Sri Gauri Priya: అమ్మ ఉంటే ఎంత బాగుండేదో.. చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్‌లో గౌరి ప్రియ కన్నీళ్లు.. వీడియో వైరల్
Sri Gauri Priya: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ ఎమోషనల్ అయింది. తన విజయాన్ని చూసేందుకు ఇటీవల మరణించిన తల్లి లేకపోవడంతో కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
Sri Gauri Priya: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది.

అమ్మ ఉంటే ఎంత బాగుండేదో
చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో తన తల్లిని గుర్తు చేసుకుని శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ‘‘ఈ సక్సెస్ ను మా అమ్మ చూస్తే ఎంత బాగుండేదో అని అందరూ అంటున్నారు. అదొక్కటే బాధ. కానీ మా అమ్మ చూస్తోంది. ఇక్కడే ఎక్కడో ఉంది. అమ్మా.. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది’’ అని ప్రియ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
ఫోన్ మోగుతూనే ఉంది
ఈ సక్సెస్ మీట్ లో గౌరి ప్రియ స్పీచ్ వీడియో వైరల్ గా మారింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇండస్ట్రీ నుంచి, స్నేహితుల నుంచి తనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన ఫోన్ నిరంతరం మోగుతూనే ఉందని ఆమె చెప్పింది. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో గౌరి ప్రియ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
మూడేళ్ల క్రితం
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తల్లి వసుంధర మూడేళ్ల క్రితం కన్నుమూశారు. 2023లో ఆమె క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ సందర్భంగా అమ్మను గుర్తు చేసుకుంది శ్రీ గౌరి ప్రియ. అమ్మ వసుంధరతో గౌరి ప్రియకు గాఢమైన అనుబంధం ఉండేది.
కిరణ్ అబ్బవరానికి హిట్
వరుస ప్లాప్‌ల తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరానికి 'చెన్నై లవ్ స్టోరీ' రూపంలో పక్కా కమర్షియల్ విక్టరీ దక్కింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్‌లోనే కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కుల ద్వారా మేకర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
2024లో ‘క’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. కానీ ఆ తర్వాత దిల్ రూబా, కే ర్యాంప్ తో అనుకున్న స్థాయి విజయాలు దక్కలేవు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమాతో కిరణ్ అబ్బవరం తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


