Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న ఇంతియాజ్ అలీ ఎమోషనల్ డ్రామా..ఓటీటీలో ఎందుకింత ట్రెండింగ్? ఓ లుక్కేయండి
Netflix Trending: బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా ‘మై వాపస్ ఆవుంగా’ డిజిటల్ స్పేస్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ చార్ట్స్‌లో నంబర్ వన్ గా నిలిచింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎందుకింత ట్రెండ్ అవుతుందో ఇక్కడ చూసేయండి.
Netflix Trending: భారతదేశ విభజన (1947 Partition) నేపథ్యంలో తెరకెక్కిన ‘మై వాపస్ ఆవుంగా’ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ప్రేమ భావోద్వేగాల కాన్సెప్ట్ ఓటీటీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులను నెలకొల్పడానికి ఇవే ప్రధాన కారణాలు.

ఇంతియాజ్ అలీ మార్క్ ఎమోషన్
'జబ్ వి మెట్', 'రాక్‌స్టార్' వంటి ఐకానిక్ చిత్రాలను అందించిన ఇంతియాజ్ అలీ.. ఇప్పుడు మై వాపస్ ఆవుంగాతో అదరగొట్టారు. రెండు వేర్వేరు తరాల ప్రేమకథలను సమాంతరంగా నడిపిస్తూ స్క్రీన్‌ప్లేను రూపొందించారు.
వృద్ధాప్యంలో డిమెన్షియాతో బాధపడుతూ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని తపించే తాత, అతని మనవడి ప్రయాణం ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది. దీనికి ఏఆర్ రెహమాన్ అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్, బీజీఎం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
నసీరుద్దీన్ షా & దిల్జీత్ దోసాంజ్ పెర్ఫార్మెన్స్
సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా నటించిన తీరు, ఆయన మనవడిగా దిల్జీత్ దోసాంజ్ కనబరిచిన నటన సినిమాకు ప్రాణవాయువుగా మారాయి. దిల్జీత్, ఇంతియాజ్ అలీ కాంబినేషన్ కు ఉన్న మాస్ క్రేజ్ ఓటీటీ వ్యూస్‌ను భారీగా పెంచింది. వీరికి తోడు వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
థియేటర్ మిస్సయిన ఆడియన్స్
జూన్ లో థియేటర్లలో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచిన ఈ మై వాపస్ అవుంగా చిత్రాన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల థియేటర్లలో కొంతమంది చూడలేకపోయారు.వీళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెంటనే పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామా? అని ఫీల్ అవుతున్నారు.
సౌత్ ఆడియన్స్‌ను సైతం
కేవలం నార్త్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాకుండా.. ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్ ద్వారా దక్షిణ భారత ఆడియన్స్ కూడా ఈ పీరియాడిక్ డ్రామాకు ఫిదా అవుతున్నారు. ప్రేమ, విడిపోవడం, మూలాలను గుర్తుచేసుకోవడం అనే పాయింట్ గ్లోబల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం విశేషం.
నంబర్ వన్ గా
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల హవా నడుస్తున్న సమయంలో ఒక ప్యూర్ ఎమోషనల్ సినిమా అయిన మై వాపస్ ఆవుంగా నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. నాణ్యమైన కంటెంట్, బలమైన కథనం ఉంటే ఓటీటీ వీక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘మై వాపస్ ఆవుంగా’ నిరూపించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


