OTT Crime Thriller: హత్యలు చేసే ఆటో డ్రైవర్.. రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. 10 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశారా?

OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియెన్స్ కు ఆటో శంకర్ అనే ఓ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్న విషయం తెలుసా? జీ5 ఓటీటీలో ఉన్న ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Oct 6, 2026, 15:43:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller: ఆటో డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, మద్రాస్ క్రైమ్ రాజ్యాన్ని శాసించిన రియల్ సైకో కిల్లర్ కథే 'ఆటో శంకర్' (Auto Shankar). 1980ల నాటి భయానక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 (ZEE5) ఓటీటీలో దుమ్మురేపుతోంది.

OTT Crime Thriller: హత్యలు చేసే ఆటో డ్రైవర్.. రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. 10 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశారా?
OTT Crime Thriller: హత్యలు చేసే ఆటో డ్రైవర్.. రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. 10 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూశారా?

ఆటో శంకర్.. అసలు కథేంటి? ఒక ఆటో డ్రైవర్ డాన్‌గా ఎలా మారాడు?

ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అందులోనూ రియల్ సైకో కిల్లర్ స్టోరీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే జీ5 ఓటీటీలో ఉన్న ఈ ఆటో శంకర్ వెబ్ సిరీస్. అసలు ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

పగటిపూట సాదాసీదా ఆటో నడిపే శంకర్ (అప్పాని శరత్), రాత్రి వేళల్లో సారా స్మగ్లింగ్ చేసేవాడు. ఆ క్రమంలో స్థానికంగా తనకు ఎదురొచ్చిన వాళ్లను తొక్కేస్తూ తన నేర సామ్రాజ్యాన్ని ఊహించని రేంజ్‌లో విస్తరించాడు.

అక్రమ రవాణా, బెదిరింపులు, వ్యభిచార గృహాల నిర్వహణతో పాటు రాజకీయ నాయకులు, కొందరు అవినీతి పోలీస్ ఆఫీసర్ల సపోర్ట్‌తో చెన్నై నగరంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. తన దారికి అడ్డువచ్చిన వారిని అతి దారుణంగా నరికి చంపేసేవాడు.

ఈ క్రమంలో శంకర్ చేసిన వరుస క్రూరమైన హత్యలు నగరంలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత పోలీసులు శంకర్‌ను పట్టుకోవడానికి వేసిన స్పెషల్ స్కెచ్, జైలు నుంచి అతను పారిపోయేందుకు చేసిన ప్లాన్స్, చివరకు అతనికి విధించిన ఉరిశిక్ష ఈ సిరీస్‌ను నెక్ట్స్ లెవల్‌లో నిలబెట్టాయి.

'అంగమాలి డైరీస్' ఫేమ్ అప్పాని శరత్ నటన కేక

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ హీరో అప్పాని శరత్ యాక్టింగ్. మలయాళంలో 'అంగమాలి డైరీస్', తమిళంలో 'సందకోళి 2' లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శరత్.. ఈ ఆటో శంకర్ క్యారెక్టర్‌లో జీవించేశాడు.

అతని కళ్లలో కనిపించే వైలెంట్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. రంగా యల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కి సౌండ్ డిజైన్, డార్క్ సినిమాటోగ్రఫీ డ్రెడ్‌ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి.

తెలుగులోనూ స్ట్రీమింగ్.. 10 ఎపిసోడ్లు

మొత్తం 10 ఎపిసోడ్లు ఉండే ఈ వెబ్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో సాగుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ను సీటు అంచున కూర్చోబెడతాయి.

ఐఎండీబీ (IMDb)లో ఈ వెబ్ సిరీస్‌కు 6.7/10 రేటింగ్ లభించింది. మూల కథ తమిళంలో తెరకెక్కినప్పటికీ, జీ5 ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో డబ్బింగ్ వర్షన్లు అందుబాటులో ఉన్నాయి.

రియల్ క్రైమ్ స్టోరీస్, డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే క్రైమ్ ఫిక్షన్ ప్రియులకు 'ఆటో శంకర్' ఒక పర్ఫెక్ట్ బింజ్ వాచ్ ఆప్షన్. వీకెండ్‌లో మైండ్ షేక్ చేసే క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే జీ5లో ఈ సిరీస్‌పై ఒక లుక్కేసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More