ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ..

ప్రముఖ స్టాండప్ కమెడియన్, రియాలిటీ షో స్టార్ మునావర్ ఫరూఖీ మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై చేసిన ఒక వివాదాస్పద పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇరాన్‌కు మద్దతుగా అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Published on: Mar 3, 2026, 13:51:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణపై కమెడియన్ మునావర్ ఫరూఖీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా నిలబడిన ఏకైక దేశం ఇరాన్ మాత్రమేనని అతడు పరోక్షంగా పేర్కొనడం చర్చకు దారితీసింది. అతడు చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే ఇరాన్ అధ్యక్షుడు చేసిన మారణ హోమం సమయంలో లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ నిలదీస్తున్నారు.

ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ.. (PTI)
ఇరాన్‌కు మద్దతుగా కమెడియన్ పోస్ట్.. ఆడుకుంటున్న నెటిజన్లు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందంటూ.. (PTI)

మునావర్ ఫరూఖీ ఏమన్నాడంటే?

కమెడియన్ మునావర్ ఫరూఖీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ప్రపంచ దృష్టిని 'ఎప్స్టీన్ ఫైల్స్' (Epstein files) నుండి మళ్లించే ప్రయత్నమని ఆరోపించాడు. డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను ఉద్దేశిస్తూ.. "చమురు, బంగారం కోసం ఆడుతున్న ఆట ఇది. గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ఏకైక దేశంపై బాంబులు వేస్తున్నారు. ఒక బాలల వేధింపుల నిందితుడు హీరోలా నటించడం ఈ వికృత ప్రపంచానికి సంకేతం" అని ఘాటుగా రాశాడు.

నెటిజన్ల రియాక్షన్ ఇలా..

మునావర్ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "కేవలం ఒక్క దేశం మాత్రమే నిలబడిందా?" అని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు "ఇరాన్ ప్రజలే అక్కడ సంబరాలు చేసుకుంటుంటే, మీరు మాత్రం మద్దతు ఇస్తున్నారా?" అని నిలదీశారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని, బాల్య వివాహాలను సమర్థించేవారిని ఎలా సపోర్ట్ చేస్తారని మునావర్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. అయితే మునావర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక వర్గం వాళ్లు అతనికి మద్దతుగా నిలిచారు.

యుద్ధ క్షేత్రంలో తాజా పరిస్థితి

ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అక్కడ అధికారం ఎవరి చేతుల్లో ఉందో స్పష్టత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇరాన్ చర్యలకు తగిన ప్రతిఘటన ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More