Brahmamudi October 7 Episode: బ్రహ్మముడి.. రాజును అరెస్ట్ చేసిన నందు.. సిరికి గుర్తొచ్చిన గతం.. లక్కీ, ఐశ్వర్య పెళ్లి

Brahmamudi Serial October 7th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 7 ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురవుతుంది. రాజుని నందు అరెస్ట్ చేయడానికి రావడం, అదే సమయంలో సిరికి గతం గుర్తుకు రావడం, అటు లక్కీతో పెళ్లికి ఐశ్వర్య ఓకే చెప్పడంలాంటి సీన్లతో సాగిపోయింది.

Published on: Oct 7, 2026, 08:31:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య అబార్షన్ చేయించుకోకుండా అడ్డుకొని లక్కీతో పెళ్లికి ఒప్పిస్తారు రాజు, ఇందు. అయితే అలా చేసినందుకు ఇందుని అపర్ణ, సుభాష్ మందలిస్తారు. మరోవైపు సిరిని భూషణ్ తోసేయడం, ఆమెకు తీవ్రంగా గాయపడటం, దాంతో ఆమెకు గతం గుర్తుకు రావడం లాంటి సీన్లు కూడా ఎపిసోడ్ చివర్లో చూడొచ్చు.

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 7 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 7 ఎపిసోడ్

లక్కీకి రాజు ఫోన్.. ఐశ్వర్య అబార్షన్ విషయం చెప్పి..

లక్కీకి రాజు ఫోన్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలవుతుంది. ఐశ్వర్య కనిపించడం లేదని అంటే.. తాను ఆమె దగ్గరే ఉన్నానని, అంతా అయిపోయిందని, ఆమె అబార్షన్ చేయించుకుంటోందని ఏడుస్తూ చెబుతాడు లక్కీ.

అడ్డుకోమని రాజు చెబితే.. తాను చెబితే ఆమె వినదని అంటాడు. తన బిడ్డను కాపాడతానని ఇందు మాటిచ్చింది కదా.. దయచేసి ఆ పని చేయండని వేడుకుంటాడు. హాస్పిటల్ లొకేషన్ పెట్టమని రాజు అడుగుతాడు. ఆమె ఆపరేషన్ చేయించుకోకుండా ఆపుతామని సుభాష్ కు మాటిచ్చి రాజు, ఇందు వెళ్తారు.

హాస్పిటల్‌కు రాజు, ఇందు.. కోర్టు ఆర్డర్‌తో ఐషూని అడ్డుకొని..

రాజు, ఇందు హాస్పిటల్ కు పరుగెత్తుకుంటూ వెళ్తారు. అప్పటికే ఐషూ ఆపరేషన్ కు రెడీ అవుతుండటంతో వెళ్లి అడ్డుకుంటారు. తన జీవితం తన ఇష్టం అని ఐశ్వర్య అనడంతో.. డాక్టర్ ను ఆపరేషన్ చేయొద్దని ఇందు అడుగుతుంది. ఆమె ఇష్ట ప్రకారం చేసినప్పుడు చట్టప్రకారం ఆమెకు ఆ హక్కు ఉందని డాక్టర్ అంటుంది.

అందుకే తాము కూడా చట్టప్రకారమే వెళ్లామని, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చామని ఇందు అంటుంది. రాజు ఓ కాగితం తీసి డాక్టర్ కు చూపిస్తాడు. దీంతో ఆమె ఆపరేషన్ చేయనని చెబుతుంది. ఐశ్వర్య కూడా అది చూసి షాక్ తింటుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్తారు.

కోర్టుకు వెళ్తానన్న ఐశ్వర్య.. కంపెనీ పెట్టిస్తానంటూ కండిషన్

ఇంటికి వచ్చిన తర్వాత ఐశ్వర్యకు అపర్ణ క్లాస్ పీకబోతుంటే.. ఆపరేషన్ జరగలేదని ఇందు చెబుతుంది. ఎందుకిలా చేస్తున్నావని అపర్ణ నిలదీస్తుంది. నా జీవితం నా ఇష్టం అని ఐషూ అంటుంది. తాను బిడ్డను వదులుకుంటానని, కోర్టుకు వెళ్తానని అంటుంది. ఆ అవసరం లేదని ఇందు చెబుతుంది. తాము అబద్ధం చెప్పామని, కోర్టుకు వెళ్లలేదని, ఆ పేపర్ నకిలీదని అనడంతో ఐషూ షాక్ తింటుంది.

ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నారని ఇందుని నిలదీస్తుంది. కంపెనీ విషయంలోనూ ఇలాగే చేశారని అంటుంది. నీకు కంపెనీ పెట్టిస్తాను.. కానీ నువ్వు బిడ్డను వదులుకోకూడదు.. అలాగే లక్కీని కూడా పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడుతుంది. ఇది మరో నాటకమా అని ఐషూ అడిగితే.. తాను మాట తప్పనని, కంపెనీ పెట్టిస్తానని ఇందు చెబుతుంది.

దిగొచ్చిన ఐశ్వర్య.. పెళ్లికి ఓకే.. అగ్రిమెంట్‌పై ఇందు, ఐషూ సంతకాలు

మీరు ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పి మాట తప్పారని భ్రమరాంబ అంటుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని రేఖ అనడంతో.. అగ్రిమెంట్ చేసుకుందామని ఇందు అంటుంది. లక్కీని పెళ్లి చేసుకొని, బిడ్డను కని బాధ్యతలు చూసుకోవడానికి ఐషూ ఒప్పుకుంటూ సంతకం చేస్తే.. కంపెనీ పెట్టిస్తానని హామీ ఇస్తూ నేనూ సంతకం చేస్తానని ఇందు అంటుంది.

దీంతో ఐశ్వర్య దిగి వస్తుంది. బిడ్డను కంటాను.. లక్కీని కూడా పెళ్లి చేసుకుంటానని మాటిస్తుంది. దీంతో రాజు వెళ్లి అగ్రిమెంట్ తీసుకొస్తాడు. దానిపై మొదట ఐశ్వర్య, తర్వాత ఇందు సంతకాలు చేస్తారు. అది చూసి రేఖ, భ్రమరాంబ సంతోషిస్తారు. దీనిని అడ్డం పెట్టుకొని ఆస్తిని కొట్టేయాలని రేఖ అనుకుంటుంది. అపర్ణ, సుభాష్ షాకవుతారు.

ఆస్తి ముక్కలు చేశావంటూ ఇందుకి అపర్ణ, సుభాష్ క్లాస్

లోనికి వెళ్లిన తర్వాత ఇందుకి అపర్ణ, సుభాష్ క్లాస్ పీకుతారు. ఈ ఆస్తిని ముక్కలు చేయొద్దని మీ అమ్మానాన్న ఎంతో ప్రయత్నించారని, ఇప్పుడు నువ్వు చేసిన పని కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. అయినా ఆస్తి ముక్కలు కాదు.. మరో కంపెనీ మాత్రమే పెట్టిస్తున్నామని రాజు అంటే.. ఆ ఐశ్వర్య రేఖ చెప్పినట్లే వింటుంది కదా.. ఆమె ఆస్తిని ముక్కలు చేయడానికి చూస్తుంది అని అపర్ణ అంటుంది.

సుభాష్ కూడా ఈ విషయంలో నువ్వు తొందర పడ్డావని ఇందుతో అంటాడు. మీరే ఆపరేషన్ జరగకుండా చేసి ఇంటి పరువు కాపాడాలని అన్నారు కదా.. నాకు మరో దారి కనిపించలేదు.. అయినా కంపెనీ పెట్టించినంత మాత్రాన ఏమీ జరిగిపోదు అని ఇందు చెబుతుంది. కంపెనీ పెట్టించినవాళ్లం.. దానిని తిరిగి లాక్కోవడం తెలియదా.. మేము చూసుకుంటాం అని రాజు కూడా హామీ ఇస్తాడు.

రాజు అరెస్ట్.. సిరికి గుర్తొచ్చిన గతం

మరోవైపు వీల్ చైర్ పై ఆడుకుంటున్న సిరిని భూషణ్ కోపంతో తోసేస్తాడు. దీంతో ఆమె కిందపడిపోతుంది. తలకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వస్తుంది. అందరూ టెన్షన్ లో ఉండగా.. నందు ఎస్సై రూపంలో ఎంట్రీ ఇస్తుంది. రాజును అరెస్ట్ చేయడానికి వచ్చానంటూ అతని చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే సిరికి గతం గుర్తుకు వచ్చి ఆగండి అని బయటకు వస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More