OTT Crime Thriller: ముంబై పేలుళ్లపై వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.4 రేటింగ్.. ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీ.. ఇక్కడ చూడండి

OTT Crime Thriller: క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే ఒక అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రం 'బ్లాక్ ఫ్రైడే' (Black Friday). 1993 మార్చి 12న ముంబై నగరాన్ని వణికించిన వరుస బాంబు పేలుళ్లు, ఆ తర్వాత ముంబై పోలీసులు సాగించిన దర్యాప్తు ఆధారంగా రూపొందింది.

Published on: Nov 14, 2026, 08:51:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller: ఓటీటీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల కోసం చూస్తుంటే ఈ మూవీ మీకోసమే. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు బ్లాక్ ఫ్రైడే. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.4 రేటింగ్ ఉండటం విశేషం.

OTT Crime Thriller: ముంబై పేలుళ్లపై వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.4 రేటింగ్.. ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీ.. ఇక్కడ చూడండి
OTT Crime Thriller: ముంబై పేలుళ్లపై వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.4 రేటింగ్.. ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీ.. ఇక్కడ చూడండి

బ్లాక్ ఫ్రైడే మూవీ స్టోరీ ఏంటంటే?

2004లో రిలీజైన సినిమా బ్లాక్ ప్రైడే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనలను ఇంతటి నిజాయితీతో, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరపై ఆవిష్కరించిన చిత్రాలు చాలా అరుదు. 1992 డిసెంబర్‌లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ తర్వాత 1993 జనవరిలో ముంబైలో చెలరేగిన మత ఘర్షణలతో ఈ సినిమా కథ మొదలవుతుంది.

ఆ అల్లర్లలో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమన్ (పవన్ మల్హోత్రా) ఒక భయంకరమైన కుట్రకు పథకం రచిస్తాడు. ముంబై వ్యాప్తంగా వరుస బాంబు పేలుళ్లు జరపాలని నిర్ణయించుకుని, ఇందుకోసం పాకిస్థాన్‌లో యువకులకు ఆయుధ శిక్షణ ఇప్పించడంతో పాటు భారీ ఎత్తున ఆర్‌డిఎక్స్ (RDX), ఆయుధాలను ముంబైకి చేరవేస్తాడు. 1993 మార్చి 12న ముంబై నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.

డీసీపీ రాకేష్ మారియా వేట.. అప్రూవర్‌గా మారిన బాద్‌షా ఖాన్!

పేలుళ్ల తర్వాత ముంబై పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. నిజాయితీగల, కఠినమైన పోలీస్ అధికారి డీసీపీ రాకేష్ మారియా (కేకే మీనన్) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించే పనిలో పడుతుంది.

ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన 'బాద్‌షా ఖాన్' (ఆదిత్య శ్రీవాస్తవ) పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. పేలుళ్ల తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరిగిన బాద్‌షా ఖాన్, చివరకు సొంత మనుషుల చేతిలోనే మోసపోయి పోలీసులకు చిక్కుతాడు.

మొదట తన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందని అతడు, ఆ తర్వాత నిజం గ్రహించి అప్రూవర్ గా మారతాడు. పాకిస్థాన్‌లో శిక్షణ ఎలా జరిగింది? ముంబైలోకి ఆర్‌డిఎక్స్ ఎలా వచ్చింది? అనే కీలక రహస్యాలను అతడు బయటపెట్టే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ పుస్తకం ఆధారంగా..

ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ ఎస్. హుస్సేన్ జైదీ రచించిన ‘బ్లాక్ ఫ్రైడే: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది బాంబే బాంబ్ బ్లాస్ట్స్’ అనే పరిశోధనాత్మక పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్వయంగా హుస్సేన్ జైదీ, పీయూష్ మిశ్రాతో కలిసి ఈ చిత్రానికి అత్యంత పదునైన స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.

కేకే మీనన్, పవన్ మల్హోత్రా, ఆదిత్య శ్రీవాస్తవ తమ పాత్రల్లో జీవించేశారు. ఇందులోని ముంబై వీధుల ఛేజింగ్ సన్నివేశాలు, ఇండియన్ ఓషన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఐఎండీబీ (IMDb)లో 8.4/10 రేటింగ్ సాధించిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అత్యధిక ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా కొనసాగుతోంది.

సస్పెన్స్, వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చూడాల్సిన చిత్రం 'బ్లాక్ ఫ్రైడే'. ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More