...
...
Next Story

జియోహాట్‌స్టార్‌లోని ఈ మిస్ట‌రీ హార‌ర్ థ్రిల్ల‌ర్ చూశారా? దెయ్యం నుంచి కాపాడే ఇద్ద‌రు న‌న్స్‌-కొరియ‌న్ మూవీ తెలుగులోనూ!

అదిరిపోయే సస్పెన్స్ తో, హడలెత్తించే హారర్ తో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ థ్రిల్లర్ వచ్చేసింది. కొరియన్ హారర్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Nov 5, 2025, 11:00:09 IST
Advertisement

సీన్ సీన్ కూ ఉత్కంఠ పెంచుతూ, వేరే లెవల్ హారర్ తో వణికిించే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ‘డార్క్ నన్స్’ జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెట్టింది. ఓ కుర్రాడికి పట్టే దెయ్యాన్ని తరిమేసేందుకు ఇద్దరు సిస్టర్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమా.

డార్క్ నన్స్ ఓటీటీ

జియోహాట్‌స్టార్‌లో హారర్ థ్రిల్లర్ (jiohotstar)
జియోహాట్‌స్టార్‌లో హారర్ థ్రిల్లర్ (jiohotstar)

కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి కొత్తగా అడుగుపెట్టింది. ఒక గంటా 54 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ థ్రిల్లర్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అదరగొట్టి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ నూ ఎంటర్ టైన్ చేస్తోంది.

తెలుగులోనూ

డార్క్ నన్స్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. కొరియన్ హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీని చూడొచ్చు. హిందీ, తమిళం, తెలుగులో డబ్ చేసి ఓటీటీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సూపర్ హిట్ మూవీకి వాన్ డైరెక్టర్. సాంగ్, జియాన్, లీ జిన్, మూన్ వూ తదితరులు నటించారు.

ఆ మూవీ సీక్వెల్

2015లో వచ్చిన ది ప్రీస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఓ కుర్రాడికి పట్టిన దెయ్యాన్ని ఇద్దరు నన్స్ (సన్యాసినులు) తరిమేస్తారు. ఇప్పుడు ఈ మూవీ ఫ్రాంఛైజీలో భాగంగా డార్క్ నన్స్ పేరుతో సీక్వెల్ వచ్చింది. ఇది 2025 జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

డార్క్ నన్స్ కథ

ఈ పిశాచిని హీ జూన్ లో నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు ఇద్దరు నన్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో 12 ఈవిల్స్ గురించి తెెలుసుకుంటారు. దెయ్యాన్ని తరిమేసే ప్రయత్నంలో ఈ నన్స్ కు ఓ సీక్రెట్ తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడిలోని దెయ్యాన్ని వెళ్లగొట్టారా? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మిస్టరీతో కూడిన హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్లకు డార్క్ నన్స్ నచ్చుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe