Netflix: 30 వేల అడుగుల ఎత్తులో సిద్ధార్థ్ సూపర్ యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్

Netflix: ప్రముఖ నటుడు సిద్ధార్థ్ నటిస్తున్న ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ వచ్చే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా సోమవారం (జులై 20) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

Published on: Jul 20, 2026, 18:28:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix: నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ మోస్ట్ యాంటిసిపేటెడ్ మిలిటరీ వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీరులు జరిపిన గగనతల పోరాటాల బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 7 నుంచి గ్లోబల్ వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది. వర్సటైల్ యాక్టర్ సిద్ధార్థ్, జిమ్మీ షేర్గిల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో దూసుకుపోతోంది.

Netflix: 30 వేల అడుగుల ఎత్తులో సిద్ధార్థ్ సూపర్ యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్
Netflix: 30 వేల అడుగుల ఎత్తులో సిద్ధార్థ్ సూపర్ యాక్షన్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్

30 వేల అడుగుల ఎత్తులో..

ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. కార్గిల్ వార్ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ కశ్మీర్ లోని ఎత్తయిన ప్రదేశాల నుంచి దాడి చేస్తూ ఇండియన్ ఆర్మీకి సవాలు విసిరింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసోపేత ఆపరేషన్ చుట్టూ తిరిగే వెబ్ సిరీసే ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్.

18 వేల అడుగుల ఎత్తులో శత్రువు తలదాచుకోగా.. 30 వేల అడుగుల ఎత్తు నుంచి వాళ్లపై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అయితే కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని, వాళ్లు చేసిన ఈ సాహసం సాధారణ విషయం కాదు. ఆ సాహసాన్ని కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ వెబ్ సిరీస్.

13 వేల అడుగుల ఎత్తులో రియలిస్టిక్ యాక్షన్

ఈ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ కోసం చిత్ర యూనిట్ సముద్ర మట్టానికి దాదాపు 13,000 నుంచి 16,500 అడుగుల ఎత్తులో అత్యంత కఠినమైన మైనస్ డిగ్రీల వాతావరణంలో షూటింగ్ జరిపింది. రియలిస్టిక్ ఫీల్ క్రియేట్ చేయడానికి నటీనటులు వారాల తరబడి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండి అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు.

కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ఇండియన్ ఆర్మీ గురించే కాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందించిన అసాధారణ సపోర్ట్, వారి 'గోల్డెన్ ఆరోస్' స్క్వాడ్రన్ సాహసాలను ఇందులో మొదటిసారి ఈ వెబ్ సిరీస్ లో రివీల్ చేయబోతున్నారు.

టాలీవుడ్‌లో 'బొమ్మరిల్లు' సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన సిద్ధార్థ్.. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా అనే రియల్ లైఫ్ కార్గిల్ వార్ హీరో క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సిద్ధార్థ్ కెరీర్ లోనే ఇది మొదటి ఫైటర్ పైలట్ రోల్ కావడం విశేషం. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన 'ది టెస్ట్' మూవీ సక్సెస్ తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

క్రేజీ స్టార్ కాస్ట్.. టాప్ టెక్నీషియన్స్

జిమ్మీ షేర్గిల్ తో పాటు బాక్సాఫీస్ దగ్గర 'ముంజ్యా' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ యాక్టర్ అభయ్ వర్మ, మిహిర్ అహూజా, తారూక్ రైనా, అర్నవ్ భాసిన్ ఇందులో యంగ్ ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ యాక్టర్స్ దియా మీర్జా, అదిల్ హుస్సేన్, వినయ్ పాఠక్ కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రాజెక్ట్‌కు అమిత్ త్రివేది, విశాల్ దద్లానీ, సుఖ్విందర్ సింగ్ లాంటి మ్యూజిక్ లెజెండ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ టీజర్‌లోనే దేశభక్తి పూనకాలు తెప్పించాయి.

ఈ వెబ్ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ 'అసుర్' తో సూపర్ హిట్ అందుకున్న ఓని సేన్ డైరెక్ట్ చేశారు. కో-క్రియేటర్ కుశాల్ శ్రీవాస్తవకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వ్యక్తిగత అనుభవం ఆధారంగా ఈ కథను డెవలప్ చేయడం విశేషం. మేచ్‌బాక్స్ షాట్స్, ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ డిజిటల్ స్పేస్ లో మిలిటరీ డ్రామాస్, పేట్రియాటిక్ కంటెంట్ కు విపరీతమైన వ్యూయర్ షిప్ నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ బిగ్-బడ్జెట్ వెబ్ సిరీస్ ద్వారా ఇండిపెండెన్స్ డే వీక్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 7న రిలీజ్ కానున్న ఈ హై-వోల్టేజ్ సిరీస్ ఓటీటీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More