OTT Crime Thriller: తల లేని మొండెం.. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా?

OTT Crime Thriller: ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. జనావర్ అనే ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ తల లేని మొండెం, దాని చుట్టూ సాగే విచారణే ఈ సిరీస్ కథాంశం.

Published on: Sep 30, 2026, 21:31:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చూసే అలవాటు ఉంటే మీకో మైండ్ బ్లాకింగ్ ఆప్షన్ చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. 'ఫర్జీ' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు భువన్ అరోరా (Bhuvan Arora) లీడ్ రోల్‌లో నటించిన డార్క్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ 'జనావర్' (Janaavar) ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓటీటీ జనాలు ఈ 7 ఎపిసోడ్ల సిరీస్‌ను తెగ బింజ్ వాచ్ చేస్తున్నారు.

OTT Crime Thriller: తల లేని మొండెం.. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా?
OTT Crime Thriller: తల లేని మొండెం.. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా?

అసలు 'జనావర్' కథ ఏంటి? గూస్‌బంప్స్ తెప్పించే ప్లాట్

సబ్-ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్ (భువన్ అరోరా) ఒక వారం పాటు హాయిగా సెలవుల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. సరిగ్గా అదే టైమ్‌లో ఊరిలో ఊహించని గందరగోళం మొదలవుతుంది. దాంతో ఆయన వెకేషన్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది.

పై అధికారుల నుంచి హేమంత్‌కు రెండు పెద్ద కేసుల బాధ్యత అప్పగిస్తారు. ఒకటి లోకల్ బంగారం దొంగతనం కాగా, రెండోది ఆ ప్రాంతంలో అత్యంత పవర్‌ఫుల్ పొలిటీషియన్, ఎమ్మెల్యే తమ్ముడు సర్జూ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం.

ఈ రెండు కేసుల ఇన్వెస్టిగేషన్ మొదలైన కొద్దిసేపటికే దట్టమైన అడవిలో తల లేని ఒక మొండెం లభ్యమవుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కనిపెట్టే క్రమంలో హేమంత్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.

కుల వివక్ష, పొలిటికల్ ప్రెజర్ మధ్య పోలీస్ వేట

ఆ తల లేని మొండెం ఎవరిదో గుర్తించడానికి పోలీస్ టీమ్ పడే పాట్లు, ఆ క్రమంలో ఎదురయ్యే గిరిజన ఉద్యమాలు, కస్టడీ వైలెన్స్ ప్రేక్షకులను సీటు ఎడ్జ్ పై కూర్చోబెడతాయి. ఇవన్నీ ఒకెత్తయితే, డిపార్ట్‌మెంట్‌లోనూ, సొసైటీలోనూ హేమంత్ తన కులం వల్ల ఫేస్ చేసే వివక్ష ఈ కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగంలో వచ్చే పొలిటికల్ ప్రెజర్‌ను తట్టుకుంటూ హేమంత్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడనేది డైరెక్టర్ షచింద్ర వత్స్ చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. ప్రతీ ఎపిసోడ్ ముగింపులో ఇచ్చే ట్విస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడకుండా ఉండలేకుండా చేస్తుంది.

భువన్ అరోరా వన్ మ్యాన్ షో.. కేవలం 15 రోజుల్లోనే షూటింగ్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో 'ఫర్జీ' వెబ్ సిరీస్‌‌లో ఫిరోజ్ పాత్రలో అలరించిన భువన్ అరోరా.. ఈ సిరీస్‌లో హేమంత్ కుమార్‌గా ఒదిగిపోయారు. ఒక వైపు బాధ్యత గల పోలీస్‌గా, మరోవైపు సామాజిక వివక్షకు గురయ్యే సగటు మనిషిగా ఆయన పండించిన ఎమోషన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి.

ఈ సిరీస్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. డైరెక్టర్ షచింద్ర వత్స్ ఈ 7 ఎపిసోడ్ల భారీ సిరీస్ షూటింగ్‌ను కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ విషయాన్ని భువన్ అరోరా స్వయంగా వెల్లడించారు. డైరెక్టర్‌కు ఎడిటింగ్ పాయింట్స్‌పై పూర్తి క్లారిటీ ఉండటం వల్లే అంత తక్కువ టైమ్‌లో ఈ క్వాలిటీ అవుట్‌‌పుట్ తీసుకురాగలిగారని ఆయన ప్రశంసించారు.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఐఎండీబీ రేటింగ్ ఎంత?

ప్రస్తుతం ఈ మైండ్ బ్లాకింగ్ డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల ఆడియెన్స్‌ను కూడా ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఐఎండీబీ (IMDb)లో ఈ సిరీస్ 6.7 రేటింగ్‌ సాధించి టాప్ ట్రెండింగ్ పొజిషన్‌లో కొనసాగుతోంది. వీకెండ్‌లో మంచి థ్రిల్లింగ్ కంటెంట్ చూడాలనుకునే క్రైమ్ లవర్స్‌కి 'జనావర్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More