Critics Choice Awards 2026: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు.. బెస్ట్ మూవీ, బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ సినిమాకు 4..

Critics Choice Awards 2026: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు 2026లో జాన్వీ కపూర్ హోమ్‌బౌండ్ మూవీతోపాటు వెబ్ సిరీస్ బ్లాక్ వారెంట్ అవార్డుల పంట పండించాయి. ఈ రెండూ నాలుగేసి అవార్డులను సొంతం చేసుకున్నాయి.

Published on: Mar 24, 2026, 22:09:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్ మంగళవారం (మార్చి 24) సాయంత్రం ఎంతో ప్రతిష్టాత్మకమైన 8వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2026 విజేతల వివరాలను గ్రాండ్‌గా అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల వేడుకలో ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 'హోమ్‌బౌండ్' సినిమా ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి సత్తా చాటింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (నీరజ్ ఘైవాన్), బెస్ట్ యాక్టర్ (విశాల్ జేత్వా), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (షాలిని వత్స) విభాగాల్లో ఈ సినిమా క్లీన్ స్వీప్ చేసింది.

Critics Choice Awards 2026: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు.. బెస్ట్ మూవీ, బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ సినిమాకు 4..
Critics Choice Awards 2026: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు.. బెస్ట్ మూవీ, బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ సినిమాకు 4..

అలాగే 'ఆగ్రా' సినిమాకుగానూ ప్రియాంక బోస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకోగా.. 'బైసన్ కాలమాడన్' సినిమాలో అద్భుతంగా నటించిన పశుపతి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఇక టెక్నికల్, రైటింగ్ విభాగాల విషయానికొస్తే.. ‘సబర్ బోండా’కుగానూ రోహన్ పరశురామ్ కనవాడే రైటింగ్ అవార్డు గెలుచుకున్నాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో సునీల్ బోర్కర్ ('జుగ్నుమా'), చమన్ చక్కో ('లోకా చాప్టర్ 1: చంద్ర') వరుసగా విజేతలుగా నిలిచారు. వెబ్ సిరీస్ కేటగిరీలో 'బ్లాక్ వారెంట్' ఏకంగా నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది.

బెస్ట్ వెబ్ సిరీస్‌తో పాటు ఇందులో నటించిన రాహుల్ భట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అలాగే బాగా పాపులర్ అయిన 'పాతాళ్ లోక్ సీజన్ 2' లో అద్భుతంగా నటించిన జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటుడిగా, తిలోత్తమ షోమ్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకోవడం విశేషం. ఇండియన్ సినిమాకు ఎనలేని సేవలు చేసిన సీనియర్ నటి ఫరీదా జలాల్‌కు స్పెషల్ అవార్డు దక్కడం అందరినీ ఆకట్టుకుంది.

8వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2026 విజేతల పూర్తి జాబితా

షార్ట్ ఫిల్మ్స్ విభాగం

ఉత్తమ చిత్రం: మాయ్ బాపాచే ఆశీర్వాద్

ఉత్తమ దర్శకుడు: అపూర్వ బర్దాపూర్కర్ (మాయ్ బాపాచే ఆశీర్వాద్)

ఉత్తమ నటుడు: సన్నీ హిందూజా (దట్స్ ఏ రాప్)

ఉత్తమ నటి: షీబా చద్దా (నిఘియాన్ ఛావాన్)

ఉత్తమ రైటింగ్: అపూర్వ బర్దాపూర్కర్ (మాయ్ బాపాచే ఆశీర్వాద్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సౌరభ్ సుమన్ (ఆస్మానీ ఝూలా)

వెబ్ సిరీస్ విభాగం

ఉత్తమ వెబ్ సిరీస్: బ్లాక్ వారెంట్

ఉత్తమ దర్శకులు: విక్రమాదిత్య మోత్వానే, సత్యాంశు సింగ్, అర్కేష్ అజయ్, రోహిన్ రవీంద్రన్ నాయర్, అంబికా పండిట్ (బ్లాక్ వారెంట్)

ఉత్తమ నటుడు: జైదీప్ అహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)

ఉత్తమ నటి: మోనికా పన్వార్ (ఖౌఫ్)

ఉత్తమ సహాయ నటుడు: రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)

ఉత్తమ సహాయ నటి: తిలోత్తమ షోమ్ (పాతాల్ లోక్ సీజన్ 2)

ఉత్తమ రైటింగ్: సత్యాంశు సింగ్, అర్కేష్ అజయ్ (బ్లాక్ వారెంట్)

ఫీచర్ ఫిల్మ్స్ విభాగం

ఉత్తమ చిత్రం: హోమ్‌బౌండ్

ఉత్తమ దర్శకుడు: నీరజ్ ఘైవాన్ (హోమ్‌బౌండ్)

ఉత్తమ నటుడు: విశాల్ జేత్వా (హోమ్‌బౌండ్)

ఉత్తమ నటి: ప్రియాంక బోస్ (ఆగ్రా)

ఉత్తమ సహాయ నటుడు: పశుపతి (బైసన్ కాలమాడన్)

ఉత్తమ సహాయ నటి: షాలిని వత్స (హోమ్‌బౌండ్)

ఉత్తమ రైటింగ్: రోహన్ పరశురామ్ కనవాడే (సబర్ బోండా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సునీల్ బోర్కర్ (జుగ్నుమా)

ఉత్తమ ఎడిటింగ్: చమన్ చక్కో (లోకహ్ చాప్టర్ 1: చంద్ర)

జెండర్ సెన్సిటివిటీ అవార్డ్: స్థల్

డాక్యుమెంటరీ & స్పెషల్ అవార్డు

ఉత్తమ డాక్యుమెంటరీ: ఐ, పాపీ

ఎక్స్‌ట్రార్డినరీ కాంట్రిబ్యూషన్ టు సినిమా: ఫరీదా జలాల్

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More