Kangana Ranaut: కిస్సింగ్ సీన్‌లో డైరెక్టర్ కట్ చెప్పినా వినని కంగనా.. పెదవి కొరికేసిందన్న వార్తలపై స్పందించిన వీర్ దాస్

Kangana Ranaut: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు మరో వివాదం నడుస్తోంది. ఆమె ఓ సినిమాలో తన సహ నటుడు వీర్ దాస్ తో కిస్సింగ్ సీన్ లో రెచ్చిపోయి నటించి అతని పెదవి కొరికేసిందన్న వార్తలు సంచలనం రేపాయి. దీనిపై వీర్ దాస్ తాజాగా స్పందించాడు.

Published on: Jun 29, 2026, 15:20:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, పాపులర్ స్టాండప్ కమెడియన్ కమ్ యాక్టర్ వీర్ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రివాల్వర్ రాణి’ సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కంగనాతో చేసిన ఒక బోల్డ్ కిస్సింగ్ సీన్ వల్ల వీర్ దాస్ పెదవి తెగి తీవ్రంగా గాయపడ్డాడంటూ ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఈ రూమర్స్ పై హీరో వీర్ దాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు నిజం ఏంటో తేల్చేశాడు.

Kangana Ranaut: కిస్సింగ్ సీన్‌లో డైరెక్టర్ కట్ చెప్పినా వినని కంగనా.. పెదవి కొరికేసిందన్న వార్తలపై స్పందించిన వీర్ దాస్
Kangana Ranaut: కిస్సింగ్ సీన్‌లో డైరెక్టర్ కట్ చెప్పినా వినని కంగనా.. పెదవి కొరికేసిందన్న వార్తలపై స్పందించిన వీర్ దాస్

వైరల్ గాసిప్స్‌కు చెక్ పెట్టిన వీర్ దాస్

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో సీనియర్ జర్నలిస్ట్ సిమి చందోక్ మాట్లాడుతూ.. రివాల్వర్ రాణి షూటింగ్ టైంలో కిస్సింగ్ సీన్ ముగిసినా కంగనా ఆగలేదని, వీర్ దాస్ పెదవి గట్టిగా కొరకడంతో రక్తం వచ్చిందని కామెంట్స్ చేసింది.

ఈ రూమర్ కాస్తా విపరీతంగా ట్రోల్ అవ్వడంతో ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా వీర్ దాస్‌ను దీనిపై ప్రశ్నించాడు. దీనికి వీర్ దాస్ స్పందిస్తూ.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కేవలం ఒక కల్పిత కథ అని కొట్టిపారేశాడు.

"సెట్స్‌లో తను పూర్తి ప్రొఫెషనల్" అంటూ ప్రశంసలు

కంగనా రనౌత్ ప్రొఫెషనలిజం గురించి వీర్ దాస్ సానుకూలంగా మాట్లాడటం విశేషం. "కంగనా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. షూటింగ్ సెట్స్‌లో తను పక్కా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించింది. ఇలాంటి అబద్ధాలతో ఆమెపై బురద చల్లడం కరెక్ట్ కాదు" అని వీర్ దాస్ రాసుకొచ్చాడు.

అంతేకాదు తన కామెడీపై కంగనా గతంలో కొన్ని విమర్శలు చేస్తూ తనను టెర్రరిస్ట్ అని పిలిచినప్పటికీ.. ప్రొఫెషనల్ వర్క్ పరంగా తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చాడు.

గతంలోనే కంగనా స్ట్రాంగ్ కౌంటర్

నిజానికి ఈ కిస్సింగ్ సీన్ వివాదం సోషల్ మీడియాకు కొత్తేమీ కాదు. 2023లో కూడా ఇలాంటి పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ రూమర్స్‌పై చాలా ఘాటుగా స్పందించింది.

"హృతిక్ రోషన్ తర్వాత.. ఇప్పుడు నేను పాపం వీర్ దాస్ గౌరవానికి కూడా భంగం కలిగించానా? అసలు ఇది ఎప్పుడు జరిగింది?" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ఆ గాసిప్స్ రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది.

కంగనా, వీర్ దాస్ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఇవే

బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ‘రివాల్వర్ రాణి’ తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ తమ కెరీర్‌లో బిజీ అయిపోయారు. వీర్ దాస్ రీసెంట్‌గా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’ సినిమాలో కనిపించాడు. ఈ మూవీ మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుని ఫస్ట్ వీక్‌లో కేవలం రూ.6.6 కోట్లు మాత్రమే రాబట్టింది.

మరోవైపు కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన ‘భారత్ భాగ్య విధాత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో 20 మంది గర్భిణీల ప్రాణాలు కాపాడిన నర్స్ గీతా మాధవ్ గాంధారే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More