...
...
Next Story

OTT Crime Thriller: ఓటీటీలో కంటతడి పెట్టించే మాస్టర్‌పీస్.. 2 నేషనల్ అవార్డులు,13 ఏళ్ల తర్వాత వచ్చిన థ్రిల్లర్ ఎలా ఉంది?

OTT Crime Thriller: ఓటీటీలోకి ఒకటి, రెండు నెలలు, సంవత్సరాలు కాదు ఏకంగా 13 ఏళ్ల తర్వాత ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన షాహిద్ అనే ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Oct 3, 2026, 09:20:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Crime Thriller: రెండు నేషనల్ అవార్డులు కొల్లగొట్టి, 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో ఇండియన్ సినిమాలో క్లాసిక్‌‌గా నిలిచిన రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) నటించిన బయోపిక్ మూవీ 'షాహిద్' (Shahid) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ మాస్టర్‌పీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కి దిగడం మూవీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ మూవీ ఏంటి? ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా..

OTT Crime Thriller: ఓటీటీలో కంటతడి పెట్టించే మాస్టర్‌పీస్.. 2 నేషనల్ అవార్డులు,13 ఏళ్ల తర్వాత వచ్చిన థ్రిల్లర్ ఎలా ఉంది?
OTT Crime Thriller: ఓటీటీలో కంటతడి పెట్టించే మాస్టర్‌పీస్.. 2 నేషనల్ అవార్డులు,13 ఏళ్ల తర్వాత వచ్చిన థ్రిల్లర్ ఎలా ఉంది?

ముంబైకి చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ లాయర్ షాహిద్ అజ్మీ (Shahid Azmi) నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో ముంబైలోని తన ఆఫీస్‌లోనే దుండగులు ఆయన్ని దారుణంగా కాల్చి చంపారు.

ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు షాహిద్ పాత్రలో తన నటనతో ప్రాణం పోశారు. 1992 ముంబై ఘర్షణల నుంచి కథ మొదలవుతుంది. ఆ వర్గపోరులో తన కుటుంబం అనుభవించిన భయాన్ని చూసి తీవ్రంగా చలించిపోయిన షాహిద్.. ఆవేశంలో కశ్మీర్ వెళ్లి తీవ్రవాద క్యాంప్‌లో చేరుతాడు.

తీహార్ జైలు నుంచి లాయర్ వరకు.. ఊహించని మలుపులు

అక్కడ జరిగే ఒక నరమేధాన్ని చూసి తట్టుకోలేక షాహిద్ మళ్లీ ముంబైకి తిరిగొచ్చేస్తాడు. కానీ అప్పటికే ఆయనపై టాడా (TADA) యాక్ట్ కింద కేసు నమోదవ్వడంతో తీహార్ జైలులో ఏడేళ్ల శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

జైలులో ఉన్న టైమ్‌లోనే చదువు ప్రాముఖ్యత తెలుసుకుని, బయటకు వచ్చాక కష్టపడి లా (Law) పూర్తి చేస్తాడు. లాయర్ అయిన తర్వాత ఉగ్రవాదం పేరిట అక్రమంగా అరెస్టయిన అమాయక ముస్లిం యువకుల తరఫున కోర్టులో ఒంటరి పోరాటం చేయడం మొదలుపెడతాడు.

రాజ్‌‌కుమార్ రావు కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్

ఈ సినిమాలో చూపించిన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాకి గాను 2014లో హన్సల్ మెహతాకి బెస్ట్ డైరెక్టర్, రాజ్‌కుమార్ రావుకి బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఏకంగా రెండు నేషనల్ అవార్డులు లభించాయి.

త్వరలోనే 'ప్రహార్' తో మరో పవర్‌ఫుల్ లాయర్ రోల్

షాహిద్ సినిమా రాజ్‌కుమార్ రావు కెరీర్‌నే మలుపు తిప్పిన బెస్ట్ మూవీగా నిలిచింది. కాగా ఈ నటుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత మరో పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్' (Prahaar: The Untold Story of Ujjwal Nikam) సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 16న ఈ బయోపిక్ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అభినాష్ అరుణ్ ధవారే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జైదీప్ అహ్లావత్, వామిగా గబ్బి, సికిందర్ ఖేర్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఓ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ వీకెండ్ కచ్చితంగా ప్లాన్ చేసుకోండి. కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిస్ సబ్ టైటిల్స్ తోనే ఈ సినిమా అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks