్రమరాంబ.. ఆస్తిలో హక్కు అంటూ..

వెంటనే ఐశ్వర్య దగ్గరికి వెళ్లిన రేఖ ఆమెను లేనిపోనివి నూరిపోస్తుంది. అసలు నిన్ను నేను ఎంత బాగా చూసుకున్నాను.. మహారాణిలా ఉండేదానివి.. చిటికేస్తే పనులు జరిగేవి.. ఆ ఇందు కుక్కిన పేనులా పడి ఉండేది.. కానీ ఇప్పుడు చూడు.. వాళ్లలాగే నువ్వు కూడా ఈ ఇంటికి వారసురాలివి.. ఈ ఆస్తిపై నీకు కూడా హక్కు ఉంది అంటూ రేఖ, భ్రమరాంబ ఆమెకు నూరిపోస్తారు. దీంతో ఐశ్వర్య మరింత ఆవేశంతో రగిలిపోతుంది. ఇక లాభం లేదు.. ఇక నేనేంటో వాళ్లకు చూపిస్తాను అంటూ ఐషూ వెళ్లిపోతుంది.

రేఖ ఈజ్ బ్యాక్.. మళ్లీ మొదలైన ప్లాన్స్

ఆమె వెళ్లిన తర్వాత ఇదంతా నీ ప్లానేనా.. నిజంగా ప్లాన్ వేశావా అని శేషు అడుగుతాడు. అవును.. రేఖ ఈజ్ బ్యాక్.. ఆ రాజు గాడు ఎగిరెగిరి పడుతున్నాడు కదా.. ఇప్పుడు వాళ్లకు తాను కాకుండా ఐశ్వర్యతో చెక్ పెట్టిస్తాను.. అందుకే ఆమెను రెచ్చగొట్టి రంగంలోకి దింపుతున్నాను.. ఇక జరగబోయేది చూడండి అంటూ వాళ్లకు చెప్పి వెళ్లిపోతుంది రేఖ.

సుభాష్ ఎమోషనల్..

ఇటు సుభాష్ ఎమోషనల్ అవుతాడు. కంటతడి పెడతాడు. ఎందుకు ఏడుస్తున్నావని ఇందు అడుగుతుంది. ఇవి కన్నీళ్లు కాదమ్మా.. ఆనంద భాష్పాలు అని సుభాష్ అంటాడు. మా దురదృష్టం కొద్దీ కన్న కొడుకులు, కోడళ్లూ మాకు దూరమైనా.. నీలాంటి మనవరాలిని ఆ దేవుడు మాకు ఇచ్చాడు.. నన్ను ఓ అమ్మలా చూసుకుంటున్నావు.. నన్ను తిరిగి నడిపించాలని నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తోందని సుభాష్ అంటాడు. దీంతో ఇందు అతనికి సర్ది చెబుతుంది. నువ్వు ఒకప్పుడు సింహంలా ఈ ఇంట్లో తిరిగావు.. నిన్ను మళ్లీ అలా చూడాలని ఉంది అని అంటుంది.

ఇందుని రేఖ ఎలా టార్చర్ చేసిందో రాజుకి చెప్పిన సుభాష్, అపర్ణ

కానీ రేఖ అలా చేయనిస్తుందా అని అపర్ణ అంటుంది. గతంలో తనకు ఎదురు తిరిగినందుకు సుభాష్ కు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇవ్వకుండా ఇందుని రేఖ ఎలా టార్చర్ చేసిందో రాజుకి అపర్ణ చెబుతుంది. రేఖ దుర్మార్గురాలని తెలుసు కానీ.. మరీ ఇంతలా దిగజారుతుందనుకోలేదని రాజు అంటాడు. కానీ ఇక తాను ఉన్నానని, రేఖ పప్పులు ఉడకవు అని రాజు భరోసా ఇస్తాడు.

రాజుకి నిజం చెప్పేయమన్న అపర్ణ.. ఐసీయూలో రాజు గర్ల్‌ఫ్రెండ్

రాజు, నందు వెళ్లిపోయిన తర్వాత ఇందుతో అపర్ణ మాట్లాడుతుంది. నా మనవడు ఈ ఇంటి వారసుడు అని ఎప్పుడు చెబుతావ్.. బొమ్మల పెళ్లిలా జరిగిన మీ పెళ్లి మళ్లీ ఘనంగా ఎప్పుడు జరుగుతుంది.. వెంటనే అసలు నిజమేంటో రాజుకి చెప్పేయమ్మా అని అపర్ణ అడుగుతుంది. ఈలోపు రాజు వేరే అమ్మాయి ప్రేమలో పడితే ఎలా అని అంటుంది.

అప్పుడే రాజు ఎవరికోసం అయితే ఇన్నాళ్లుగా హాస్పిటల్లో డబ్బు కడుతున్నాడో ఆ వ్యక్తిని చూపిస్తారు. ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది రాజు గర్ల్‌ఫ్రెండే అన్నట్లుగా చూపించడం విశేషం. కానీ ఇందు మాత్రం దానికి ఇంకా టైమ్ ఉందని, సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని అంటుంది.

రేఖను ఎదిరించిన రాజు

ఇటు రేఖను మరోసారి రాజు ఎదిరిస్తాడు. అయినా రేఖ వెనక్కి తగ్గకపోవడంతో అసలు నిజమేంటో మరచిపోయినట్లున్నావ్ అంటూ లక్కీ విషయం గుర్తు చేస్తాడు. దీంతో రేఖ షాక్ తింటుంది.

రాజుకి ఇందు ముద్దు.. ఇంట్లో వాళ్ల ముందు నవ్వుల పాలై..

ఇటు రాజుని తన ప్రేమలోకి దించడానికి ఇందు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కాఫీపై హార్ట్ సింబల్ వేసి రాజు దగ్గరికి తీసుకెళ్తుంది. నిద్రలో అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. ఆ తర్వాత కిందికి వచ్చిన రాజుని చూసిన ఇంట్లో వాళ్లందరూ నవ్వుతారు. అతని బుగ్గపై ఇందు లిప్‌స్టిక్ మార్క్ చూసి శేషు ఫొటో తీసి చూపించడంతో రాజు షాక్ తింటాడు. వెంటనే ఇందుని పట్టుకోవడానికి ఆమె వెంట పడతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More