ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తుకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం 'జ్ఞానపీఠ్' (Jnanpith Award) దక్కడం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. అకిలన్ (1975), జయకాంతన్ (2002) తర్వాత ఈ గౌరవం పొందిన మూడవ తమిళ రచయితగా వైరముత్తు నిలిచాడు. అయితే ఆయనను అభినందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సదరు హీరోల అభిమానుల నుండి ఆమెకు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదురవ్వగా, చిన్మయి వారికి అంతే దీటుగా సమాధానమిచ్చింది.
'నా హీరోలు ఇంతేనా?' - చిన్మయి ఆవేదన

మీటూ (MeToo) ఉద్యమ సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళల్లో చిన్మయి ఒకరు. వైరముత్తును కమల్, రజనీలు అభినందించడంపై స్పందిస్తూ చిన్మయి ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసింది.
"నేను కూడా రజనీ సర్, కమల్ సర్ అభిమానినే. కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటారని నేను పిచ్చిగా నమ్మిన వ్యక్తులు ఇలా వ్యవహరించడం చూసి నిరాశ చెందే హక్కు నాకు ఉంది. సినిమాల్లో నీతి గురించి పవర్ ఫుల్ డైలాగులు చెప్పే వారు, నిజ జీవితంలో ఒక లైంగిక వేధింపుల ఆరోపితుడిని సమర్థిస్తుంటే ఎలా ఊరుకోవాలి?" అని ఆమె ప్రశ్నించింది.
వీరిలో ఒకరు ఎంపీగా, మరొకరు రాజకీయ నాయకుడిగా ఉండి మహిళా రక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తూ, మరోవైపు వేధింపులకు గురైన 17 మంది మహిళల ఆవేదనను పట్టించుకోకపోవడం దారుణమని ఆమె మండిపడింది.
పరిశ్రమలో భద్రత ఎక్కడ?
తమిళ చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణ కోసం విశాఖ గైడ్ లైన్స్ (Vishakha Guidelines) ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
"2019 నుండి ఏఆర్ రెహమాన్ సర్ కు చెందిన కేఎమ్ కన్జర్వేటరీలో మాత్రమే పని చేసే ఐసీసీ ఉంది. డబ్బింగ్ యూనియన్ లో వేధింపులపై గళమెత్తిన మహిళను పని చేయకుండా బ్యాన్ చేశారు. ఆమె 5 ఏళ్ల తర్వాత న్యాయం పొందింది. ఇవన్నీ ఈ లెజెండ్స్ కి అర్థం కావా?" అని నిలదీసింది.
చిన్మయి చేసిన ప్రధాన విమర్శలు
{{/usCountry}}"2019 నుండి ఏఆర్ రెహమాన్ సర్ కు చెందిన కేఎమ్ కన్జర్వేటరీలో మాత్రమే పని చేసే ఐసీసీ ఉంది. డబ్బింగ్ యూనియన్ లో వేధింపులపై గళమెత్తిన మహిళను పని చేయకుండా బ్యాన్ చేశారు. ఆమె 5 ఏళ్ల తర్వాత న్యాయం పొందింది. ఇవన్నీ ఈ లెజెండ్స్ కి అర్థం కావా?" అని నిలదీసింది.
చిన్మయి చేసిన ప్రధాన విమర్శలు
{{/usCountry}}రజనీకాంత్ పై చిన్మయి మండిపడింది. వైరముత్తును 'ప్రియ మిత్రుడు' అని సంబోధిస్తూ రజనీ చేసిన ట్వీట్ పై "అయ్యయ్యో.. అర్థమే కావట్లేదు" అని ఎద్దేవా చేసింది.
కమల్ హాసన్ గురించి కూడా ఆమె స్పందించింది. వైరముత్తును 'కవి చక్రవర్తి' అని పొగిడిన కమల్ పై స్పందిస్తూ.. "రాజకీయాల్లోకి వచ్చి మహిళా రక్షణ గురించి మాట్లాడే మీరు, మీ పార్టీలోని మహిళే బహిరంగంగా వైరముత్తు పేరును చెప్పినా పట్టించుకోరా? చివరికి పురుషులు తమ బ్రోస్, అంకుల్స్ వెంటే నిలబడతారని దీనివల్ల అర్థమవుతోంది" అని ఘాటుగా విమర్శించింది.
ట్రోలర్లకు హెచ్చరిక
తనను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానమిస్తూ.. "మీరందరూ కలిసి నేరస్థులను కాపాడుతున్నారు కాబట్టే తమిళనాడులో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాలమే మీకు గొప్ప గుణపాఠం చెబుతుంది. ఆ పాఠాలు చాలా కఠినంగా ఉంటాయి" అని హెచ్చరించింది. ఈ మొత్తం వివాదంపై కమల్ హాసన్ లేదా రజనీకాంత్ ఇప్పటివరకు స్పందించలేదు.