Actress Bold Scene: 53 ఏళ్ల వయసులో నటి బోల్డ్ ఇంటిమేట్ సీన్.. వణికిపోయిందట.. ఆ స్టార్ డైరెక్టర్ కాళ్లు పట్టుకుంటే..
Actress Bold Scene: షారుఖ్ ఖాన్ 'చక్ దే ఇండియా' చిత్రంతో గుర్తింపు పొందిన 53 ఏళ్ల బాలీవుడ్ నటి విద్యా మాల్వదే.. సీనియర్ నటుడు కుముద్ మిశ్రాతో కలిసి ఒక ఇంటిమేట్ సన్నివేశంలో నటించడానికి ముందు తాను తీవ్ర ఆందోళనకు, భయానికి గురయ్యానని ఆమె తెలిపారు.
Actress Bold Scene: షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ 'చక్ దే ఇండియా'లో కెప్టెన్ విద్యా శర్మ పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి విద్యా మాల్వదే. 53 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న ఆమె.. 2022లో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో విడుదలైన 'డాక్టర్ అరోరా' (Dr. Arora) వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన, భావోద్వేగభరిత అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు.

బాలీవుడ్ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సిరీస్‌లో సీనియర్ నటుడు కుముద్ మిశ్రాతో కలిసి ఒక ఇంటిమేట్ సన్నివేశం చేయడానికి ముందు తాను ఎంతగా భయపడిపోయారో, ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తనను ఎలా శాంతపరిచారో వివరించారు.
"అది కేవలం శారీరక సన్నివేశం కాదు.. ఒక మహిళ అంతర్మథనం"
'డాక్టర్ అరోరా' సిరీస్‌లో విద్యా మాల్వదే, కుముద్ మిశ్రా మధ్య ఒక కీలకమైన ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరణకు ముందు తాను, కుముద్ మిశ్రా ఇద్దరూ తీవ్ర ఒత్తిడికి గురయ్యామని విద్యా తెలిపారు.
“ఆ సీన్ గురించి నేను, కుముద్ జీ ఇద్దరం చాలా కంగారు పడ్డాం. ఎందుకంటే అది కేవలం ఒక ఫిజికల్ సీన్ మాత్రమే కాదు.. ఒక మహిళ లోపల జరిగే భావోద్వేగ పోరాటాన్ని చూపించే సన్నివేశం. శారీరక చర్యతో పాటు ఆ ఎమోషన్‌ను కూడా సరిగ్గా పండించగలనా లేదా అని నేను చాలా భయపడ్డాను” అని విద్యా పేర్కొన్నారు.
“కుముద్ జీకి కూడా అలాంటి ఇంటిమేట్ సీన్ చేయడం అదే మొదటిసారి. అందుకే షూటింగ్ చివరి రోజున ముందుగా ఈ సన్నివేశాన్ని పూర్తి చేసేయాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఆయన చాలా గొప్ప నటుడు కావడం వల్ల నాకు ఎంతో సౌకర్యంగా అనిపించింది” అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇంతియాజ్ అలీ కాళ్లు పట్టుకోవడంతో 20 సెకన్లలో నార్మల్ అయ్యా
ఇలాంటి సున్నితమైన సన్నివేశాలు చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ మేకర్స్ వ్యవహరించే తీరు చాలా ముఖ్యమని విద్యా మాల్వదే అభిప్రాయపడ్డారు. ఆ సిరీస్ నిర్మాత, క్రియేటర్ అయిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తమకు ఇంటిమసీ కోచ్‌లా వ్యవహరించారని ఆమె గుర్తుచేసుకున్నారు.
“మేము ఆ సన్నివేశాన్ని ప్లాన్ చేయడానికి, రిహార్సల్ (బ్లాకింగ్) చేయడానికి ఇంతియాజ్ సర్ ఇంటికి వెళ్లాం. అప్పుడు నేను చాలా కంగారుగా బెడ్ చివరన కూర్చున్నాను. వెంటనే ఇంతియాజ్ సర్ నా ఎదురుగా కూర్చుని, నా పాదాలను (కాళ్లను) తన చేతులతో పట్టుకున్నారు.” అని చెప్పారు.
“మొదటి 10 సెకన్లు నాకు ఏమీ అర్థం కాలేదు.. 'ఇదేంటి, సర్ ఏం చేస్తున్నారు?' అని నా మనసులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ ఆయన నా కాళ్లు పట్టుకునే నాతో ఎంతో సహజంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా కేవలం 20 సెకన్లలోనే నాలోని భయం, ఆందోళన మొత్తం మాయమై నేను పూర్తిగా శాంతించాను. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశం రిహార్సల్స్ పూర్తి చేశాం” అని విద్యా వివరించారు.
'డాక్టర్ అరోరా' సిరీస్ విశేషాలు
సాజిద్ అలీ, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన 'డాక్టర్ అరోరా' సిరీస్‌కు ఇంతియాజ్ అలీ కథ అందించడంతో పాటు నిర్మించారు. 1999 నాటి చిన్న పట్టణాల నేపథ్యంలో సాగే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌లో 'గుప్త రోగ నిపుణుడు' (సెక్సాలజిస్ట్) డాక్టర్ విశేష్ అరోరా (కుముద్ మిశ్రా) వద్దకు వచ్చే విభిన్న జంటల సమస్యలను సున్నితంగా, హాస్యభరితంగా ఆవిష్కరించారు. ఈ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


