Seerat Kapoor: సీరత్ కపూర్‌ను అల్లు అర్జున్ ప్రాపర్టీ అన్న నెటిజన్.. సర్ అంటూనే గట్టిగా గడ్డి పెట్టిన నటి

Seerat Kapoor: తనను అల్లు అర్జున్ ప్రాపర్టీ అని కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు సర్ అంటూనే గట్టిగానే ఇచ్చి పడేసింది నటి సీరత్ కపూర్. ప్రస్తుతం ఆమె ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: May 11, 2026, 20:09:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Seerat Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి సీరత్ కపూర్ మధ్య ఉన్న స్నేహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక నెటిజన్ చేసిన అసభ్యకరమైన కామెంట్‌పై సీరత్ అత్యంత హుందాగా, అంతే ఘాటుగా స్పందించారు. ఆడవాళ్లను వస్తువుల్లా చూసే మనస్తత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Seerat Kapoor: సీరత్ కపూర్‌ను అల్లు అర్జున్ ప్రాపర్టీ అన్న నెటిజన్.. సర్ అంటూనే గట్టిగా గడ్డి పెట్టిన నటి
Seerat Kapoor: సీరత్ కపూర్‌ను అల్లు అర్జున్ ప్రాపర్టీ అన్న నెటిజన్.. సర్ అంటూనే గట్టిగా గడ్డి పెట్టిన నటి

వివాదానికి అసలు కారణం ఏంటి?

ఈ ఏడాది ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కపూర్, బన్నీ ప్రైవేట్ జెట్‌లో దిగిన కొన్ని అన్ సీన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా సీరత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేయగా, ఒక నెటిజన్ హద్దు మీరి "అల్లు అర్జున్ ప్రాపర్టీ" (అల్లు అర్జున్ సొత్తు) అని కామెంట్ చేశాడు.

సీరత్ కపూర్ దీటైన సమాధానం

ఆ కామెంట్‌ను చూసి ఊరుకోకుండా సీరత్ అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు. "చివరన ఒక హార్ట్ ఎమోజీ పెట్టినంత మాత్రాన మీరు అన్న మాటలు గౌరవప్రదంగా మారిపోవు సర్. ఒక మహిళ ఎప్పటికీ ఎవరి ఆస్తి లేదా సొత్తు కాదు. ఆమెకు ఒక సొంత వ్యక్తిత్వం, గుర్తింపు, కలలు, గళం ఉంటాయి. ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోండి కానీ ఇలా ప్రాపర్టీ రైట్స్ ఉన్నట్లు మాట్లాడకండి" అంటూ క్లాస్ పీకారు. సీరత్ స్పందనకు ఇతర నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మహిళలను గౌరవించలేని వారిని పట్టించుకోవద్దని ఆమెకు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.

బన్నీతో సీరత్ స్నేహం

పుట్టినరోజు పోస్ట్‌లో సీరత్ బన్నీని ఉద్దేశిస్తూ.. "హ్యాపీ బర్త్ డే బన్నీ! నీ వృత్తిని, అనుబంధాలను నువ్వు చాలా సహజంగా, హుందాగా బ్యాలెన్స్ చేస్తావు. నీకు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను," అంటూ రాసుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం మాత్రమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అల్లు అర్జున్ 'రాకా'తో బిజీ

'పుష్ప 2: ది రూల్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. దర్శకుడు అట్లీతో కలిసి 'రాకా' (Raaka) అనే భారీ యాక్షన్ చిత్రంలో ఆయన నటించనున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించబోతుండటం విశేషం. దీనితో పాటు లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో కూడా బన్నీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

మరోవైపు సీరత్ కపూర్ ఇటీవలే 'భామకలాపం 2', 'మనమే' వంటి చిత్రాల్లో మెరిశారు. త్వరలోనే 'ఝటస్య మరణం ధ్రువం', 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అల్లు అర్జున్, సీరత్ కపూర్ కలిసి నటిస్తున్నారా?

ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసి నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే.

2. అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏంటి?

'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమాలో నటించనున్నారు.

3. ట్రోలర్‌కు సీరత్ కపూర్ ఇచ్చిన సమాధానం ఏంటి?

ఆడవారు ఎవరికీ సొత్తు కాదని, ప్రతి మహిళకు తనదైన గుర్తింపు, ఆత్మగౌరవం ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

నెటిజన్ కు సీరత్ కపూర్ ఇచ్చిన రిప్లై ఇలా..
నెటిజన్ కు సీరత్ కపూర్ ఇచ్చిన రిప్లై ఇలా..
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More