బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్: పెళ్లాలకు మొగుళ్ల ప్రేమ లేఖలు.. మంచి ఫిట్టింగే పెట్టిన కావ్య.. ఒట్టు, కిరాణా కొట్టు అంటూ..

బ్రహ్మముడి సీరియల్ గురువారం (నవంబర్ 13) ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. కావ్య దెబ్బకు ఇంట్లోని మగాళ్లకు కొత్త కష్టం వస్తుంది. పెళ్లాలకు ప్రేమ లేఖలు రాయాల్సి రావడం, వాళ్ల కవి హృదయాలు ఉప్పొంగిపోవడంతో ఈ ఎపిసోడ్ సాగిపోయింది.

Published on: Nov 13, 2025 6:59 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 877వ ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా సాగింది. కావ్య బకెట్ లిస్ట్ ఇంట్లో సుభాష్, ప్రకాశ్ చావుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. తన పెళ్లాం కోసం రాజ్ ఎలా చేస్తే మీరూ అలాగే చేయాలని అపర్ణ, ధాన్యం తేల్చి చెప్పడంతో మొగుళ్ల బాధలు రెట్టింపవుతాయి. ఈ తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్: పెళ్లాలకు మొగుళ్ల ప్రేమ లేఖలు.. మంచి ఫిట్టింగే పెట్టిన కావ్య.. ఒట్టు, కిరాణా కొట్టు అంటూ..
బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్: పెళ్లాలకు మొగుళ్ల ప్రేమ లేఖలు.. మంచి ఫిట్టింగే పెట్టిన కావ్య.. ఒట్టు, కిరాణా కొట్టు అంటూ..

మారని రాహుల్.. స్వప్నను బుట్టలో వేసుకుంటానంటూ..

బ్రహ్మముడి సీరియల్ గురువారం (నవంబర్ 13) ఎపిసోడ్ రాహుల్, రుద్రాణి సీన్ తో మొదలవుతుంది. అత్తకు స్వప్న క్లాస్ పీకి వెళ్లిపోయిన తర్వాత తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటూ రుద్రాణిని అడుగుతాడు రాహుల్. ఇదంతా నటనా అని ఆమె అంటుంది.

అవును.. స్వప్నను తన దారికి తెచ్చుకునేందుకు ఇదే మంచి ప్లాన్ అని, అందుకే మారినట్లుగా నటిస్తున్నానని అంటాడు. స్వప్న నీతో ఎలా మాట్లాడుతుందో చూశాం కదా.. అందుకే తన దారికి వెళ్లి.. ఆమెను బుట్టలో వేసుకొని.. ఈ ఇంట్లో వాళ్లందరినీ పక్కకు నెట్టేసే ప్లాన్ చేశానని అనడంతో తాను అండగా ఉంటానని రుద్రాణి అంటుంది.

కావ్య బకెట్ లిస్ట్.. శ్రీవారి ప్రేమలేఖ అంటూ..

అటు రాజ్ ఆఫీసుకు ఫోన్ చేసిన తన పీఏ మీద అరుస్తుంటాడు. తాను అడిగిన ఫైల్ గురించి ఆమెకు క్లాస్ పీకుతాడు. అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. తన బకెట్ లిస్టు పూర్తయ్యే వరకు ఏ పనీ చేయనని చెప్పి.. ఇప్పుడు ఆఫీసు పనిలో బిజీ అయ్యారా అని మందిస్తుంది. దీంతో తానేమీ మరచిపోలేదని, అందుకే కదా చికెన్ చేసి పెట్టానని అంటాడు.

అలా అయితే తన బకెట్ లిస్టులో తర్వాత ఏముందో చెప్పండని కావ్య అంటుంది. గుర్తుంది.. ప్రేమ లేఖే కదా.. అందుకే స్టేషనరీకి వెళ్లి పేపర్లు తెచ్చుకున్నానని రాజ్ చెబుతాడు.. కావ్యపై విసుగ్గుంటాడు. దీంతో ప్రేమ లేఖ ప్రేమగా రాయాలి తప్ప ఇలా విసుక్కుంటూ కాదని అంటుంది. రాజ్ సరే అంటూ తనకు కాస్త టైమ్ ఇవ్వమని వెళ్లిపోతాడు.

సుభాష్, ప్రకాశ్, రాజ్ ప్రేమ లేఖలు

బయటకు వెళ్లి రాజ్ ఆ పనిలో ఉంటాడు. అక్కడ సుభాష్, ప్రకాశ్ లను చూసి షాక్ తింటాడు. వాళ్లు కూడా ప్రేమ లేఖలు రాసే పనిలోనే ఉంటారు. మీరేంటి ఇలా అని అడిగితే.. నీ వల్ల, నీ పెళ్లాం వల్లే మాకీ కష్టాలని అంటారు. బోర్డు మీటింగ్ లో కూర్చోవాల్సిన వయసులో ఇలా ప్రేమ లేఖలు రాయాల్సి వస్తోందని సుభాష్ బాధపడతారు.

ఏం రాయాలో తెలియక ముగ్గురూ తలలు పట్టుకుంటారు. కాసేపటికి ప్రకాశం, సుభాష్ రాయడం మొదలుపెట్టడంతో వాళ్ల దగ్గర కాపీ కొట్టడానికి రాజ్ వెళ్తే.. వాళ్లు దూరంగా జరుగుతారు. ఇక లాభం లేదనుకొని రాజ్ కూడా తన స్టైల్లో రాయడం మొదలు పెడతారు. తమ మొగుళ్లు ప్రేమ లేఖలు ఎలా రాస్తున్నారో చూడటానికి కావ్య, అపర్ణ, ధాన్యం బయటకు వస్తారు.

మొగుళ్ల ప్రేమ లేఖలు చదివిన భార్యలు

ప్రేమ లేఖలు రాయడం పూర్తవడంతో ముగ్గురూ కలిసి తమ భార్యలకు వాటిని ఇస్తారు. ఒక్కొక్కరు చదవండి అని సుభాష్ అంటాడు. మొదట రాజ్ రాసిన ప్రేమ లేఖను కావ్య చదవడం మొదలుపెడుతుంది. నువ్వే నా కాంట్రాక్ట్.. టెండర్, బోర్డ్ మీటింగ్, బ్లాంక్ చెక్, బౌన్స్ అయిన చెక్, కొత్త బ్రాంచ్ అంటూ ఓ కంపెనీ సీఈవోలాగే రాజ్ తన లవ్ లెటర్ రాస్తాడు. అది చూసి కావ్యకు మండుతుంది. మనసులో ఏముంటే అదే వస్తుంది.. దీనిని లవ్ లెటర్ అంటారా అంటూ మండిపడుతుంది. సుభాష్ కూడా టెండర్ కోసం అర్జీ పెట్టినట్లుగా ఉందిరా అంటూ కొడుకును ఎగతాళి చేస్తాడు.

ఆ తర్వాత సుభాష్ రాసిన లెటర్ చదువుతుంది అపర్ణ. మైడియర్ అప్పు అంటూ అతడు మొదలుపెడతాడు. అంటే అప్పు ఇంటికి రాకముందు అపర్ణను తాను అప్పు అని పిలిచేవాడినని సుభాష్ అనడంతో అబ్బో అంటూ రాజ్ వెటకారంగా అంటాడు. అప్పు.. తప్పు.. చెప్పు.. లవ్వు, స్టవ్వు.. చూపా, సోపా.. ఐస్, బాస్మతి రైస్.. ఒట్టు.. కిరాణా కొట్టు అంటూ సుభాష్ ప్రేమ లేఖ రాస్తాడు. అది చూసి అపర్ణకు తెగ కోపం వస్తుంది. గత జన్మలో కిరాణా కొట్టు ఏమైనా నడిపావా అంటూ రాజ్ తండ్రిని అడుగుతాడు. చివరిగా ప్రకాశం ప్రేమ లేఖను ధాన్యం చదువుతుండగా.. బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది.

News/Entertainment/బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్: పెళ్లాలకు మొగుళ్ల ప్రేమ లేఖలు.. మంచి ఫిట్టింగే పెట్టిన కావ్య.. ఒట్టు, కిరాణా కొట్టు అంటూ..
News/Entertainment/బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్: పెళ్లాలకు మొగుళ్ల ప్రేమ లేఖలు.. మంచి ఫిట్టింగే పెట్టిన కావ్య.. ఒట్టు, కిరాణా కొట్టు అంటూ..