Brahmamudi September 23 Episode: బ్రహ్మముడి.. రేఖను గట్టి దెబ్బే కొట్టిన రాజు.. సిరి గతం తవ్వే పనిలో రాజు, ఇందు, రేఖ
Brahmamudi Serial September 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 23 ఎపిసోడ్ లో రేఖ ప్లాన్ ను అట్టర్ ఫ్లాప్ చేస్తాడు రాజు. సిరి పేరు చెప్పే గట్టి దెబ్బ కొట్టడంతో ఇక అందరూ ఆమె గతమేంటో తెలుసుకునే పనిలో పడతారు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ రాజు, రేఖ ఎత్తుకుపైఎత్తులతో సాగిపోయింది. సిరి పేరు చెప్పి రాజుని ఇరికించి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖ ప్లాన్ ఫెయిలవుతుంది. అటు రేఖ కంటే ముందే సిరి ఎవరు? ఆమె గతమేంటో తెలుసుకునే పనిలో పడతారు రాజు, ఇందు.

ఐశ్వర్య హాల్ టికెట్‌తో సిరి పడవ.. పెద్ద గొడవ
ఐశ్వర్య హాల్ టికెట్ తో సిరి పడవ చేసి ఆడుకునే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఐశ్వర్య పెద్ద గొడవ చేస్తుంది. సిరిని కొట్టబోతుంది. ఇందు, రాజు ఆమెను అడ్డుకుంటారు. తప్పు నీదే.. హాల్ టికెట్ ను ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఎలా.. సిరి చిన్నపిల్లలా ఉంటుందని తెలుసు కదా అని ఇందు క్లాస్ పీకుతుంది.
అయినా హాల్ టికెట్ బాగానే ఉంది కదా ముందు వెళ్లి ఎగ్జామ్ రాయమని అనడంతో తిరిగి వచ్చి మీ సంగతి చెబుతానంటూ ఐశ్వర్య వెళ్లిపోతుంది. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియడం లేదంటూ రేఖ కూడా తిట్టి వెళ్తుంది.
సిరి గురించి ఇందుకి చెప్పి బాధపడిన రాజు.. సర్ది చెప్పిన ఇందు
ఆ తర్వాత సిరి అందరూ తననే తిడుతున్నారని అలగడంతో ఇందు వెళ్లి ఆమెను బుజ్జగిస్తుంది. పాయసం చేస్తానని అనడంతో సిరి ఎగిరి గంతేస్తుంది. కిచెన్ లో ఉన్న ఇందు దగ్గరికి వెళ్లి రాజు బాధపడతాడు. సిరి వల్ల నువ్వు కూడా అందరితో మాటలు పడాల్సి వస్తుంది.. అందరూ సిరినే తిడుతున్నారు.. రేఖ పిన్ని, ఐశ్వర్య సంగతి వదిలేసినా.. అమ్మమ్మ, తాతయ్య కూడా ఆమెనే నిందిస్తున్నారు.. ఇక్కడికి ఆమెను తీసుకొచ్చి తప్పు చేశానేమో అనిపిస్తుందని రాజు అంటాడు.
దానికి ఇందు స్పందిస్తూ.. ఇందులో తప్పేమీ లేదు.. సిరిని ఇక్కడ కాకుండా ఎక్కడ ఉంచుతావు.. ఆమె నీ దగ్గర ఉంటేనే సేఫ్.. దాని గురించి ఏమీ ఆలోచించకు.. నాకు నువ్వు అండగా ఉన్నట్లే నేనూ నీకు అండగా ఉంటానని చెబుతుంది.
ఇంటికి లాయర్.. పెళ్లి చెల్లదంటూ ఇందుకి షాకిచ్చి..
ఆ తర్వాత రేఖ పిలవడంతో ఇంటికి లాయర్ వస్తాడు. అతన్ని ఎందుకు పిలిపించావని అపర్ణ అడుగుతుంది. దానికి లాయర్ స్పందిస్తూ.. ఇందుకి పెళ్లయింది కాబట్టి రేఖ పేరున ఉన్న పవరాఫ్ అటార్నీ మొత్తం నీ పేరు మీదికి వచ్చింది.. కానీ ఇప్పుడు ఆమె భర్త రాజుకి ఇప్పటికే సిరి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.. అందువల్ల చట్టపరంగా రాజు, ఇందు పెళ్లి చెల్లదు.. దీంతో నీ పేరిట ఉన్న ఆస్తిని మళ్లీ రేఖ పేరిట పవరాఫ్ అటార్నీ చేయాల్సిందే అని స్పష్టం చేస్తాడు. అది విని అందరూ షాకవుతారు. సంతకం పెట్టమని లాయర్ చేతుల్లోని కాగితాలు తీసి ఇందుకి ఇవ్వబోతుంది రేఖ.
ఎంట్రీ ఇచ్చిన రాజ్.. సాక్ష్యాలేవంటూ రేఖకు కౌంటర్
అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. సంతకమంట పెట్టు ఇందు.. రేఖ పిన్ని ముచ్చటపడుతోందని అంటాడు. అది అర్థం కాక రేఖ బిక్కమొహం వేస్తుంది. అది సరేగానీ.. నాకు సిరితో పెళ్లయినట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని రాజు అడుగుతాడు. నువ్విలా అడుగుతావనే హాస్పిటల్లో నువ్వు చేసిన సంతకం కాపీ పట్టుకొచ్చానని రేఖ అంటుంది.
ఇలాంటివి నేను వంద సృష్టించగలను.. ఇది చెల్లదు.. నేను సిరిని పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ, ఫొటోలు, వీడియోలుగానీ ఉన్నాయా అని రాజు అడుగుతాడు. ఏమీ లేవు అంటూ భ్రమరాంబ, భూషణ్ చెబుతారు. అవేవీ లేకపోతే కోర్టులో చెల్లదు అని రాజు అనడంతో రేఖ షాకవుతుంది.
లాయర్ మరో ఆప్షన్.. అదీ చెల్లదంటూ..
లాయర్ కూడా రాజు చెప్పిందే నిజమంటాడు. ఇక్కడ నమ్మకాలతో పని లేదు.. కోర్టుకు సాక్ష్యాధారాలు కావాలి.. అవి ఉంటే ఓకే లేదంటే మరో ఆప్షన్ ఉంది.. అదేంటంటే సిరియే కోర్టుకు వచ్చి రాజు తన భర్త అని చెప్పాలి అని లాయర్ అంటాడు. అదైతే ఓకే.. ఎందుకంటే రాజుని మొగుడు మొగుడు అంటూ సిరి తిరుగుతుంది అని భ్రమరాంబ అంటుంది.
కానీ సిరి గతం మరచిపోయింది.. చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది.. అలాంటి అమ్మాయి సాక్ష్యం చెల్లుతుందా అని లాయర్ ని రాజు ప్రశ్నిస్తాడు. అదీ చెల్లదని లాయర్ చెప్పడంతో రేఖ, భ్రమరాంబ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. లాయర్ ను రాజు పంపించేస్తాడు. రేఖ రుసరుసలాడుతూ వెళ్లిపోతుంది. మీరెప్పుడూ భయపడకండి.. నేనున్నాను అని ఇందుతోపాటు అపర్ణ, సుభాష్ లకు రాజు హామీ ఇస్తాడు.
రేఖకు రాజు ఛాలెంజ్
ఆ తర్వాత రాజు చేసిన పని తలుచుకొని రేఖ ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్లిన రాజు ఛాలెంజ్ చేస్తాడు. ఇందు నా భార్య.. నువ్వు ఏమీ చేయలేవని సవాలు విసురుతాడు.
అప్పుడే రాజుకి ఇందు ఓ వార్నింగ్ ఇస్తుంది. ఇంత జరిగింది కాబట్టి కచ్చితంగా రేఖ ఆంటీ సిరి గతం గురించి తవ్వి తీస్తుంది.. ఆమె కంటే ముందు మనమే ఆ పని చేయాలని చెబుతుంది. యాక్సిడెంట్ సమయంలో బండి నంబరు తీసి దాని ద్వారా సిరి వివరాలు తెలుసుకునే పనిలో ఇందు ఉంటుంది. అటు సిరి దగ్గరికి వెళ్లి ఆమె వివరాలు రాబట్టే పనిలో భ్రమరాంబ, శేషు ఉంటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


