Nolan Odyssey: ముంబై థియేటర్‌లో క్రిస్టోఫర్ నోలన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఇరానీ కేఫ్ లో చాయ్.. ఒడిస్సీ ప్రీమియర్ అసలు కథ ఇదే

Nolan Odyssey: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన ప్రతిష్టాత్మక మైథిలాజికల్ యాక్షన్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ గ్లోబల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ల్యాండ్ అయ్యాడు. ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్ స్క్రీనింగ్ విశేషాలు, నోలన్ ముంబై ఇరానీ కేఫ్ విజిట్ వెనుక ఉన్న అసలు కథేంటో చూసేయండి.

Published on: Jul 12, 2026, 15:57:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nolan Odyssey: హాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌కు భారత్ వేదికైంది. ఆస్కార్ విన్నర్ క్రిస్టోఫర్ నోలన్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక అఫీషియల్ మూవీ ప్రీమియర్ కోసం ముంబై వచ్చాడు. అతనితో పాటు మార్వెల్ ‘స్పైడర్ మ్యాన్’ టామ్ హాలండ్, ఆస్కార్ విజేత మాట్ డామన్, ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ ముంబై ఈవెంట్‌లో మెరిశారు.

ముంబై థియేటర్‌లో క్రిస్టోఫర్ నోలన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఇరానీ కేఫ్ లో చాయ్.. ఒడిస్సీ ప్రీమియర్ అసలు కథ ఇదే
ముంబై థియేటర్‌లో క్రిస్టోఫర్ నోలన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఇరానీ కేఫ్ లో చాయ్.. ఒడిస్సీ ప్రీమియర్ అసలు కథ ఇదే

టార్గెట్ ఇండియా

ది ఒడిస్సీ’ మూవీని సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100% పూర్తిగా IMAX ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేశారు. ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఐమాక్స్ స్క్రీన్లకు, ముఖ్యంగా నోలన్ చిత్రాలకు (గతంలో ఓపెన్‌హైమర్ సాధించిన రికార్డులే నిదర్శనం) విపరీతమైన మార్కెట్ వాల్యూ పెరిగింది.

ముంబై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ రీజియన్లలో ఐమాక్స్ టికెట్ ధరలు రూ.2500 నుండి రూ.3100 వరకు పలుకుతున్నాయి. అయినా ఒడిస్సీ అడ్వాన్స్ బుకింగ్స్ 45% పైగా ముగిశాయి. అందుకే ఇండియన్ బాక్సాఫీస్ నుంచి రాబోయే భారీ రెవెన్యూను టార్గెట్ చేసేందుకే నోలన్ టీం ముంబైని వరల్డ్ వైడ్‌గా ‘ఏకైక పర్సనల్ ఫ్యాన్ స్క్రీనింగ్’ వేదికగా ఎంచుకుంది.

థియేటర్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ

ముంబైలోని పివిఆర్ ఐకాన్ ఐమాక్స్ లో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్ స్క్రీనింగ్ ముగిసిన వెంటనే.. క్రిస్టోఫర్ నోలన్, మాట్ డామన్, టామ్ హాలండ్ హఠాత్తుగా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను షాక్‌కు గురిచేశారు.

ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ.. "నేను గతంలో ‘ది డార్క్ నైట్ రైజెస్’ (జోధ్‌పూర్), ‘టెనెట్’ (ముంబై) షూటింగ్స్ కోసం ఇండియాకు వచ్చాను. కానీ ఒక సినిమాను ఇక్కడ లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన, ఉత్సాహభరితమైన సినిమా ప్రేక్షకులు భారతీయులు" అని కొనియాడారు.

అంతేకాదు, స్టేజ్ పై నుంచి ప్రేక్షకులను సరదాగా "ఈ సినిమాలో ఎవరు బాగా యాక్ట్ చేశారు? మాట్ డామనా? లేక టామ్ హాలండా?" అని అడగడంతో ఫ్యాన్స్ అందరూ గట్టిగా ‘నోలన్’ అని అరిచారు.

ఇరానీ కేఫ్‌లో చాయ్ అండ్ బన్ మస్కా!

రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్ ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న 108 ఏళ్ల నాటి ప్రసిద్ధ ‘ఒలింపియా కాఫీ హౌస్’ లోకి సాధారణ కస్టమర్లలా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ గ్లాసుల్లో చాయ్ లో బన్ మస్కా తింటూ స్థానిక కస్టమర్లతో ముచ్చటించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ది ఒడిస్సీ రిలీజ్ డేట్

హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీక్ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన ది ఒడిస్సీ చిత్రంలో అన్ హాథ్‌వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, షార్లిజ్ థెరాన్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More