కంటెంటే హీరో.. కథలో సత్తా ఉంటేనే థియేటర్లకు వస్తారు.. ఈ రెండు సినిమాలే నిదర్శనం: బాలీవుడ్ నటుడు
Hanuman Ansh: ఆడియెన్స్ థియేటర్లకు రావాలంటే కంటెంటే హీరో అని స్పష్టం చేశారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. రీసెంట్ గా వచ్చిన లోబడ్జెట్ మూవీస్ హనుమాన్ అంశ్, అబ్సెషన్ సినిమాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Hanuman Ansh: భారీ బడ్జెట్‌లు, వందల కోట్ల రెమ్యునరేషన్లు కాదు.. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేది కేవలం కంటెంట్, అసలైన కథలు మాత్రమేనని బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా తేల్చి చెప్పారు. ముంబైలోని గ్రాండ్ హయత్ వేదికగా జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 2026 (FICCI Frames 2026) ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో రీసెంట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'హనుమాన్ అంశ్', హాలీవుడ్ హారర్ మూవీ 'అబ్సెషన్' సినిమాల సక్సెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

స్టార్ పవర్ కంటే కంటెంట్ గొప్పదని చెప్పడానికి ఈ రెండు సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని ఆయుష్మాన్ అన్నారు. ప్రేక్షకులు ఓటీటీలు, రకరకాల ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ చూస్తున్న ఈ రోజుల్లో థియేటర్‌కి రావాలంటే కథలో సత్తా ఉండాలని స్పష్టం చేశారు.
రూ.2 కోట్ల బడ్జెట్.. ఏకంగా రూ.300 కోట్ల సునామీ
విశాల్ చతుర్వేది డైరెక్షన్‌లో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' మూవీ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (మహారాజ్ జీ) జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. కేవలం రూ.2 కోట్ల అత్యల్ప బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ.10 లక్షల ఓపెనింగ్స్ మాత్రమే సాధించింది. కానీ వర్డ్ ఆఫ్ మౌత్‌తో పుంజుకుని, థియేటర్లలో ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకుని ఇండియాలో రూ.300 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.
లక్ష్మణ్ దాస్ ఆధ్యాత్మిక ప్రయాణం, 13 ఏళ్ల వయస్సు నుంచి ఆయన నీమ్ కరోలీ బాబాగా ఎలా మారారనేది నటుడు శోభినావ్ సత్య తన అద్భుత నటనతో ఆవిష్కరించారు. నాలుగో వారంలో ఈ సినిమా చూపించిన గ్రోత్ బాక్సాఫీస్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.
7 లక్షల డాలర్ల బడ్జెట్.. 30 కోట్ల డాలర్ల హాలీవుడ్ మ్యాజిక్
మరోవైపు హాలీవుడ్‌లో రిలీజైన 'అబ్సెషన్' హారర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 20 ఏళ్ల యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు 700k డాలర్ల (రూ. 5 నుండి 6 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో రూపొందించారు. కానీ థియేటర్లలో ఈ సినిమా ఏకంగా $300 మిలియన్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
ఒక మాయా వస్తువు (వన్ విష్ విల్లో) ద్వారా తాను ప్రేమించిన అమ్మాయిని వశపరుచుకోవాలనుకునే ఒక కుర్రాడి కథతో ఈ సినిమా సాగుతుంది. మైకేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సీటు అంచున కూర్చోబెట్టే సైకలాజికల్ హార్రర్ డ్రామా గ్లోబల్ వైడ్‌గా పిచ్చి క్రేజ్ తెచ్చుకుంది.
'ఉడ్తా తీర్'తో ఒరిజినల్ రూట్‌లోకి ఆయుష్మాన్
తన కెరీర్ గురించి చెబుతూ.. "నా మొదటి సినిమా నుంచీ కథనే అసలైన సూపర్‌స్టార్ అని నమ్మాను. ఇప్పటివరకు చేసిన 20కి పైగా సినిమాల్లో రకరకాల జానర్లు ట్రై చేశాను. కానీ ఇప్పుడు మళ్లీ నా ఒరిజినల్ రూట్ అయిన అథెంటిక్ స్టోరీ టెల్లింగ్‌కి వెళ్తున్నాను" అని ఆయుష్మాన్ అన్నారు.
ప్రస్తుతం ఆయన 'ఉడ్తా తీర్' అనే స్పై కామెడీ సినిమాలో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్, డెన్జిల్ డియాస్ (వార్నర్ బ్రదర్స్) సమక్షంలో జరిగిన ఈ ప్యానెల్ డిస్కషన్‌లో ఆయుష్మాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


