OTT Most Watched: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ ఇవే.. జియోహాట్‌స్టార్ హవా
OTT Most Watched: ఓటీటీలో గతవారం అంటే మార్చి 16 నుంచి 22 మధ్య ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ వివరాలను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో జియోహాట్‌స్టార్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇండియాలో గత వారం రోజుల్లో ఓటీటీలో జనాలు దేనికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారో, వేటికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయో చెబుతూ ఆర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చేసింది. మార్చి 16 నుంచి 22 వరకు ఇండియాలో అత్యధికంగా చూసిన టాప్ 10 ఓటీటీ కంటెంట్ వివరాలను ఆర్మాక్స్ మీడియా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ టీవీ షోలు అన్నీ ఉన్నాయి. ఈ వారం లిస్ట్‌ను ఒకసారి గమనిస్తే.. జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ ఏకంగా ఐదు షోలతో టాప్ 10 లిస్ట్‌ను పూర్తిగా డామినేట్ చేసింది.

టాప్ 10 ఓటీటీ కంటెంట్ లిస్ట్ ఇదే
మొదటి స్థానం: జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ది 50' షో ఏకంగా 8.8 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని, మిగతా వాటికి అందనంత ఎత్తులో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచి దుమ్ములేపింది.
రెండో స్థానం: జియో హాట్‌స్టార్‌కే చెందిన పాపులర్ సిరీస్ ‘నాగిన్ సీజన్ 7’కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇది 4.6 మిలియన్ వ్యూస్‌తో సత్తా చాటింది.
మూడో స్థానం: మన ఎవర్ గ్రీన్ కామెడీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' 3.6 మిలియన్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ఇది యూట్యూబ్ సోనీ సబ్, సోనీ లివ్ యాప్‌లో అందుబాటులో ఉంది.
నాలుగో స్థానం: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన భారీ యాక్షన్ సినిమా 'బోర్డర్ 2' 3.5 మిలియన్ల వ్యూస్ రాబట్టి ఈ లిస్ట్‌లో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.
ఐదో స్థానం: జియో హాట్‌స్టార్ టెలివిజన్ డ్రామా 'అనుపమ' 3.4 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది.
ఆరో స్థానం: అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమ్ అవుతున్న 'సంకల్ప్' షో 3.3 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని ఆరో స్థానంలో ఉంది.
ఏడో స్థానం: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్ సీజన్ 3'.. 3.2 మిలియన్ వ్యూస్ రాబట్టింది. యూత్‌కి ఈ సిరీస్ భలే కనెక్ట్ అయిపోయింది.
ఎనిమిదో స్థానం: జియో హాట్‌స్టార్‌లో వస్తున్న 'లాఫర్ షెఫ్స్ సీజన్ 3' షో కూడా 3.2 మిలియన్ వ్యూస్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉంది.
తొమ్మిదో స్థానం: అనిల్ కపూర్ నటించి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన 'సుబేదార్' మూవీ 2.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని తొమ్మిదో స్థానంలో నిలిచింది.
పదో స్థానం: జియో హాట్‌స్టార్ ఓటీటీలో వస్తున్న 'స్ప్లిట్స్‌విల్లా ఎక్స్6' షో కూడా 2.9 మిలియన్ వ్యూస్‌తో ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు సంపాదించింది.
మొత్తానికి గత వారం చూసుకుంటే ఓటీటీలో రియాలిటీ షోస్, యాక్షన్ సినిమాలు, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని జానర్స్‌ను ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు ఈ టాప్ 10 లిస్ట్ చూస్తే స్పష్టమవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


