Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇందు పెళ్లికి రేఖ తొందరపెడుతుంది. చూడటానికే అసహ్యంగా ఉన్న రీల్స్ స్టార్ ఫంకీ వినయ్ తో ఇందు పెళ్లికి రెడీ అవుతుంది. చివరి నిమిషంలో బావ వస్తాడన్న నమ్మకంతో ఆమె ఉంటుంది. మరోవైపు వీళ్లను కలపడానికి ఆఫీసులో ప్రశాంత్ రంగంలోకి దిగుతాడు.
రాజు కోసం రావద్దని నందుకి చలపతి వార్నింగ్

ఇంటికి తిరిగి రావాలని రాజుని నందు కోరే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 31) ఎపిసోడ్ మొదలైంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి నందు వెళ్లిపోతుంది. ఆమె వెంటే వెళ్లిన చలపతి.. రాజు, ఇందులను కలపడానికి మాత్రం మళ్లీ తమ ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. వెంకీ విషయంలో తాను చేసిన తప్పు, నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెబుతున్నా.. వాళ్లను కలపడానికి పోస్ట్ మ్యాన్ లా మాత్రం మారొద్దని స్పష్టం చేస్తాడు. పెద్దవాడినైనా దండం పెడుతున్నానని అనడంతో నందు సారీ చెప్పి వెళ్లిపోతుంది.
ఇందు కోసం రీల్స్ స్టార్ ఫంకీ వినయ్
ఇటు ఇందు కోసం రేఖ పెళ్లి సంబంధం చూస్తుంది. ఓ రీల్స్ ఫ్యామిలీని తీసుకొస్తుంది. చూడటానికే అసహ్యంగా ఉన్న పెళ్లి కొడుకు, వాళ్ల తల్లిదండ్రులు ఇంటికి రావడంతో అపర్ణ షాక్ తింటుంది. తన పేరు ఫంకీ వినయ్ అని, తాను రీల్స్ చేస్తుంటానని అతడు చెబుతాడు.
ఇందుని చూడగానే తెగ ఇదైపోతాడు. తాను పెళ్లికి రెడీ అని, ఇలాంటి అమ్మాయిని ఎవరు కాదంటారని అంటాడు. వెంటనే ముహూర్తం పెట్టాలని అడుగుతాడు. అతన్ని చూడగానే అపర్ణ, నందు అబ్బాయి నచ్చలేదని చెప్పమని ఇందుపై ఒత్తిడి తెస్తారు. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుంటుంది.
పెళ్లి కోసం రేఖ తొందర.. రేపే ఇందు పెళ్లి
మరోవైపు ఇందు పెళ్లి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రేఖ చూస్తుంది. వచ్చే ఆరు నెలల్లో ముహూర్తం ఉందని పంతులు చెప్పగానే.. మరో గంటలోనే పెళ్లి కావాలని భ్రమరాంబ అంటుంది. అతడు ఆశ్చర్యపోవడంతో ఐదారు గంటలైనా సరే అని చెబుతుంది.
{{/usCountry}}మరోవైపు ఇందు పెళ్లి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రేఖ చూస్తుంది. వచ్చే ఆరు నెలల్లో ముహూర్తం ఉందని పంతులు చెప్పగానే.. మరో గంటలోనే పెళ్లి కావాలని భ్రమరాంబ అంటుంది. అతడు ఆశ్చర్యపోవడంతో ఐదారు గంటలైనా సరే అని చెబుతుంది.
{{/usCountry}}రేపు 10.20 గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో రేఖ సరే అంటుంది. ఇంత త్వరగా పెళ్లేంటి అని అపర్ణ వాదిస్తున్నా రేఖ పట్టించుకోదు. రేపు పెళ్లి టైమ్ కు వస్తామంటూ అబ్బాయివాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత అబ్బాయి తనకు నచ్చాడని చెప్పి ఇందు వెళ్లడంతో అపర్ణ, నందు షాక్ తింటారు.
అన్నను చూసి వెంకీ ఆవేదన.. తాను త్యాగం చేస్తానంటూ..
మరోవైపు ఇంట్లో అన్న రాజు కోసం వెంకీ బాధపడుతుంటాడు. తల్లి లక్ష్మి దగ్గరికి వెళ్లి అన్నయ్య తరఫున నాన్నతో మాట్లాడాలని అంటాడు. అతన్ని చూస్తే చాలా బాధగా ఉందని, ఇందుని ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెబుతాడు. తాను ఏం చేయగలనని లక్ష్మి అంటుంది.
అక్కడికి నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు.. మీ నాన్న సంగతి తర్వాత చూద్దామని కూడా రాజుతో చెప్పానని అంటుంది. నాన్నకు ఇష్టమైన కొడుకుగా, ఆయన అభిప్రాయం గౌరవించి తాను ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కనీసం అన్నయ్యనైనా ఇందుని పెళ్లి చేసుకోనివ్వండని వెంకీ చెప్పి వెళ్లిపోతాడే.
ఇందుని అవమానించిన భ్రమరాంబ.. రేఖ వార్నింగ్
ఇటు ఉదయాన్నే ఇందు ఆఫీసుకు బయలుదేరుతుంది. ఆమెకు అడ్డు వచ్చిన భ్రమరాంబ అవమానించేలా మాట్లాడుతుంది. ఆఫీసుకు అని చెప్పి ఆ రాజుతో లేచిపోతావేమో.. అప్పుడు రాజును దొంగ పెళ్లి చేసుకొని తీసుకొచ్చినట్లే.. ఇప్పుడు మరెవరినో దారినిపోయేవాడిని తీసుకొచ్చి నా భర్త అంటావేమో అని అంటుంది. దీంతో ఇందు సీరియస్ అవుతుంది. మాటలు జాగ్రత్తగా రానీ అని వార్నింగ్ ఇస్తుంది.
అప్పుడే రేఖ వస్తుంది. అలా ఏమీ చేయదు వదిన.. అప్పుడున్న పరిస్థితుల్లో మనమేదో చేస్తామని ఊహించుకొని అలా చేసింది.. ఇప్పుడు ఆమె చేసిన పని మనం బయట చెబితే దుగ్గిరాల ఫ్యామిలీ పరువు, స్వరాజ్ గ్రూపు పరువు పోతుంది.. పైగా ఇందు ఎక్కడికి వెళ్లినా తన నాన్నమ్మ, తాతయ్యల కోసం ఇంటికి తిరిగి రావాల్సిందే అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇస్తుంది. ఇందు సైలెంట్ గా వెళ్లిపోతుంది.
ఆఫీసులోనూ ఇందుకి అవమానం.. గట్టి వార్నింగ్
అటు ఆఫీసులోనూ ఇందుకి అవమానం జరుగుతుంది. ఆమె ఆఫీసులో అడుగుపెట్టగానే ఉద్యోగులు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు రాజు, ఇందు మొగుడుపెళ్లాలుగా నాటకమాడారట.. అయినా బెడ్ రూమ్ లో కలిసి ఉన్నారంటే అన్నీ జరిగిపోయి ఉంటాయంటూ ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుకుంటారు. అది విన్న ఇందు గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే, పని ఆపి టైంపాస్ చేస్తే ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తుంది. అప్పుడే ప్రశాంత్ కూడా వచ్చి వార్నింగ్ ఇస్తాడు.
రాజుని ఆఫీసుకు రప్పించేందుకు ఇందు, ప్రశాంత్ ప్లాన్
ఇందుని చూసి అతడు బాధపడతాడు. తనకు టాలెంట్ లేదని ఎవరూ ఉద్యోగం ఇవ్వని సమయంలో మీరు నమ్మి ఉద్యోగం ఇచ్చారని, రాజు సార్ దూరమైన బాధ మీకు ఎంత ఉందో తనకు తెలుసు అని అంటాడు. మీ ఇద్దరినీ కలిపే బాధ్య తనదని, రాజు సార్ ని ఆఫీసుకు రప్పిస్తానని చెబుతాడు.
ఇందు వద్దంటున్నా వినడు. ఇప్పుడో ఆర్డర్ డెలివరీ ఉంది కదా.. దానిపై రాజు సార్ సంతకం కావాల్సిందే.. ఆ పని చెప్పి రప్పిస్తాను అంటాడు. రాజు వచ్చి పెళ్లి ఆపుతాడన్న నమ్మకం తనకు ఉంది అని ఇందు అంటున్నా.. మన ప్రయత్నం మనం చేయాల్సిందే అంటూ రాజుకు ఫోన్ చేస్తాడు ప్రశాంత్. అనుకున్నట్లే రాజుకు జరిగిన విషయం చెబుతాడు. ఆఫీసుకు రావడానికి రాజు ఓకే చెబుతాడు. కానీ చలపతి మాత్రం అడ్డుపడతాడు.
పెళ్లికి ఇందు రెడీ..
మరుసటి రోజు ఇందు పెళ్లికి రెడీ అవుతుంది. ఆమెను రేఖ, భ్రమరాంబ ముస్తాబు చేస్తారు. రాజు దూరమైన బాధ ఏమీ కనిపించడం లేదేంటీ అని రేఖతో భ్రమరాంబ అంటుంది. అటు అపర్ణ కూడా వచ్చి ఇందుని వారిస్తుంది. తాళి కట్టే సమయానికి రాజు రాకపోతే ఏం చేస్తావని అడుగుతుంది. తనకు నమ్మకం ఉందని, బావ వస్తాడని అంటుంది. అపర్ణ వెళ్లి రాజుకి ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పిందంతా లక్ష్మీ వింటుంది. రాజు మాత్రం ఎటూ తేల్చుకోలేక దేవదాసులా అలా కూర్చొండిపోతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.