భార్యలు ఎందుకు భర్తలను చంపుతారు.. ఓటీటీలోకి సూపర్ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుసిరీస్.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుసిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆడవాళ్లు ఎందుకు తమ భర్తలను చంపుతారన్న యాంగిల్లో ఈ సిరీస్ సాగనుంది. తాజాగా రిలీజై టీజర్ ఆసక్తి రేపేలా సాగింది.
భార్యాభర్తల సంబంధాల్లోని చీకటి కోణాలను, కుటుంబాల్లో జరిగే దారుణాలను కళ్లకు కట్టే జానర్ ‘ట్రూ క్రైమ్’. ఈ కోవలో వస్తున్న లేటెస్ట్ సిరీస్ 'హనీమూన్ సే హత్య' (Honeymoon Se Hatya). భర్తలను చంపిన భార్యల కథలతో, ఆ నేరాల వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తూ ఈ సిరీస్ రాబోతోంది. జనవరి 9 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేశారు.

హనీమూన్ సే హత్య టీజర్
పెళ్లి అనే బంధం ప్రేమతో మొదలై.. ద్వేషంతో ఎలా ముగుస్తుందో, ఒక పవిత్రమైన బంధం హంతక ఆలోచనగా ఎలా మారుతుందో ఈ హనీమూన్ సే హత్య డాక్యు-సిరీస్ చూపిస్తుంది. ఈ సిరీస్ టీజర్ చాలా బోల్డ్ గా, గగుర్పాటు కలిగించేలా ఉంది. కేవలం వార్తలను చూపించడమే కాకుండా.. "అసలు ఆడవాళ్లు తమ భర్తలను ఎందుకు చంపుతున్నారు?" అనే కఠినమైన ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు.
ప్రేమ, నమ్మకంతో మొదలైన పెళ్లిళ్లు హింస వైపు ఎలా మళ్లుతున్నాయి? ఈ హత్యల వెనుక ఉన్న మానసిక, సామాజిక, భావోద్వేగ కారణాలను లోతుగా విశ్లేషించారు. జరిగిన సంఘటనలను అతిగా చేసి చూపించకుండా, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తూ.. మన చుట్టూ ఉన్న సాధారణ ఇళ్లలో ఎంతటి ఘర్షణలు దాగి ఉంటాయో ఆలోచింపజేసేలా టీజర్ ఉంది.
ఏయే రియల్ లైఫ్ కేసులను చూపిస్తున్నారు?
ఇండియాలో సంచలనం సృష్టించిన అత్యంత దారుణమైన కేసులను ఈ సిరీస్ లో ప్రస్తావించనున్నారు. అందులో ముఖ్యమైనవి ఇవీ..
మేఘాలయ సోనమ్ రాజా రఘువంశీ కేసుతోపాటు మీరట్ బ్లూ డ్రమ్ కేసు, భివానీ ఇన్‌ఫ్లుయెన్సర్ కేసు, ముంబై టైల్ కేసు / నలసొపారా టైల్ కేసు, ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేసుల గురించి ఈ సిరీస్ లో ప్రస్తావించనున్నారు.
హనీమూన్ సే హత్య సిరీస్ ప్రత్యేకతలు
ఈ హనీమూన్ సే హత్య కేవలం కథనం మాత్రమే కాదు. ఇందులో ఇంటర్వ్యూలు, పాత ఆర్కైవల్ ఫుటేజ్, వాస్తవాల ఆధారంగా సాగే నేరేషన్ ఉంటుంది. ప్రేమ, అనుబంధం అనే సాధారణ భావోద్వేగాలు.. నియంత్రణ, ద్రోహం, కోపం, పగగా ఎలా మారుతాయో చూపిస్తుంది. 'హనీమూన్' అంటే రొమాంటిక్ ఐడియా. కానీ అది కాస్తా ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ సిరీస్ చర్చిస్తుంది. ఈ డాక్యు సిరీస్ జనవరి 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


