Daisy Shah: అమ్మాయిలు నన్ను తాకినా నాకు నచ్చదు.. అలాంటిది ఆ సౌత్ డైరెక్టర్ నన్ను అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్ కామెంట్స్
Daisy Shah: బాలీవుడ్ నటి డైసీ షా ఓ సౌత్ డైరెక్టర్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు తనను చాలా అసభ్యంగా తాకాడని, అది తనకు అస్సలు నచ్చలేదని చెప్పింది. తనను అమ్మాయిలు తాకితేనే నచ్చదని, అలాంటిది ఓ మగాడు అలా చేయడంతో షాక్ తిన్నట్లు తెలిపింది.
Daisy Shah: సల్మాన్ ఖాన్ సరసన ‘జై హో’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి డైసీ షా (Daisy Shah).. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. ఒక దక్షిణాది దర్శకుడు ఆడిషన్స్ పేరుతో ముంబై వచ్చి.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆడిషన్ సమయంలో చేతిని పట్టుకుని..
తమిళం లేదా మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక దర్శకుడు కాస్టింగ్ కోసం ముంబైకి వచ్చాడని, అప్పుడు జరిగిన విషయాన్ని డైసీ షా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"మేము ఒక ఆరు, ఏడుగురు అమ్మాయిలం అతడిని కలవడానికి వెళ్ళాము. అతను ప్రతి ఒక్కరినీ విడిగా కలుస్తున్నాడు. నా వంతు వచ్చినప్పుడు అతను నా పట్ల ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. నన్ను తాకడమే కాకుండా, నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది" అని డైసీ గుర్తు చేసుకుంది.
"అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను"
తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ.. తనకు ఎవరైనా దగ్గరకు రావడం లేదా తాకడం అంటే ఇష్టం ఉండదని ఆమె తెలిపింది.
"ఎవరైనా నన్ను తాకడం నాకు మొదటి నుండి ఇష్టం ఉండదు. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ తాకినా నాకు నచ్చదు.. అలాంటిది ఒక పురుషుడు అలా ప్రవర్తించడంతో నేను వెంటనే అక్కడి నుండి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అతనికి 'మళ్ళీ కలుస్తాను' అని చెప్పి వచ్చేశాను కానీ, మళ్ళీ ఎప్పుడూ అతడిని కలవలేదు" అని ఆమె స్పష్టం చేసింది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు.
బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ నుండి హీరోయిన్ వరకు
డైసీ షా తన ప్రయాణాన్ని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద అసిస్టెంట్‌గా ప్రారంభించింది. ఎన్నో సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా కనిపించిన ఆమె.. కన్నడ సినిమాలు 'భద్ర', 'బాడీగార్డ్' ద్వారా హీరోయిన్‌గా మారింది. 2014లో సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో'తో బాలీవుడ్‌లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' వంటి చిత్రాల్లోనూ నటించింది.
డైసీ షా ప్రస్తుత ప్రాజెక్టులు
ఇటీవల ఆమె అంజద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘రెడ్ రూమ్’ (Red Room) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఆమె పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో పేరు పెట్టని ఒక థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఇందులో శ్రేయస్ తల్పడే హీరోగా నటిస్తున్నాడు. నటనతో పాటు ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిత్యం వ్లాగ్స్ (Vlogs) షేర్ చేస్తూ దాదాపు 50 వేల మంది సబ్‌స్క్రైబర్లను అలరిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1.డైసీ షా మొదటి సినిమా ఏది?
డైసీ షా కన్నడలో 'భద్ర' చిత్రంతో కథానాయికగా పరిచయమయింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) ఆమెకు మొదటి సినిమా.
2. డైసీ షా ఇటీవల నటించిన వెబ్ సిరీస్ పేరు ఏమిటి?
ఆమె ఇటీవల ‘రెడ్ రూమ్’ (Red Room) అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.
3. డైసీ షా తదుపరి సినిమా ఎవరితో?
నటుడు శ్రేయస్ తల్పడే సరసన పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


