Peddi Budget: ఉప్పెనకు 25 కోట్లు-పెద్దికి 350 కోట్లు-డైరెక్టర్ క్లారిటీ- ఏడిపించకపోతే బుచ్చిబాబే కాదంటూ సంచలన వ్యాఖ్యలు

Buchibabu: 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన తన తదుపరి చిత్రం 'పెద్ది' పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ బడ్జెట్ ఎంతో వెల్లడించాడు. అలాగే ఈ సినిమాలోని ఓ పాత్ర కన్నీళ్లు పెట్టించకపోతే తన పేరు బుచ్చిబాబే కాదని పేర్కొన్నాడు.

Published on: Jun 2, 2026, 10:12:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Buchibabu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్రంగా హల్‌చల్ చేస్తోంది. తన రెండో సినిమా పెద్దికే ఈ స్థాయి భారీ బడ్జెట్ లభించడంపై దర్శకుడు బుచ్చిబాబు సాన స్వయంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పెద్ది బడ్జెట్, క్యారెక్టర్ పై బుచ్చిబాబు సాన సంచలన వ్యాఖ్యలు (x)
పెద్ది బడ్జెట్, క్యారెక్టర్ పై బుచ్చిబాబు సాన సంచలన వ్యాఖ్యలు (x)

పెద్ది బడ్జెట్

తన మొదటి సినిమా 'ఉప్పెన'ను కేవలం రూ.25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని అందుకున్నాడు బుచ్చిబాబు. అయితే, తన రెండో సినిమా పెద్దికే నిర్మాతలు ఇంత భారీ మొత్తాన్ని కేటాయిస్తారని తాను అస్సలు ఊహించలేదని ఆయన మైక్ ముందు ఓపెన్ అయ్యాడు. పెద్ది కోసం రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించాడు.

బుచ్చిబాబు కామెంట్లు

పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు కామెంట్లు వైరల్ గా మారాయి. 'పెద్ది' సినిమా కోసం ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టినట్లు అతను అధికారికంగా వెల్లడించాడు.

‘‘పెద్ది సినిమాకు రూ.350 కోట్లో ఎంతో అయింది. నేను రూ.25 కోట్లతో ఉప్పెన తీశా. ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా’’ అని బుచ్చిబాబు తెలిపాడు.

అప్పల సూరి పాత్ర

పెద్ది చిత్రంలో కేవలం విజువల్స్, భారీతనం మాత్రమే కాకుండా, అంతకుమించిన బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని బుచ్చిబాబు స్పష్టం చేశాడు. ముఖ్యంగా సినిమాలో అత్యంత కీలకమైన 'అప్పల సూరి' అనే పాత్ర గురించి ఆయన ఒక పవర్ ఫుల్ సవాల్ విసిరాడు.

"'అప్పల సూరి' పాత్ర మిమ్మల్ని ఏడిపించకపోతే నా పేరు బుచ్చిబాబు సానానే కాదు" అని బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఒక్క ప్రకటనతోనే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అభిమానులకు స్పష్టమైన సంకేతాలు అందాయి. పెద్ది మూవీలో జగపతి బాబు ఈ అప్పలసూరి అనే క్యారెక్టర్ చేశాడు.

ఎమోషనల్ డ్రామాగా 'పెద్ది'

సాధారణంగా వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు, గ్రాఫిక్స్, లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ బుచ్చిబాబు సాన తన మార్క్ హృదయానికి హత్తుకునే కథాంశాన్నే పెద్ది చిత్రంలోనూ నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

'ఉప్పెన' చిత్రంలో క్లైమాక్స్ ఎమోషన్స్‌తో థియేటర్లలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిన ఈ యువ దర్శకుడు, ఇప్పుడు 'పెద్ది' చిత్రంలో 'అప్పల సూరి' పాత్ర ద్వారా మరోసారి అంతకుమించిన ఎమోషనల్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే, ప్రతి సామాన్య ప్రేక్షకుడిని కదిలించేలా ఈ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'పెద్ది' సినిమా బడ్జెట్ ఎంత?

సమాధానం: దర్శకుడు బుచ్చిబాబు సాన వెల్లడించిన వివరాల ప్రకారం 'పెద్ది' సినిమాను సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ప్రశ్న: బుచ్చిబాబు సాన మొదటి సినిమా బడ్జెట్ ఎంత?

సమాధానం: బుచ్చిబాబు సాన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా 'ఉప్పెన'. ఈ సినిమాను కేవలం రూ.25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందించారు.

ప్రశ్న: 'పెద్ది' సినిమాలో ఏ పాత్ర గురించి దర్శకుడు సవాల్ విసిరాడు?

సమాధానం: ఈ సినిమాలో 'అప్పల సూరి' అనే పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టిస్తుందని, ఒకవేళ ఏడిపించకపోతే తన పేరు బుచ్చిబాబు సానానే కాదని డైరెక్టర్ అన్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More