పంచాయత్ సీజన్ 5 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ చివరి సీజన్ ఇదే

బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 5 ఈ ఏడాదే వస్తోంది. ఇదే చివరి సీజన్ అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా.. దీనికోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చివరి సీజన్ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

Published on: Jan 21, 2026, 17:24:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన రూరల్ డ్రామా ‘పంచాయత్’ (Panchayat) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫులేరా అనే ఊరి చుట్టూ తిరుగుతూ, కడుపుబ్బా నవ్వించే సిరీస్ ఇదే. అక్కడి గ్రామస్తులు, వాళ్లతో స్థానిక పంచాయతీ సెక్రటరీ పడే కష్టాలు, అక్కడి అమాయకపు రాజకీయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతేడాది జూన్ లో వచ్చిన సీజన్ 4 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక, ఇప్పుడు ‘సీజన్ 5’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

పంచాయత్ సీజన్ 5 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ చివరి సీజన్ ఇదే (Screengrab @YouTube | Trailer)
పంచాయత్ సీజన్ 5 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ చివరి సీజన్ ఇదే (Screengrab @YouTube | Trailer)

పంచాయత్ సీజన్ 5 రిలీజ్ ఎప్పుడంటే?

పంచాయత్ వెబ్ సిరీస్ రెండు, మూడు సీజన్ల మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. అయితే మూడు, నాలుగో సీజన్లు మాత్రం ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అలాగే రాబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి ‘పంచాయత్ సీజన్ 5’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వెబ్ సిరీస్‌లో రింకీ పాత్రలో నటించిన సాన్వికా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సీజన్ 5 కోసం స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ మొదలవ్వచ్చు" అని గతేడాది హింట్ ఇచ్చింది.

సీజన్ 5 కథలో ట్విస్టులు..

సీజన్ 4 క్లైమాక్స్‌లో ఊహించని రాజకీయ మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. మంజు దేవి ఓడిపోయి, క్రాంతి దేవి కొత్త ప్రధాన్‌గా గెలిచారు. దీంతో ఫులేరాలో పవర్ పాలిటిక్స్ మారబోతున్నాయి. కొత్త ప్రధాన్, పాత ప్రధాన్ మధ్య గొడవలు, కామెడీ ఈ సీజన్‌లో హైలైట్ కానున్నాయి.

అభిషేక్ త్రిపాఠి (సచీవ్ జీ) వ్యక్తిగత సమస్యలు, కెరీర్ గందరగోళం కూడా కథలో కీలకం కానున్నాయి. గత సీజన్ (సీజన్ 4) విడుదలైన మొదటి వారంలోనే 180కి పైగా దేశాల్లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించి రికార్డు సృష్టించింది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ వంటి సీనియర్ నటుల నటన ఈ సిరీస్‌కు ప్రధాన బలం.

ఇప్పటివరకు రిలీజ్ టైమ్‌లైన్ ఎలా ఉంది?

ఈ పంచాయత్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 3, 2020న ప్రారంభమైంది. తర్వాత సీజన్ 2 మే 18, 2022న విడుదలైంది. సీజన్ 3 మే 28, 2024న వచ్చింది. తర్వాత ఏడాదికి అంటే గతేడాది జూన్ 24న నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయింది. ఇది ఇండియాలోనూ, అంతర్జాతీయంగానూ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఐదో సీజన్ తోనే ఈ వెబ్ సిరీస్ కు తెరదించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ కొత్త సీజన్ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More