Jr NTR: ఈసారి టైగర్ కాదు డ్రాగన్.. ప్రతి షాట్‌లో మంట పుట్టించావ్.. హ్యాపీ బర్త్‌డే బావ: ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ విషెస్
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ప్రశాంత్ నీల్ సినిమాను ఉద్దేశించి 'డ్రాగన్' అంటూ బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Jr NTR: గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం (మే 20) తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అర్ధరాత్రే డ్రాగన్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చిన విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్, బన్నీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఆత్మీయంగా ఒకరినొకరు 'బావ' అని పిలుచుకుంటారు. అదే చనువుతో బన్నీ చేసిన స్పెషల్ ట్వీట్ నందమూరి, అల్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
హ్యాపీ బర్త్ డే బావ
"బావా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఎప్పుడూ ఆనందం, శాంతి, సిరిసంపదలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈసారి రాబోయేది టైగర్ కాదు.. డ్రాగన్. ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరుగుతాడు" అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అవుతోంది. ముఖ్యంగా బన్నీ వాడిన 'డ్రాగన్' అనే పదం ఎక్స్ ప్లాట్ ఫామ్ లో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారింది.
డ్రాగన్‌గా వస్తున్న జూనియర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లింప్స్ ను అర్ధరాత్రి రిలీజ్ చేశారు. చాలా రోజులుగా అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరునే ఖరారు చేశారు. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ లుక్, డైలాగులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
నా కలలోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు.. నా శత్రువుల ముఖాలు మాత్రమే వస్తాయి.. నా కలలో రాకుండా చూసుకో అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచింది. అతని కండలు తిరిగిన లుక్ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ కేజీఎఫ్, సలార్ విజువల్సే ఈ డ్రాగన్ లోనూ కనిపిస్తున్నాయి. అంతేకాదు రవి బస్రూర్ బీజీఎం ఈ గ్లింప్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.
డ్రాగన్ మూవీని వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేయబోతున్నారు. తాజా గ్లింప్స్ వీడియోలో టైటిల్ తోపాటు రిలీజ్ తేదీని కూడా రివీల్ చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ఎన్టీఆర్ పుట్టినరోజు ఎప్పుడు?
జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టినరోజును జరుపుకుంటారు.
ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు?
దేవర తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా టైటిల్ ఏమిటి?
ఈ భారీ పాన్ ఇండియా మూవీకి అనుకున్నట్లుగానే డ్రాగన్ అనే టైటిల్ పెట్టారు. తాజాగా రిలీజైన గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


