అల్లు అయాన్‌కు క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ - ఫొటోలు షేర్ చేసిన బన్నీ

Allu arjun meets Venkatesh iyer : యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కలిశారు. ఈ సందర్భంగా అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని వెంకటేష్ అయ్యర్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బన్నీ పోస్ట్ చేశారు.

Published on: May 23, 2026, 19:39:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu arjun meets Crickter Venkatesh Iyer : భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కలిశారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలెంటెడ్ యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని ఈరోజు కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. వెంకటేష్ అయ్యర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌
క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌

అల్లు అయాన్‌కు స్పెషల్ గిఫ్ట్…

ఈ సందర్బంగా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం తన సంతకంతో కూడిన ఒక ప్రత్యేకమైన క్రికెట్ జెర్సీని (Signed Jersey) అందించాడు. అయాన్‌కు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినందుకగాను అల్లు అర్జున్ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు (Special Thanks) తెలియజేశారు.

"ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వార్మ్ రిగార్డ్స్" అని అల్లు అర్జున్ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా రాసుకొచ్చారు.

సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు అభిమానులు, ఇటు క్రికెట్ ప్రేమికులు తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. మీమ్స్ తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వెంకటేశ్ అయ్యర్… ఐపీఎల్ టోర్నీలో భాగంగా బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్నాడు. శుక్రవారం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన అయ్యర్… భారీ సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోగా… హైదరాబాద్ విక్టరీ కొట్టింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More