Sri Gouri Priya: ప్రొడ్యూసర్‌కు రాఖీ కట్టిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ.. ఫొటోలు వైరల్

Sri Gouri Priya: చెన్నై లవ్ స్టోరీ మూవీ హీరోయిన్ శ్రీగౌరీప్రియ తన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కు రాఖీ కట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ సందర్భంగా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడటంతో రాఖీ పండగనాడు ఆమె ఆయనకు రాఖీ కట్టడం విశేషం.

Published on: Aug 28, 2026, 22:10:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sri Gouri Priya: సినిమా రంగంలో గ్లామర్, కాంట్రాక్టులు మాత్రమే కాదు.. అంతకు మించిన స్వచ్ఛమైన మానవీయ అనుబంధాలు కూడా వికసిస్తుంటాయి. 'చెన్నై లవ్ స్టోరీ' ప్రాజెక్ట్ షూటింగ్ జర్నీలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ ఎస్‌కేఎన్ (SKN) మధ్య ఒక అందమైన అన్నాచెల్లెళ్ల బంధం మొదలైంది. తాజాగా ఎస్‌కేఎన్‌కి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకుంది ఈ క్రేజీ హీరోయిన్.

Sri Gouri Priya: ప్రొడ్యూసర్‌కు రాఖీ కట్టిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ.. ఫొటోలు వైరల్
Sri Gouri Priya: ప్రొడ్యూసర్‌కు రాఖీ కట్టిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ.. ఫొటోలు వైరల్

స్క్రిప్ట్‌లో లేని బ్యూటిఫుల్ అనుబంధం

షూటింగ్ సెట్స్‌లో చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలుస్తుంటారు. కానీ కొందరి మధ్య మాత్రమే లైఫ్ లాంగ్ నిలిచిపోయే బంధాలు ఏర్పడతాయి. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రయాణంలో శ్రీ గౌరి ప్రియ తన ప్రోడ్యూసర్ ఎస్‌కేఎన్‌లో ఒక సొంత అన్నయ్యను చూసుకుంది.

ఈ మధురమైన క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీమ్ ఒక ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. "కొన్ని సంబంధాలు కేవలం కథ స్క్రిప్ట్‌లో రాసినట్లు ఉండవు.. అవి నేరుగా మనసుతో ముడిపడి ఉంటాయి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రొడక్షన్ హౌస్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా తనను చూసుకుంటున్న ఎస్‌కేఎన్‌కు రాఖీ కట్టి అభిమానం చాటుకుంది శ్రీ గౌరి ప్రియ.

'రైటర్ పద్మభూషణ్' నుంచి 'మ్యాడ్' వరకు.. శ్రీ గౌరి ప్రియ ప్రయాణం..

హైదరాబాద్‌కు చెందిన శ్రీ గౌరి ప్రియ షార్ట్ ఫిలిమ్స్, మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి మిస్ హైదరాబాద్ కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత సుహాస్ హీరోగా వచ్చిన 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నేచురల్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యువతను విపరీతంగా ఆకట్టుకున్న బ్లాక్‌బస్టర్ హిట్ 'మ్యాడ్' (MAD) మూవీలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా తమిళం, తెలుగు భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'లవర్' (Lover) సినిమాలోనూ ఇంటెన్స్ రోల్ చేసి తన నటనతో మెప్పించింది.

యంగ్ టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్ ప్రోడ్యూసర్ ఎస్‌కేఎన్

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలను, కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ ప్రత్యేక స్థానం సంపాదించారు. విజయ్ దేవరకొండతో తీసిన 'టాక్సీవాలా' సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించిన ఆయన.. కొన్నేళ్ల కింద వచ్చిన 'బేబి' (Baby) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రికార్డులు సృష్టించారు. ఈ మధ్యే చెన్నై లవ్ స్టోరీతో మరో సక్సెస్ అందుకున్నారు.

చిన్న సినిమాలను బిగ్ స్కేల్‌లో ప్రమోట్ చేస్తూ, యంగ్ యాక్టర్స్‌కు మంచి అవకాశాలు ఇవ్వడంలో ఎస్‌కేఎన్ ఎప్పుడూ ముందే ఉంటారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More