సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చకు వచ్చే 'కాస్టింగ్ కౌచ్' (Casting Couch) భూతం మరోసారి టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గతంలో ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకోగా, తాజాగా ఒక తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక ప్రముఖ నిర్మాత పేరుతో తనకు ఎదురైన వేధింపుల గురించి ఆమె వీడియో విడుదల చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
న్యూయార్క్ అమ్మాయికి చేదు అనుభవం

న్యూయార్క్‌లో ఉంటున్న 'పికు నెమలి' (Piku Nemali) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తనకు తెలిసిన వారి ద్వారా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఆమె తన వివరాలను అతనికి పంపారు.
ఆ తర్వాత జరిగిన ఫోన్ సంభాషణలో కమిట్‌మెంట్ గురించి అడిగితే.. పని పట్ల తనకు ఉన్న నిబద్ధత గురించి అడుగుతున్నారేమో అనుకున్నట్లు చెప్పింది. అయితే ఆ వ్యక్తి కొద్దిరోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసి, టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాతను కలవాలని, అందుకోసం ఇండియాలోని ఒక రిసార్ట్‌కు రావాలని ఆహ్వానించారు.
ఆ ఆహ్వానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం, సదరు నిర్మాత కోరుతున్న లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న ఆ యువతి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి దిగజారిన సంస్కృతి వల్లే ఎంతోమంది ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లోకి రావడానికి భయపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అండగా నిలిచిన యాంకర్ ఝాన్సీ
ఈ వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీ వెంటనే స్పందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని 'లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ' (Sexual Harassment Redressal Panel) సభ్యురాలిగా ఉన్న ఆమె.. బాధితురాలిని సంప్రదించారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరుతూ, మహిళా కమిటీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అవకాశాల వేటలో ఇలాంటి వేధింపులు ఎదురైతే కమిటీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఝాన్సీ భరోసా ఇచ్చారు. బాధితురాలికి అండగా నిలిచిన ఝాన్సీ చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}ఈ వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ సీనియర్ నటి, యాంకర్ ఝాన్సీ వెంటనే స్పందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని 'లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ' (Sexual Harassment Redressal Panel) సభ్యురాలిగా ఉన్న ఆమె.. బాధితురాలిని సంప్రదించారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరుతూ, మహిళా కమిటీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అవకాశాల వేటలో ఇలాంటి వేధింపులు ఎదురైతే కమిటీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఝాన్సీ భరోసా ఇచ్చారు. బాధితురాలికి అండగా నిలిచిన ఝాన్సీ చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
{{/usCountry}}అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఆ 'ప్రముఖ నిర్మాత' ఎవరు? ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరును బయటపెడతారా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. చట్టపరమైన చిక్కుల వల్ల తాను ఆ నిర్మాత పేరును బయటకు చెప్పడం లేదన్న ఆమె.. క్యాప్షన్ లో మాత్రం పాపులర్ నిర్మాతే అని చెప్పడం గమనార్హం. కమిటీ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.