...
...
Next Story

Comedian Mahesh: ఈ కమెడియన్‌కు అసలు ఏమైంది.. లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో.. ఫ్యాన్స్ ఆందోళన

Comedian Mahesh: జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయి తర్వాత సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించిన కమెడియన్ మహేష్. అతడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. అది చూసి ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

Published on: Jun 26, 2026, 21:59:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Comedian Mahesh: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్. అతడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీనికి ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. అయితే చాలా బాధతో మాట్లాడుతూ.. జీవితం అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందని అడుగుతున్నారు.

చెప్పే వరకూ ఏం రాయొద్దు

Comedian Mahesh: ఈ కమెడియన్‌కు అసలు ఏమైంది.. లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో.. ఫ్యాన్స్ ఆందోళన
Comedian Mahesh: ఈ కమెడియన్‌కు అసలు ఏమైంది.. లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో.. ఫ్యాన్స్ ఆందోళన

ఈ వీడియోలో కమెడియన్ మహేష్ మాట్లాడుతూ.. “లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అండి.. ఎప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం బయట చూసినదానిని బట్టి ఏవేవో ఊహించుకొని.. నమ్మేయటం కరెక్ట్ కాదు.. ముఖ్యంగా రిపోర్టర్స్ కి, మీమర్స్ కి.. నేను నిజం చెప్పే వరకు మీరు అనుకున్నది రాయొద్దు.. త్వరలో నేనే మీకు మొత్తం నిజం చెబుతాను” అని అన్నాడు.

ఆందోళనలో అభిమానులు

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కమెడియన్ మహేష్.. ఈ వీడియోలో ఇంత బాధగా మాట్లాడటం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏమైంది అన్నా అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. ఏం బాధపడకండి అన్నా.. నీతో మేమున్నాం అని మరికొందరు భరోసా ఇస్తున్నారు.

ఇక ప్రమోషన్ ఐడియా బాగుందని కొందరు.. సస్పెన్స్ ఇక ఆపి అసలు విషయం ఏంటో చెప్పు అని మరికొందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఏం జరిగిందన్నది మాత్రం మహేష్ చెప్పలేదు. అయితే అంతకుముందు శుక్రవారం (జూన్ 26) ఉదయం తన స్టోరీస్ లో సింగ్ గీతం మూవీ తమిళంలో ఈరోజే రిలీజ్ అయిందని ఓ పోస్ట్ చేశాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks