Brahmamudi September 17 Episode: బ్రహ్మముడి.. ఊహించిన ట్విస్ట్.. దుగ్గిరాల ఇంటికి సిరి.. రాజు, ఇందుకి అడ్డుపడిన అపర్ణ

Brahmamudi Serial September 17th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సిరిని చలపతి ఇంటి నుంచి దుగ్గిరాల ఇంటికి తీసుకొస్తారు రాజు, ఇందు. ఇటు పోలీస్ స్టేషన్ లోనే మదన్, స్వాతి పెళ్లి జరుగుతుంది.

Published on: Sep 17, 2026, 08:35:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. పోలీస్ స్టేషన్ లో మదన్, స్వాతి ఎపిసోడ్ తోపాటు చలపతి ఇంట్లో సిరి వల్ల బస్తీ వాళ్ల పంచాయతీ సీన్లతో సాగిపోయింది. చివరికి దుగ్గిరాల ఇంటికే సిరి వచ్చే సీన్ తో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi September 17 Episode: బ్రహ్మముడి.. ఊహించిన ట్విస్ట్.. దుగ్గిరాల ఇంటికి సిరి.. రాజు, ఇందుకి అడ్డుపడిన అపర్ణ
Brahmamudi September 17 Episode: బ్రహ్మముడి.. ఊహించిన ట్విస్ట్.. దుగ్గిరాల ఇంటికి సిరి.. రాజు, ఇందుకి అడ్డుపడిన అపర్ణ

చిన్నారికి గాయం చేసిన సిరి

చలపతి వద్దంటున్నా అతని కళ్లుగప్పి పిల్లలతో ఆడుకోవడానికి సిరి వెళ్లే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. అయితే పిల్లలతో బంతాట ఆడుకుంటూ ఉండగా.. ఓ చిన్నారితో సిరి గొడవ పడుతుంది. తనకే బంతి కావాలంటూ సిరి పట్టుబడుతుంది. ఈ క్రమంలో తనతో గొడవ పడిన చిన్నారిని తోసేస్తుంది. ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకి బలంగా తాకడంతో రక్తం కారుతుంది. ఆమె తన తల్లికి చెబుతానని అనడంతో సిరి భయపడుతూ నేనేం చేయలేదంటూ ఇంట్లోకి వెళ్లి కూర్చొంటుంది.

పోలీస్ స్టేషన్‌లో మదన్, స్వాతి

మరోవైపు మదన్, స్వాతి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. మీది పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా మరి వాళ్లకు ఫోన్ చేసి పిలిపించండి అని ఎస్సై అడుగుతాడు. కానీ మదన్ మాత్రం చేయడు. ఇంట్లో గొడవల వల్లే తాము బయటకు వచ్చామని, త్వరలోనే పెళ్లి చేసుకుందాని అనుకున్నామని అంటాడు. అయినా ఎస్సై వినడు. ఇలా ఎన్ని కథలు నమ్మాలి అని అంటాడు.

పోలీస్ స్టేషన్‌లో భ్రమరాంబ, భూషణ్ గొడవ..

అప్పుడే పోలీస్ స్టేషన్ కు రేఖ, భూషణ్, భ్రమరాంబ, శేషు వస్తారు. మదన్ తన కొడుకే అని భూషణ్ పోలీసులకు ఆధారాలు చూపిస్తాడు. ఎవరిని పడితే వాళ్లను అరెస్ట్ చేస్తావా.. ఎవరో ఏమిటో చూసుకోవా.. ఇలా మీడియా ముందు అరెస్ట్ చేసి మా కుటంబం పరువు తీస్తావా అంటూ ఎస్సైపై విరుచుకుపడుతుంది భ్రమరాంబ.

అటు భూషణ్ కూడా పోలీసులపై మండిపడతాడు. దీంతో తాము కావాలని అరెస్ట్ చేయలేదని, ఆ హోటల్లో గతంలో ఇలాంటివి జరిగాయి కాబట్టే అలా చేశామని, సంతకాలు పెట్టి వాళ్లను తీసుకెళ్లిపోవచ్చని ఎస్సై చెబుతాడు.

వాళ్లతో సంబంధం లేదన్న మదన్

కానీ మదన్ మాత్రం అందుకు అంగీకరించడు. సంతకాలు చేయడానికి వాళ్లెవరు.. వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. వాళ్లతో బంధం తెంచుకున్నాం అని తెగేసి చెబుతాడు. దీంతో రేఖ, భూషణ్ షాక్ తింటారు. భ్రమరాంబ మదన్ ను తిట్టబోతుంది. నా కూతురిని ఒకే రోజుకి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టావ్ అంటూ నిలదీస్తుంది. దీంతో ఆమెను మదన్ తిడతాడు.

మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తాడు. అయినా తాము మేజర్లం అని, ఎలా లోపలికి వచ్చామో అలాగే బయటకు వెళ్లే దారి కూడా తెలుసు అని మదన్ స్పష్టం చేస్తాడు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తేల్చి చెబుతాడు. అలా ఇయితే నువ్వు ఇక్కడే ఉంటావ్.. చిప్పకూడు తింటూ కూర్చుంటావ్ అని భ్రమరాంబ శాపనార్థాలు పెడుతుంది.

మదన్, స్వాతిని కాపాడిన రాజు, ఇందు.. ఇక్కడే పెళ్లి చేసుకోమన్న రాజు

అప్పుడే రాజు, ఇందు అక్కడికి వస్తారు. వాళ్లకు ఆ గతి పట్టకుండా మేం చూస్తామని రాజు అంటాడు. వాళ్లను చూసి రేఖ, భ్రమరాంబ మరింత మండిపతారు. కానీ మదన్ మాత్రం వాళ్ల కంటే రాజునే ఎక్కువ నమ్ముతాడు. మనల్ని నమ్మి వచ్చిన వాళ్లను ఇలా చేయడం సరి కాదు అని మదన్ తో రాజు అంటాడు. తాను ఏ తప్పూ చేయలేదని, అద్దె ఇల్లు చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అని మదన్ అంటాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయమంటే అదే చేస్తానని మదన్ అనడంతో మా కంటే వాళ్లే ఎక్కువయ్యారా అని భ్రమరాంబ అంటుంది.

దీంతో రాజు ఆమెకు అడ్డు పడతాడు. మీపై పడిన మచ్చ పోవాలంటే, మీరు పరువుగా మళ్లీ బయటకు రావాలంటే ఇక్కడే పెళ్లి చేసుకోవాలని రాజు చెప్పడంతో అందరూ షాక్ తింటారు. మీ పెళ్లి అలా చేసుకున్నారని, వాళ్లకూ అలాగే చేయాలని అంటారా.. మా కూతూరు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని అనుకున్నాను అని భ్రమరాంబ అంటుంది. కానీ మదన్ మాత్రం ఆమె మాట వినకుండా తాను పెళ్లికి సిద్ధమే అనడంతో రేఖ, భూషణ్ షాకవుతారు.

చలపతి ఇంట్లో బస్తీ వాళ్ల పంచాయతీ.. సిరిని తిట్టిన చలపతి

మరోవైపు సిరి సైలెంట్ గా కూర్చోవడం చూసి చలపతి ఆశ్చర్యపోతాడు. అప్పుడే బస్తీవాళ్లు ఇంటికిపై గొడవకు వస్తారు. మా అమ్మాయి పరిస్థితి ఎలా అయిందో చూడండి అని నిలదీస్తారు. ఏదో పిల్ల మనస్తత్వం ఉండి అలా చేసిందని లక్ష్మీ సర్ది చెప్పినా వినరు. ఆ అమ్మాయి ఇక్కడ ఉండటానికి వీల్లేదు.. ఒకవేళ ఆమెను పంపించకపోతే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లండని వాళ్లు తెగేసి చెప్పి వెళ్లిపోతారు. దీంతో సిరిని తిడతాడు చలపతి. అడ్డు పడిన లక్ష్మీ, వెంకీలను కూడా తిడతాడు. ఈ చెపాతి అంకుల్ నాకొద్దు.. నాకు నా మొగుడు కావాలంటూ సిరి ఏడుస్తూ కూర్చొంటుంది.

పోలీస్ స్టేషన్‌లో మదన్, స్వాతి పెళ్లి

అటు రాజు చెప్పినట్లుగానే మదన్, స్వాతి పెళ్లికి సిద్ధమవుతారు. ఎస్సై కూడా వాళ్ల పెళ్లి జరిపించడానికి సిద్ధమై తాళి తీసుకొచ్చారా అని అడిగితే తెచ్చామంటూ ఇందు ఇస్తుంది. అంత పని చేయకండి అంటూ రేఖ ఎస్సైకి అడ్డు పడుతుంది. భ్రమరాంబ కూడా రచ్చ చేయడానికి ప్రయత్నిస్తే.. పెళ్లికి అడ్డు పడుతున్నారని మీపైనా కేసు పెట్టి లోపలేస్తాను అని ఎస్సై బెదిరిస్తాడు. దీంతో ఆమె సైలెంట్ అయిపోతుంది. పోలీస్ స్టేషన్ లోనే స్వాతి మెడలో మూడు ముళ్లు వేస్తాడు మదన్.

దుగ్గిరాల ఇంటికి సిరి

మరోవైపు సిరి చేసిన విషయం రాజుకి తెలిసి ఇంటికి వెళ్తాడు. చెపాతి అంకుల్ వద్దు నేను నీతోనే వస్తాను అని సిరి అంటుంది. ఇందు కూడా సిరిని తీసుకెళ్దాం అని అనడంతో రాజు షాకవుతాడు. ఇద్దరూ కలిసి ఇందుని తమ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్లను చూడగానే రేఖ అడ్డు పడుతుంది.

తన కొడుకుని ఇంటికి దూరం చేసి నీ మొదటి భార్య తెచ్చుకుంటావా అని నిలదీస్తుంది. ఆమె ఇక్కడే ఉంటుందా అని భ్రమరాంబ అడిగితే ఇందు అవును అని అంటుంది. దీంతో అపర్ణ కూడా ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని గర్జిస్తుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More