'ఓపెన్‌హైమర్' మూవీతో ఆస్కార్ గెలుచుకున్న లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.. తన నెక్ట్స్ భారీ బడ్జెట్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey) ట్రైలర్‌ను విడుదల చేశాడు. గ్రీకు పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, యాన్ హాత్వే వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులైలో ఈ సినిమా విడుదల కానుంది.
ది ఒడిస్సీ ట్రైలర్ రిలీజ్

క్రిస్టోఫర్ నోలన్ మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పటి వరకూ ఇంటర్‌స్టెల్లార్, ఇన్‌సెప్షన్, డన్‌కిర్క్, ఓపెన్‌హైమర్ లాంటి సినిమాలను అతడు అందించాడు. అసలు ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్.
అలాంటి క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా 'ది ఒడిస్సీ' మొదటి ట్రైలర్ విడుదలైంది. 'ఓపెన్‌హైమర్' (Oppenheimer) ఘనవిజయం తర్వాత నోలన్ చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ది ఒడిస్సీ ట్రైలర్ ఎలా ఉందంటే?
రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతమైన గ్రీకు పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ట్రోజన్ యుద్ధం (Trojan War) ముగిసిన తర్వాత గ్రీకు వీరుడు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన సైన్యంతో ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయాణమే ఈ కథ.
యుద్ధంలో నరకం చూసిన వారికి.. తిరుగు ప్రయాణం కూడా అంత సులభంగా ఉండదని.. రాక్షసులు, విధి ఆడే వింత నాటకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రైలర్లో చూపించారు. నోలన్ మార్క్ భారీ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
హాలీవుడ్ స్టార్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మ్యాట్ డామన్ ఇందులో వీరుడు ఒడిస్సియస్ పాత్రలో నటించాడు. ఇక యాన్ హాత్వే ఒడిస్సియస్ భార్య పెనెలోప్‌గా కనిపించనుంది. టామ్ హాలండ్ వీరి కుమారుడు టెలిమాకస్ పాత్రలో నటించగా.. జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ది ఒడిస్సీ రిలీజ్ ఎప్పుడు?
యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ది ఒడిస్సీ మూవీని.. జులై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ పై ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
{{/usCountry}}యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ది ఒడిస్సీ మూవీని.. జులై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ పై ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
{{/usCountry}}"మా జనరేషన్‌లో అత్యంత ప్రభావవంతమైన దర్శకుడు నోలన్. ఈ సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నాం" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "థియేటర్లో సినిమా చూడటానికి ఇప్పుడే వెళ్లి కూర్చున్నాను.. వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు" అని ఒక నెటిజన్ ఫన్నీగా యూట్యూబ్‌లో రాసుకొచ్చారు. హోమర్ (Homer) రాసిన ప్రముఖ నవల 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.