Con City OTT: ఈరోజు ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన ఈ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి?

Con City Review in Telugu: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈరోజు అంటే శుక్రవారం (జులై 24) వచ్చిన తమిళ హైస్ట్ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో బాగా నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Jul 24, 2026, 12:19:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Con City OTT Review in Telugu: థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, సస్పెన్స్‌తో కట్టిపడేసిన అర్జున్ దాస్ (Arjun Das), అన్నా బెన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'కాన్ సిటీ' డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ వైవిధ్యమైన సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది.

Con City OTT: ఈరోజు ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన ఈ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి?
Con City OTT: ఈరోజు ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన ఈ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి?

తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన మూవీ లవర్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయొచ్చు.

ఆ ఫ్యామిలీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో కామెడీ, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ డోస్‌లో మిక్స్ అయ్యాయి.

మంగళూరు నేపథ్యంలో సాగే ఒక సాధారణ కుటుంబం చుట్టూ కాన్ సిటీ మూవీ కథ నడుస్తుంది. పైకి మామూలుగా కనిపించే ఆ ఫ్యామిలీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వారు ప్లాన్ చేసే హైస్ట్ కామెడీ సీన్స్ ఎలా ఉంటాయి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.

అర్జున్ దాస్, అన్నా బెన్ అదిరిపోయే యాక్టింగ్

తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తనదైన యూనిక్ బేస్‌ వాయిస్‌తో అలరించే అర్జున్ దాస్ ఇందులో కూల్ గ్యాంగ్‌స్టర్‌లా డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి కట్టుపడేశారు. ఇక మలయాళ టాలెంటెడ్ బ్యూటీ అన్నా బెన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కాన్ ఆర్టిస్ట్‌గా లీడ్ రోల్‌లో అదరగొట్టింది.

ఈ సినిమాలో యోగి బాబు, వడివుక్కరసి కామెడీ టైమింగ్ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలిచింది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా స్కామ్ సీక్వెన్సెస్ కోసం వాడిన మోకోబాట్ స్టైల్ కెమెరా వర్క్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సీన్ రోల్డన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు పర్ఫెక్ట్ సింక్ అయ్యాయి.

వీకెండ్ వాచ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్

థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.8 రేటింగ్ ఉందంటే.. ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి క్రైమ్ కామెడీ సినిమా కోసం చూస్తున్నట్లయితే 'కాన్ సిటీ' కచ్చితంగా మంచి ఆప్షన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న ఈ మూవీని వీక్షించి మీ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More