...
...
Next Story

తెలుగు కమెడియన్ సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. జెట్లీ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

తెలుగు కమెడియన్ సత్య తెలుసు కదా. అతని సినిమాలో ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా ఫిమేల్ లీడ్ గా నటిస్తుండటం విశేషం. మత్తు వదలరా కాంబినేషన్ రిపీట్ అవుతున్న వేళ.. హీరోయిన్ గా రియా సింఘా రానుండటం ఆసక్తి రేపుతోంది.

Published on: Dec 10, 2025, 17:34:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కమెడియన్ సత్య, డైరెక్టర్ రితేష్ రానా కాంబినేషన్ లో వచ్చిన మత్తు వదలరా రెండు సినిమాలూ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈసారి జెట్లీ (Jetlee) పేరుతో ఓ మూవీ వస్తోంది. అందులో హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘాను పరిచయం చేశారు.

జెట్లీలో రియా సింఘా

తెలుగు కమెడియన్ సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. జెట్లీ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
తెలుగు కమెడియన్ సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. జెట్లీ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

మత్తు వదలరా, మత్తు వదలరా 2.. రెండు సినిమాలూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కామెడీకి థ్రిల్ జోడించి తీసిన ఈ మూవీస్ తో డైరెక్టర్ రితేష్ రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు చాటుకున్నాడు. ఇప్పుడతడు ఆ రెండు సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన కమెడియన్ సత్యనే లీడ్ రోల్లో పెట్టి జెట్లీ అనే మూవీ చేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 9) అతని క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘాను మూవీలో ఫిమేల్ లీడ్ గా పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాతో రియా సింఘా టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈమె ఎవరో కాదు, మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్. అందాల పోటీల్లో గెలిచిన వెంటనే తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. లేటెస్ట్‌గా రియా సింఘా పుట్టినరోజు (డిసెంబర్ 10) సందర్భంగా టీమ్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. సినిమాలో ఆమె పాత్ర పేరు శివాని రాయ్. పోస్టర్ చూస్తుంటే ఆమెది కేవలం గ్లామర్ రోల్ మాత్రమే కాదు.. యాక్షన్‌కి కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తోంది.

జెట్లీ సినిమా విశేషాలు

ఇది ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. సత్య ఒక ఫ్లైట్ మీద కూర్చుని "నాకు కామెడీతో పని అయిపోయింది" అని సీరియస్‌గా పోజు ఇస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా రియా సింఘా పోస్టర్ కూడా మరో లెవెల్లో ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. వెన్నెల కిషోర్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. ఒక వైపు సత్య కామెడీ, మరోవైపు మిస్ యూనివర్స్ ఇండియా రియా గ్లామర్.. ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి రేపుతోంది. మరి ఈ సినిమాతో డైరెక్టర్ రితేష్ రానా ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe